For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగువ అధరాలకు అధనపు ఆకర్షణ కలిగించే లిప్స్ స్టిక్స్

|

Best Lip Colours To Flaunt Dark Skin...!
పెదాల సంరక్షణకు ఈ రోజుల్లో శ్రద్ధ తీసుకోవడంలో మహిళలు పోటీ పడుతున్నారు. ఎందుకంటే ముఖారవిందాన్ని ప్రతిబింబించడంలో పెదాల పాత్ర ఎంతో ఉంది. దాంతో పలు అంతర్జాతీయ కంపెనీలు సైతం మహిళల సౌందర్య ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. మగువల అధరాలకు అందమైన లుక్కు తీసుకురావడంలో లిప్‌ స్టిక్‌ లది ప్రధానపాత్ర.. అధరాలు మాటిమాటికీ తడారిపోవడం సహజం. అయితే ఇప్పుడు మార్కెట్‌ లోకి వచ్చిన ‘స్ప్రింగ్‌‌‌ స్పెషల్‌’ లిప్‌ స్టిక్‌ లు మగువలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే మామూలుగా వాడే లిప్ స్టిక్స్ తోనే న్యూలుక్ తీసుకురావచ్చు. కొన్ని రకాలైన లైట్ కలర్, బ్రైట్ కలర్ లిప్ స్టిక్స్ ను వాడడం ద్వారా మంచి లుక్ తీసుకువాచ్చు. అయితే బ్రైట్ కలర్స్, డ్రాక్ కలర్స్ ఎంచుకొనేటప్పుడు వారివారి శరీర ఛాయను గమనించి లిప్ స్టిక్స్ ఎంచుకోవాలి. న్యూడ్ కలర్స్ ను ఎంపిక చేసుకోవడం ద్వారా పెదవుల్లో తడిఆరిపోయి నిస్తేజంగా మారుతాయి. కాబట్టి చర్మ స్వభావం, ఛాయను బట్టి కూడా లిప్స్ స్టిక్ ఎన్నుకోవాల్సి ఉంటుంది. శరీర ఛాయ..ఛామన ఛాయ, లేదా డార్క్ కలర్ ఉన్నవారు ఎలాంటి లిప్స్ స్టిక్స్ ఎంపిక చేసుకోవాలో చూద్దా...

ఎరుపు: ప్రస్తుత ట్రెండ్ ప్రకారం సాయంత్రం వేళల్లో ధరించే డ్రెస్సులకు తగినవిధంగా బోల్డ్ రంగులను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. వర్కింగ్ మహిళలు కూడా వారు ధరించే దుస్తులకు తగినవిధంగా టాప్స్, షర్ట్స్, బ్లౌజ్ వంటివాటికి తగినవిధంగా ఎరుపు రంగు లిప్స్ స్టిక్స్ ను వినియోగించవచ్చు. శరీర ఛాయ తక్కువగా ఉండి, కొంచెం డార్క్ లకర్ ఉన్నవారు, పెదాలు గ్లాసీగా నిగనిగలాడేలా కనబడటానికి గ్లాసీ ఎరుపు రంగు లిప్స్ స్టిక్ వాడాలి. డార్క్ స్కిన్ కలిగిన మహళలు వైన్ రెడ్ మరియు డార్క్ రెడ్ కలర్స్ బాగా నప్పుతాయి.

పింక్: లైట్ కలర్స్ చూడటానికి అందంగా కనిపిస్తాయి. అయితే ఈ కలర్స్ వినయోగించడం వల్ల ప్రత్యేకంగా కనబడకపోవచ్చు. అయితే చూడటానికి మాత్రం అందంగా కనిపిస్తుంటాయి. పింక్ కలర్ లిప్స్ స్టిక్ వాడేటప్పుడు లిప్ లైనర్ వాడకూడు. అప్పుడు పెదాలు సాధారణ పెదాలను కలిగి ఉంటాయి.

చాక్లెట్ కలర్: చాక్లెట్ కలర్ లిప్స్ స్టిక్ ను సాయంత్రం వేళ అప్లై చేసుకొన్నట్లైతే మరింత ఆకర్షణీయంగా కనబడుతాయి. ఏదైనా కార్యక్రమానికి వెళ్లాలనుకొన్నప్పుడు చామన ఛాయ కలిగిన వారు రిచ్ కోకో కలర్ మరియు చాక్లెట్ కలర్ లిప్స్ స్టిక్స్ ను అప్లై చేస్తే బాగుంటుంది. ఛామన ఛాయ కలిగిన వారు లిప్ కలర్ లిప్స్ స్టిక్ అప్లై చేసినట్లైతే మరింత అందంగా కనబడుతారు.

ద్రాక్షరంగు: ఛామన ఛాయ కలిగిన వారు ద్రాక్ష రంగు లిప్స్ స్టిక్ అప్లై చేసినట్లైతే సౌందర్యం మరింత మెరుగ్గా కనబడుతుంది. డార్క్ చర్మం తత్వం కలిగిన వారు కూడా ద్రాక్ష రంగు లిప్స్ స్టిక్స్ అప్లై చేసి, దాని మీద లిప్ గ్లాస్, లైట్ కలర్ అవుట్ లైన్ వేసుకొంటే, పెదవులు మరింత ఆకర్షణీయంగా కనబడుతూ పార్టీ లో మీరే సౌందర్య రాశిలా కనిపిస్తారు.

English summary

Best Lip Colours To Flaunt Dark Skin...! | మగువ అధరాలకు అధనపు ఆకర్షణ...

Lipstick can add appeal to the lips and make them look juicy and fuller. It can add a glamour to the simple or stylish look. Depending on the occasion and outfit, you can choose lip colours. The skin/complexion can make it confusing to choose the best colour which blends well with the skin tone. Women with dark skin/complexion have to be very careful while choosing lipstick colours. Nude colours can make them look dull and spoil the glossy evening look.
Story first published:Monday, May 14, 2012, 16:40 [IST]
Desktop Bottom Promotion