For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జుట్టు ఒత్తుగా..స్ట్రాంగ్ గా మరియు పొడవుగా పెరగడానికి టమోటా..కరివేపాకు..క్యారెట్..ఇంకా!!

జుట్టు ఒత్తుగా..స్ట్రాంగ్ గా మరియు పొడవుగా పెరగడానికి టమోటా..కరివేపాకు..క్యారెట్..ఇంకా!!

|

ప్రస్తుత మోడ్రన్ యుగంలో ఎక్కువ మందిని వేదిస్తున్న సమస్య జుట్టు సమస్యలు. వాటిలో ముఖ్యంగా జుట్టు రాలడం లేదా ఆరోగ్యంగా జుట్టు పెరగకపోవడం. ఈ రెండూ సమస్యలను చాలా మంది ఎదుర్కొంటున్నారు. జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే అందుకు తగిన పోషణను అందివ్వాలి. జుట్టు గురించి తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జుట్టు రాలడం మరియు జుట్టు పల్చగా మారడం వంటి సవాళ్లను ఎదుర్కొవల్సి వస్తుంది.

ఇక కొన్ని ప్రత్యేక సందర్బాల్లో మీ పరిస్థితి చేయి దాటినప్పుడు తప్పనిసరిగా డెర్మటాలజిస్టులను కలవాలి. అద్రుష్టవశాత్తు, మన వంటగదిలోనే కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమయ్యే బలాన్ని అందివ్వడంతో పాటు జుట్టును ప్రకాశవంతంగా మార్చుతాయి. అందుకు మన వంటగదిలో ఉండే కూరలు బాగా సహాయపడుతాయి. ఇవి మనం నిత్యం మన వంటల్లో ఉపయోగించేవి కాబట్టి, అదనంగా బ్యూటీ ఉత్పత్తుల కోసం డబ్బు ఖర్చుచేయాల్సిన అవసరం లేదు.

10 Vegetables That Boost Hair Growth When Applied Topically

జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి , స్ట్రాంగ్ గా మంచి రంగుతో ఉండాలంటే అందుకు విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ అవసరం. ఈ విటమిన్స్ మరియు న్యూట్రీషియన్లు వెజిటేబుల్స్ ద్వారా అందుతాయి. వీటిని సమయోచితంగా జుట్టుకు ఉపయోగించినప్పుడు మందపాటి, పొడవాటి మరియు బలమైన జుట్టును పొందుతారు. మరి అందుకు సహాయపడే వెజిటేబుల్స్ గురించి తెలుసుకోవడానికి ఒక లుక్ వేయండి..

ఆకుకూరలు:

ఆకుకూరలు:

ఆకుకూరల్లో ఐరన్, మెగ్నీషియం మరియు విటమిన్ ఎ, సి మరియు డిలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు స్ట్రాంగ్ గా పెరగడానికి సహాయపడటమే కాదు అందుకు అవసరమైన తలలోని చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

బీట్ రూట్ :

బీట్ రూట్ :

బీట్ రూట్ ను సరైన మార్గంలో ఉపయోగించినట్లైతే , ఇందులో ఉండే విటమిన్లు మరియు మినిరల్స్ జుట్టు పెరగడానికి ఖచ్చితంగా సహాయపడుతాయి. బీట్ రూట్ లో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు జుట్టుకు అత్యవసరమయ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి జుట్టు ఆరోగ్యంగా స్ట్రాంగ్ గా పెరగడానికి సహాయపడుతుంది.

గుమ్మడి:

గుమ్మడి:

గుమ్మడిలో యాంటీఆక్సిడెంట్స్ గా పిలవబడే ప్రోటీన్లు, మినరల్స్ మరియు విటమిన్ సి మరియు ఇలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో గొప్పగా సహాయపడుతాయి. అలాగే జింక్ మరియు విటమిన్ సిలు జుట్టు పెరుగుదలకు అవసరమ్యే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇక విటమిన్ ఇ తలలో ఫ్రీరాడికల్ డ్యామేజ్ ను నివారించి తలలో రక్తప్రసరణను మెరుగ్గా ఉంచి జుట్టు స్ట్రాంగ్ గా మరియు పొడవుగా పెరగడాన్ని ప్రోత్సహిస్తుంది.

కీరదోసకాయ:

కీరదోసకాయ:

కీరదోసకాయలో విటమిన్ ఎ, సి మరియు కె మరియు ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ మరియు ఐరన్ వంటి ప్రత్యేకమైన మనిరల్స్ ఉన్నాయి. ఇవన్నీ జుట్టుకు అవసరం అయ్యే ప్రోటీన్లు నష్టపోకుండా జుట్టు పెరగడానికి అవసరమైన పోషణను అందిస్తాయి. దాంతో మీ జుట్టు ఒత్తుగా.. బలంగా పెరుగుతాయి.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ:

జుట్టుకు సరైన పోషణ అందివ్వడం ఉల్లిపాయ ఒకటి. ఎందుకంటే ఇందులో జుట్టు పెరుగుదలకు కావల్సిన జింక్, సల్ఫర్ మరియు ఐరన్ వంటి ప్రత్యేకమైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ తలలో కొల్లాజెన్ ఉత్పత్తిని మరియు రక్తప్రసరణను పెంచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

టమోటోలు:

టమోటోలు:

టమోటోల్లో విటమిన్ సి పుష్కలం. ఇది బలమైన యాంటీఆక్సిండెంట్ గుణాలు కలిగి ఉండి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో తలలో మలినాలు, మురికి తొలగిపోతుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో బీటా కెరోటిన్ కి గొప్ప మూలం. జుట్టు ఆరోగ్యానికి మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి బాగా హెల్ప్ అవుతుంది. వీటితో పాటు విటమిన్ సి మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

క్యారెట్ :

క్యారెట్ :

క్యారెట్ లో విటమిన్ ఎ, సి మరియు బి7 సంవృద్దిగా ఉంటాయి. ఇవి తలలో సెబమ్ ప్రొడక్షన్ ను క్రమబద్దం చేయడానికి మరియు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి. తర్వాత కూడా జుట్టును బలంగా, ఒత్తుగా , ప్రకాశంతంగా మెరిపింపచేస్తాయి.

కరివేపాకు :

కరివేపాకు :

జుట్టు రాలడం ఆపి, జుట్టు బాగా పెరగడంలో పేరుమోసిన రెమెడీ కరివేపాకు. కరివేపాకులో ఉండే యాంటీఆక్సిడెంట్ మరియు కెరోటిన్లు హెల్తీ అండ్ లాంగ్ హెయిర్ ను ఇస్తాయి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి పురాతన కాలం నాటి హోం రెమెడీ. జుట్టు రాలడంతో సహా చర్మ మరియు ఇతర జుట్టు సమస్యలను నివారించడంలో గొప్పది. ఇందులో ఉండే సల్ఫర్ జుట్టు సమస్యలను తీర్చి, జుట్టు పెరిగేలా చేస్తుంది.

English summary

10 Vegetables That Boost Hair Growth When Applied Topically

there are some amazing remedies present as near to you as your kitchen that can help replenish and rejuvenate your hair to boost hair growth. We are talking about the vegetables that are so readily available in your home.
Story first published:Tuesday, October 1, 2019, 15:57 [IST]
Desktop Bottom Promotion