మీ నకిలీ కంటిరెప్పలను సరిచేసే చిట్కాలు !

Written By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

కొన్నిసార్లు, మాస్కరా మాత్రమే మీ యొక్క సహజమైన కంటి రెప్పల వెంట్రుకలకు అదనపు హంగులు ఇవ్వాలని గ్యారెంటీ లేదు. కాబట్టి, మీరు ఇవ్వాలనుకున్నా ఆ అదనపు హంగులనేవి చాలా "కష్టతరమైనవి" కావచ్చు ! అలాంటప్పుడు "నకిలీ కంటిరెప్పలను" పొందటమే సరైన మార్గం.

వాటిని మీ అందానికి జోడించిన మరుక్షణమే మీ కళ్ళు మరింత అందంగా కనిపిస్తాయి. వీటిని మీ కనురెప్పలకు అప్లయ్ చెయ్యడం అంత సులభము కాదు మరియు దీనిని ఒకసారి అప్లై చేసిన తర్వాత, తొలగించడమనేది మరొక పెద్ద పని.

At times

మీరు బాగా ఆలోచించి ఉండవచ్చు, "ఇది ఎలా కష్టమైన పని?" అని. మనము ఈ అసహజమైన (నకిలీ) కనురెప్పలను తొలగించడానికి ట్వీజర్స్ ను వాడతాము. వీటిని వాడటంలో మీ ప్రయత్నం విఫలం అవ్వడం వల్ల, మీ కనురెప్పల అంచున ఉండే వెంట్రుకలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ పొరపాట్ల కారణంగా మీరు ఈ అసహజమైన (నకిలీ) కనురెప్పలను దీర్ఘకాలంపాటు వినియోగించుకోవలసి ఉంటుంది, కాదంటారా ??

మీరు అధిక నాణ్యత కలిగిన అసహజమైన కనురెప్పలను కొనుగోలు చేస్తారు కానీ, వాటి కోసం సరైన జాగ్రత్తలను తీసుకోకపోతే, అవి ఎక్కువ కాలం మన్నవు. కానీ మీరు వాటి గురించి సరైన శ్రద్ధను గాని తీసుకుంటే, కనీసం వాటిని మీరు 15 - 20 సార్ల వరకు ఉపయోగించుకోవచ్చు.

ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా ??

ఎందుకంటే ఈ వ్యాసంలో, మీరు మీ అసహజమైన కనురెప్పలను (నకిలీ - ఫాల్సీస్) కోసం ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి, మరియు వాటిని దీర్ఘకాల ప్రయోజనకారిగా ఉండేటట్లు ఎలా చూసుకోవాలో ఇక్కడ మీరు నేర్చుకుంటారు. రండి, అవేమిటో మనము చూద్దాం !

A) వాటితో మీరు సున్నితంగా వ్యవహరించండి :

A) వాటితో మీరు సున్నితంగా వ్యవహరించండి :

బాక్స్ నుండి ఫాల్సీస్ను బయటకు తీసినప్పటినుండి దీనిని పరిగణనలోనికి తీసుకొనబడుతుంది. వాటిని మీరు సున్నితంగా వ్యవహరించకపోతే, అవి పాడైపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ ఫాల్సీస్ను తొలగించడానికి మీరు ట్వీజర్స్, ఐలాష్ కర్లర్స్, మరియు మీ చేతి గోర్లను ఉపయోగిస్తున్నారు, కానీ ఇవన్నీ మంచి ఆలోచన అని మీరు అనుకుంటున్నారా ?

పైన చెప్పిన పద్ధతులను మీరు అనుసరించినట్లయితే, వెంటనే దానిని ఆపేయండి. ఎందుకంటే ఫాల్సీస్ అనేవి చాలా సున్నితంగా ఉంటాయి మరియు వాటిని తొలగించడానికి మీరు మీ చేతి వేళ్లను మాత్రమే ఉపయోగించాలి.

మీరు మీ చేతి వేళ్ళను ఉపయోగించినట్లయితే, అక్కడ ఉన్న జుట్టు రాలిపోకుండా (లేదా) మీ కళ్ళు దెబ్బతినే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.

మీరు ఈ ఫాల్సీస్ను తొలగించడానికి, దాని యొక్క అంచులను, మీ బొటన వేలు మరియు చూపుడువేలుతో పట్టుకొని చాలా నెమ్మదిగా లాగుతూ ఉండాలి. ఇలా చేయడం అంత సులభమని అనుకుంటున్నారా ?

అదేవిధంగా, ఫాల్సీస్ను తొలగించడానికి మీరు ఒక ఐలాష్ క్లస్టర్ను ఉపయోగిస్తున్నట్లయితే, దాన్ని మీరు క్లస్టర్తో సరిగ్గా పట్టుకుని, ఫాల్సీస్ యొక్క ప్రతి చివరలను పట్టుకుని నెమ్మదిగా లాగడం చేస్తారు. మీరు ఫాల్సీస్ను పూర్తిగా పట్టుకొని లాగటం వల్ల మీ కంటి రెప్పల మీద ఉన్న జుట్టు దెబ్బతినటంతో, అన్నింటినీ కలిపి ఒకేసారి లాగవద్దు. ఒక సరైన సమయంలో ఒక్కొక్క క్లస్టర్ను మాత్రమే లాగండి.

