For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైలైటర్ ని ముఖం పై రాసుకోవడం ఎలా ? 9 ప్రశ్నలకు సరైన జవాబులు ఇవిగో

ఫేస్ కు హైలైటర్ ని ఎలా అప్లై చేయాలి, కొన్ని సింపుల్ టిప్స్

By R Vishnu Vardhan Reddy
|

మీరు గనుక హైలైటర్ ని కొనాలని భావించినట్లైతే ముందుగా దానిని ఎలా వాడాలి అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడు వాటి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

ఫౌండేషన్, పౌడర్, బుగ్గలను ఎరుపెక్కించడానికి లేదా ముఖాన్ని ప్రకాశవంతంగా చేయడానికి వాడే పదార్థాలు ఇలా ముఖానికి సంబంధించి అందాన్ని పెంపొందించుకోవడానికి రకరకాల వస్తువులను వాడుతున్నప్పటికీ, ముఖంలో తేజస్సు రావడానికి హైలైటర్ ని వాడుతుంటారు.

మేకప్ విషయంలో ఈ పొరపాట్లు చేస్తే కళ్ళ చాలా హాని..మేకప్ విషయంలో ఈ పొరపాట్లు చేస్తే కళ్ళ చాలా హాని..

పౌడర్ రాసుకోక ముందే హైలైటర్ ని ముఖానికి రాసుకుంటారు మరియు ముఖానికి చుట్టూరా మాత్రమే రాస్తారు. ముఖం చుట్టూరా అంటే ఏ ఏ భాగాలు ఎండ తగులుతుందో వాటికి రాస్తారు. నుదురు, గడ్డం, బుగ్గలు మరియు ఇంకొన్ని ప్రదేశాల్లో ఉపయోగిస్తారు.

మీరు వాడే హైలైటర్ ఎటువంటిది అనే విషయం, మీరు ఎలా దానిని రాసుకోవాలి అనే విషయంలో చాలా ముఖ్య పాత్రపోషిస్తుంది. అంటే దానర్ధం ద్రవ రూపంలో, పౌడర్ రూపంలో మరియు క్రీమ్ రూపం లో వివిధరకాల హైలైటర్లు ఉన్నాయి. కాబట్టి అన్ని హైలైటర్ లను ఒకే రకంగా రాసుకోవడం కుదరదు.

ఈ క్రింద హైలైటర్ ని ఎలా వాడాలి, ఏ ఏ హైలైటర్ ని ఎవరు వాడాలి అనే విషయమై కొన్ని ముఖ్యమైన ప్రసంగాలకు సమాధానం చెప్పడం జరిగింది. వాటి గురించి తెలుసుకుందాం.

<strong>మేకప్ విషయంలో మీరు చేసే తప్పిదాలు వెంటనే మానేయాల్సినవి</strong>మేకప్ విషయంలో మీరు చేసే తప్పిదాలు వెంటనే మానేయాల్సినవి

1. ఎలాంటి హైలైటర్ లను కొన్నుకోవాలి :

1. ఎలాంటి హైలైటర్ లను కొన్నుకోవాలి :

మీ చర్మ తత్వాన్ని మరియు దాని యొక్క సున్నితత్వాన్ని, గుణగణాల ఆధారంగా మీరు ఒక హైలైటర్ ని ఎంచుకోవడం మంచిది. మీ చర్మం నలుపు రంగులో ఉంటే, కొద్దిగా బంగారపు పూత ఉన్న హైలైటర్ ని కొనుక్కోండి. ఎవరైతే బాగా తెల్లగా ఉంటారో అటువంటి వారు ప్రకాశవంతమైన రంగులతో కూడిన హైలైటర్ ని ఎంచుకోండి. ఉదాహరణకు గులాబీ రంగు హైలైటర్ ని ఎంచుకోండి.

పాలిన చర్మం రంగు ఉన్నవారు లేత గులాబీ రంగు ఉన్న హైలైటర్ లను ఎంచుకోండి.

