For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వివిధ రకాల పెదవుల అందం కోసం అద్భుతమైన మేకప్ చిట్కాలు !

|

పెదవులకు సరైన మేకప్ గాని లేకపోతే, మేకప్ అనేది అసంపూర్ణంగా ఉంటుంది. పెదవులకు మేకప్ చేయడం వల్ల మీ ముఖం మరింత ప్రకాశవంతంగా కనబడుతుంది అలాగే, మీ యొక్క రూపాన్ని కూడా ఆకర్షణీయంగా మారుస్తుంది. మీ ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి, మీ పెదవులకు సరియైన మేకప్ని కలిగి ఉండాలి.

మనం వివిధ ఆకారాలలో పెదవులను కలిగి ఉంటాము, మనము వాడే రంగులు - మన పెదవులు ఆకృతికి తగ్గట్లుగా అన్నీ రంగులు సరిగ్గా సరిపోవని మనకు బాగా తెలుసు. కాబట్టి, ఏ రకమైన పెదవులకు, ఏ రకమైన రంగుని అప్లై చేయడం వల్ల మీరు మరింత ఆకర్షణీయంగా కనబడతారు అనే విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.

makeup tips for different lip shapes | makeup tricks for lips

లావైన పెదవులను కలిగి ఉన్న మహిళలను - సాధారణ పెదవులను కలిగి ఉన్న మహిళలతో పోలిస్తే, లావైన పెదాలకు కాస్త విభిన్నమైన మేకప్ అవసరం అవుతుంది. ఏ రకమైన పెదాలకైనా, దానికి సరిపోయే రీతిలో మేకప్ చెయ్యడం వల్ల ఎలాంటి పెదవులైనా చాలా అందంగా కనిపిస్తాయి.

పెదవిని అందంగా అలంకరించడానికి చాలా అనుభవం అవసరం అవుతుంది, కనుక మీరు ఏ విధమైన పెదవి ఆకృతిని కలిగి ఉన్నారో, మీ పెదాలకు అనుగుణంగా ఉండే లిప్-స్టిక్ కలర్ను తెలుసుకోవాలనుకుంటే, ఈ వ్యాసాన్ని మీరు చదివినట్లయితే మీ మేకప్ కోసం చాలా చిట్కాలను ఇక్కడకు తీసుకు వచ్చాము. అవేమిటో మీరు చూడండి !

1. పెద్దగా ఉన్న పై పెదవులకోసం :

1. పెద్దగా ఉన్న పై పెదవులకోసం :

ఇక్కడ, క్రింది పెదవి కంటే పైన ఉన్న పెదవి భాగం చాలా పెద్ద పరిమాణంలో విశాలంగా ఉంటుంది. మరియు విలాసవంతమైనది. సరైన మేకప్ చిట్కాలను మీరు పాటించినట్లయితే, మీ పెదవులు మరింత అందంగా కనిపించేలా చేయవచ్చు.

ఈ పద్ధతిని అనుసరించండి :

లిప్-స్టిక్ను మీ పెదాల మధ్య స్థానం నుండి అలా పెదవుల బయటకి వైపుగా లైనింగ్ను అనుసరిస్తూ అప్లై చేయాలి. ఇలా మీ పెదవి యొక్క సహజమైన ఆకారాన్ని అనుసరించండి.

ఇప్పుడు, మీ పై పెదవులకు డార్క్ కలర్లో ఉన్న లిప్-స్టిక్ను మరియు మీ దిగువ ఉన్న పెదాల కోసం కొద్దిగా ముదురు ఛాయను కలిగిన అదే లిప్-స్టిక్ రంగును అప్లై చేయాలి. ఇలా చేయడంవల్ల సమానమైన పెదాలను కలిగి ఉన్నట్లుగా మనకు భ్రాంతిని సృష్టించడంలో సహాయపడుతుంది.

మీరు మీ పెదవులకు అప్లై చేసిన లిప్-స్టిక్ను, కింద పెదవులకు కూడా అప్లై చేయవచ్చు కానీ, పై పదవికి వైట్ పెన్సిల్తో కొద్దిగా అద్దాలి. ఈ విధంగా మీ పెదవులను సమానముగా ఉన్నట్లుగా భ్రాంతిని కలుగజేయవచ్చు. ఇలాంటి లావు పెదవుల ప్రభావం తగ్గించడానికి ఉన్న మరొక చిట్కా ఏమిటంటే, డార్క్ టోన్ లిప్-స్టిక్ను అప్లై చేయడం. ఇలా చేయడం వల్ల పెద్ద పరిమాణంలో ఉన్న మీ పెదవుల రూపాన్ని తగ్గిస్తుంది.