2. నుదిటి పైన హైలైటర్ ని ఎలా రాసుకోవాలి :

2. నుదిటి పైన హైలైటర్ ని ఎలా రాసుకోవాలి :

హైలైటర్ ని నుదిటి పై రాసుకోవాలంటే మొదట కొద్ది మోతాదులో హైలైటర్ ని తీసుకొని దానిని రెండు కనుబొమ్మల మధ్యలో రాయడం మొదలు పెట్టాలి. ఎందుచేతనంటే, ఇప్పుడు చెప్పబడిన ప్రదేశం పై సూర్య కాంతి ఎక్కువగా పడుతుంది. అందుచేత అక్కడ మాత్రమే రాసుకోండి. నుదిటి పై మిగతా భాగాలకు రాసుకోకండి.

3. హైలైటర్ ని వాడటం ద్వారా ముక్కని సన్నగా కనిపించేలా ఎలా చేసుకోవచ్చు :

3. హైలైటర్ ని వాడటం ద్వారా ముక్కని సన్నగా కనిపించేలా ఎలా చేసుకోవచ్చు :

హైలైటర్ ని ఉపయోగించి మీ ముక్కుని చాలా సన్నగా ఉన్నట్లు బయట ప్రపంచానికి కనపడేలా చేయాలంటే చాలా కొద్ది మోతాదులో హైలైటర్ ని తీసుకొని మీ ముక్కు చివరి భాగంలో చాలా జాగ్రత్తగా రాయండి. మీ ముక్కుకి ఇరువైపులా లేదా మీ ముక్కు పైన హైలైటర్ ని అస్సలు రాయకండి. హైలైటర్ ను ముక్కు చివర రాయడం ద్వారా దానిని సన్నగా కనపడేలా చేయవచ్చు. ఇందుకోసం మీ చూపుడు వేలును ఉపయోగించండి మరియు కొద్ది మొత్తంలో మాత్రమే హైలైటర్ ని తీసుకోండి.

4. ద్రవరూపంలో ఉన్న హైలైటర్ ని ముఖానికి ఎలా రాసుకోవాలి :

4. ద్రవరూపంలో ఉన్న హైలైటర్ ని ముఖానికి ఎలా రాసుకోవాలి :

ఫౌండేషన్ మరియు కన్సీలర్ వాడిన తర్వాత పౌడర్ మరియు బుగ్గలకు ఎరుపు ఇచ్చే పదార్ధం వాడక ముందు ద్రవ రూపంలో ఉన్న హైలైటర్ ని మీ ముఖానికి రాసుకోవాలి.

ద్రవరూపంలో ఉన్న హైలైటర్ ని మీ ముఖానికి రాసుకోవాలంటే అందుకు మీరొక పదునైన స్పాంజ్ ని తీసుకోవాలి. ఈ ద్రవరూపంలో ఉన్న హైలైటర్ ని చుక్కలు చుక్కలుగా మీ ముఖం చుట్టూరాపెట్టాలి, ఆ తర్వాత స్పంజిని ఉపయోగించి అంటి ముట్టనట్లు ఆ ద్రవరూపంలో ఉన్న హైలైటర్ ని నెమ్మదిగా ఒక క్రమబద్ధమైన పద్దతిలో రాయాలి.

5. క్రీమ్ హైలైటర్ ని ముఖానికి ఎలా రాసుకోవాలంటే :

5. క్రీమ్ హైలైటర్ ని ముఖానికి ఎలా రాసుకోవాలంటే :

మీరు ఎంత క్రీమ్ హైలైటర్ రాసుకోవాలి అనే విషయం, మీ ముఖం ఎంతలా నిగనిగ లాడాలి అనే విషయం పై ఆధారపడి ఉంది. ఫౌండేషన్ మరియు కన్సీలర్ వాడిన తర్వాత పౌడర్ మరియు బుగ్గలకు ఎరుపు ఇచ్చే పదార్ధం వాడక ముందు క్రీమ్ హైలైటర్ ని రాసుకోవాలి. ఇలా వాడడటం వల్ల మీకు సహజమైన అందం లభిస్తుంది. మీకు గనుక మీ ముఖం ఎంతగానో నిగనిగలాడిపోవాలని మరియు చూడగానే వెలిగిపోవాలని మీరు గనుక భావిస్తే, అలంకరించుకునే ప్రక్రియలో, చివరిగా పౌడర్ రాసుకున్న తర్వాత క్రీమ్ హైలైటర్ ని మీ ముఖంపై పూసుకోండి.