2. పెద్దగా ఉన్న క్రింది పెదవులకోసం :

2. పెద్దగా ఉన్న క్రింది పెదవులకోసం :

ఇది మనము పైన చెప్పుకున్న కథనానికి వ్యతిరేకంగా ఉంటుంది, అంటే ఇక్కడ క్రింది పెదవులు బాగా పెద్దగా ఉంటాయన్నమాట. ఇలా ఉండటం వల్ల మీ పెదవులు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ కొంతమంది అమ్మాయిలు ఈ విధమైన పెదాల కోసం ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలని అలాంటి వారికోసం ఇక్కడ ఒక చిన్న చిట్కాలను సూచించడం జరిగింది. దీని వలన మీ పెదాలు సమానంగా ఉన్నట్లు కనపడేలా చేయవచ్చు.

ఒకే కలర్లో వున్న లిప్స్టిక్ను 2 పెదవులకు అప్లై చేయాలి. క్రీమీ న్యూడ్ మట్టే ఐషాడోను (లేదా) వైట్ కలర్లో ఉన్న పెన్సిల్ను పై పెదవి యొక్క మధ్య భాగంలో ఆప్లై చేయాలి. ఇది సమాంతరమైన పెదవులను కలిగి ఉన్నట్లుగా సూచిస్తుంది.

3. సమానంగా లేని పెదవుల కోసం :

3. సమానంగా లేని పెదవుల కోసం :

సమానంగా లేని పెదవులు చూడటానికి అసమానంగా ఉంటాయి మరియు స్థిరమైన ఆకారాన్ని కలిగి ఉండదు. కానీ ఇక్కడ సూచించిన చిట్కాలను మీరు ప్రయత్నించినట్లయితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

మీరు ఇలా ప్రయత్నించండి :

మీ పై పెదవి యొక్క ఔట్-లైన్ను లిప్-పెన్సిల్తో మరింత ఆకర్షణీయంగా కనబడేలా మార్క్ చేయండి. ఈ విధంగా మీ పై పెదవి యొక్క 2 వైపులు ఒకేలా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోండి, అలానే మీ కింది పెదవికి కూడా ఈ విధమైన పద్ధతినే ఫాలో అవ్వండి.

ఇప్పుడు, మీ పెదవుల అంచులపై ఉన్న లిప్-లైనర్ యొక్క మరకలను మీ చేతులను ఉపయోగించే నమ్మదిగా పోగొట్టండి.

లిప్-లైనర్ను అప్లై చేసేటప్పుడు చాల జాగ్రత్తగా వ్యవహరించండి లేదంటే, మీ యొక్క పెదవులు అందంగా కనబడవు. కాబట్టి, మీరు లిప్-లైనర్ను కొద్ది మొత్తంలో మాత్రమే అప్లై చేసేటట్లుగా చాలా జాగ్రత్తగా నిర్ధారించుకోండి.

4. సన్నని పెదవుల కోసం :

4. సన్నని పెదవుల కోసం :

సన్నని పెదవులకు మరింత స్థలము మరియు పరిమాణము అవసరం అవుతాయి. కాబట్టి, మీ పెదవులు చాలా అందంగా చేయడానికి సరైన మేకప్ చిట్కాలను అనుసరించాలి.

మీరు సహజంగా కలిగి వున్న పెదవుల యొక్క పరిధిని దాటి బయటవైపుగా కనపడేటట్లుగా లిప్- లైనర్ను అప్లై చేయడం.

ఇప్పుడు, మీరు మీ యొక్క పై పదవికి ముదురు రంగును - క్రింది పెదవికి లేక రంగును అప్లై చేయడం. ఒక మేకప్ బ్రష్తో మొత్తం అంతటినీ బాగా కలపాలి.

5. చిన్న పెదవుల కోసం :

5. చిన్న పెదవుల కోసం :

చిన్న పెదవులను కలిగి ఉన్న మహిళలు చాలా అందంగా కనబడుతారు, మరికొంత మంది బుంగ మూతిని కలిగి ఉండాలని కోరుకుంటారు. అలా బొద్దుగా ఉన్న పెదాలను కోరుకునేవారికి ఈక్రింద సూచించిన చిట్కాలను అనుసరించండి.

మీ పెదవులు మెరిసేటట్లుగా, నిగనిగలాడేటట్లుగా వంటి ఎలాంటి మేకప్లలో అయినా చాలా సౌందర్యవంతంగా కనిపిస్తాయి. మీ పెదాలు సన్నగా కనబడేటట్లుగా చేసే డార్క్ కలర్స్ను ఉపయోగించండి. మీ పెదాలను ప్రకాశవంతంగా, మృదువుగా కనబడేలా చేసే రంగులను మాత్రమే ఉపయోగించండి. ఇలా చేయటం వల్ల మీ పెదాలను అందంగా కనబడేటట్లు ఖచ్చితంగా చెయ్యగలదు.

English summary

makeup tips for different lip shapes | makeup tricks for lips

With the right kind of makeup application, any kind of lip shape would look great. For heavy lips, using a dark-toned lipstick will do the trick, and for flat lips, adding a shimmery effect at the centre will give it a more fuller appearance. Brighter colours would make small lips get highlighted to a great extent.
Desktop Bottom Promotion