6. పౌడర్ హైలైటర్ ని ఎలా రాసుకోవాలంటే :

6. పౌడర్ హైలైటర్ ని ఎలా రాసుకోవాలంటే :

పౌడర్ హైలైటర్ ని రాసుకుంటున్నప్పుడు ఒక మధ్య రకమైన లేదా ఒక వంపు తిరిగి ఉన్న బ్రష్ ని మాత్రమే వాడాలి. ఈ బ్రష్ ని నేరుగా హైలైటర్ లో ముంచిన తరువాత, మీ ముఖం పై ఆ బ్రష్ ని ఉపయోగించి హైలైటర్ ని రాయడం ప్రారంభించండి. పౌడర్ హైలైటర్ ని వాడేటప్పుడు మీరు మళ్ళీ ఇతర రకాల పౌడర్లని మరియు ముఖాలకు ఎరుపెక్కించే పదార్థాలను వాడనవసరం లేదు.

7. మీ చర్మ తత్వాన్ని బట్టి హైలైటర్ ని ఎంచుకోవాలి :

7. మీ చర్మ తత్వాన్ని బట్టి హైలైటర్ ని ఎంచుకోవాలి :

ఎవరికైతే పొడిబారిన చర్మం ఉంటుందో లేదా ఎవరైతే చల్లటి వాతావరణంలో జీవిస్తున్నారో, అటువంటి వ్యక్తులు లిక్విడ్ హైలైటర్ ని వాడాలి. ఎవరికైతే సాధారణ చర్మం ఉంటుందో లేదా ఆ చర్మంలో రకరకాల స్వభావాలు ఉంటాయో అటువంటి వ్యక్తులు క్రీమ్ హైలైటర్ ని వాడాలి. ఎవరికైతే జిడ్డుగల చర్మం ఉంటుందో లేదా ఎవరైతే కొద్దిగా వేడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంటారో అటువంటి వ్యక్తులు పౌడర్ హైలైటర్ ని వాడాలి.

8. కళ్ల చుట్టూ హైలైటర్ ని ఎలా వాడాలి ?

8. కళ్ల చుట్టూ హైలైటర్ ని ఎలా వాడాలి ?

కళ్ల చుట్టూ హైలైటర్ ని వాడాలని భావించినట్లైతే మొదట కంటి లోపలి మూలాల దగ్గరనుండి రాయడం ప్రారంభించండి, అంటే మీ యొక్క కనుబొమ్మ ఎముక క్రింద నుండి అని అర్ధం. ఈ పని చేయడానికి కంటికి వాడే హైలైటర్ బ్రష్ ని వాడటం మరిచిపోకండి.

9. పెదాల చుట్టూ హైలైటర్ ని ఎలా వాడాలి ?

9. పెదాల చుట్టూ హైలైటర్ ని ఎలా వాడాలి ?

హైలైటర్ ని పెదాల చుట్టూ కూడా వాడవచ్చు అనే విషయం చాలా మందికి తెలీదు. హైలైటర్ గనుక మీరు మీ పెదాల పైన రాసుకోవాలి భావిస్తే లిప్స్టిక్ వేసుకోకముందే హైలైటర్ ని రాసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు రాసుకొనే రంగు మరింత ప్రకాశవంతంగా కనబడుతుంది.

మీ లిప్స్టిక్ ఎంతో ప్రత్యేకంగా కనపడాలని, నలుగురిలో ఉన్నప్పుడు మీరు ప్రత్యేకంగా కనపడాలని మీరు గనుక భావిస్తే లిప్స్టిక్ పూసుకున్న తర్వాత దాని పై హైలైటర్ ని అంటి అంటనట్లు రాయండి.

English summary

Applying A Highlighter | Highlighter On Face | How To Apply A Highlighter

Now deck up your face using a highlighter, in the listed way.
Desktop Bottom Promotion