B) జిగురును ఎల్లప్పుడూ తొలగించండి:

B) జిగురును ఎల్లప్పుడూ తొలగించండి:

ఒకసారి మీరు మీ ఫాల్సీస్ను తీసివేసేటప్పుడు, మీ కంటికి అలంకరించిన బ్యాండ్కు అంటుకొని ఉన్న జిగురును గూర్చి గమనించండి. అలా కనురెప్పల మీద ఉన్న జిగురును తొలగించడమనేది చాలా ముఖ్యమైన విషయం.

మీరు దానిని తొలగించకపోతే, ఆ జిగురు బాగా గట్టిపడుతుంది మరియు మీ బ్యాండ్ను కూడా నాశనం చేస్తుంది. ఒక్కసారి అలాగా జరిగితే, మీరు మీ ఫాల్సీస్ను తిరిగి ఉపయోగించలేరు. చాలామంది ఈ జిగురును తొలగించడానికి వేర్వేరు టూల్స్ను మరియు లిక్విడ్స్ను ఉపయోగిస్తారు, కానీ మీ చేతివేళ్లను ఉపయోగించడమే చాలా సురక్షితమైన పద్ధతి.

ఒక చేతితో మీ కంటి ఫాల్సీస్ను నేరుగా పట్టుకోవడానికి మీ బొటనవేలు మరియు చూపుడువేలును ఉపయోగించండి. మరొక చేతితో నెమ్మదిగా జిగురును తీస్తూ ఉండాలి. కొన్ని జిగురులు పూర్తి మొత్తంగా కలిసిపోయి ఉంటుంది, మరికొన్ని విడివిడిగా ఉంటాయి. వాటిని మీరు పూర్తిగా తొలగించే విధంగా ఉండేటట్లుగా ఉండే దేనినైనా (ఏ పద్ధతినైనా) ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ ఆ బ్యాండ్ లాషింగ్ మీకు ఉపయోగపడే విధంగా ఉండేలా చూసుకోవాలి.

మీరు లాష్ క్లస్టర్స్ విషయంలో చాలా ఎక్కువ జాగ్రత్తను కలిగి వుండాలి లేదంటే ఇది మీ కనురెప్పల మీద వెంట్రుకలను చాలా సులభంగా నాశనం చేయగలదు. ఒకచేత్తో మీరు నెమ్మదిగా బాగా అతుక్కుని వున్న ఫాల్సీస్ను పట్టుకొని, మరొకచేత్తో దానితో పై ఉన్న జిగురును పూర్తిగా తొలగించేలా నెమ్మదిగా లాగండి.

C) మీ ఫాల్సీస్ను శుభ్రం చేసుకోండి :

C) మీ ఫాల్సీస్ను శుభ్రం చేసుకోండి :

మీ ఫాల్సీస్ యొక్క అందాన్ని మరింతగా పెంచే వాటిలో "మస్కరా" అనేది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే, ఇది సహజంగా ఉన్న మీ కంటిరెప్పల అందంతో సమానంగా కలిసిపోతుంది. లిక్విడ్ ఐలైనర్ అనేది మరొక మంచి అలంకరణ సాధనము, ఇది మీరు ఉపయోగించిన బ్యాండ్ను దాచడానికి సహాయం చేస్తుంది.

కానీ, దురదృష్టవశాత్తు అవన్నీ కూడా మీ వెంట్రుకలకు మంచివి కావు. అలాగని మీరు మస్కరాను మరియు ఐలైనర్ ఉపయోగించకూడదని అర్థం కాదు. మీరు మీ ముఖాన్ని ఎలా అయితే శుభ్రం చేసుకుంటారో అలానే, మీరు మీ ఫాల్సీస్ను కూడా శుభ్రం చేసుకోవాలి.

అందుకోసం, మీకు ఆయిల్ లేని మేకప్ రిమూవర్, టిష్యూలు మరియు దూది-పింజెలు అవసరం అవుతాయి.

D) ఉపయోగించే విధానం:

D) ఉపయోగించే విధానం:

టిష్యూ కాగితంపై నకిలీ కనురెప్పలను ఉంచి, మీ చేతివేలుతో నెమ్మదిగా బ్యాండ్ని పట్టుకోండి.

కంటి మేకప్ రిమూవర్లోకి శుభ్రముగా ఉంచిన దూదిని ముంచాలి. దూదిలో అదనంగా ఉన్న ఈ లిక్విడ్ను బయటకు పంపించాలి.

ఈ దూదిని కనురెప్పల అంచుల నుండి ఒత్తుతూ ఉంటూ, ఐలాషేర్ను తొలగించాలి.

మీ యొక్క ఫాల్సీస్ను ఎక్కువగా నానిపోయేలా తుడవకూడదు. ఎందుకంటే ఇది కనురెప్పల యొక్క వలయాలను నాశనం చేస్తుంది.

అలా తొలగించబడిన ఫాల్సీస్ను పొడి అయ్యేంత వరకు ఆరబెట్టి, ఆ తర్వాత ఒక శుభ్రమైన బాక్స్లో

దాచి పెట్టాలి.

E) గుర్తుంచుకోవలసిన విషయాలు :

E) గుర్తుంచుకోవలసిన విషయాలు :

మీ ఫాల్సీస్కు నేరుగా ఎండ తగిలేలా ఉంచటం వల్ల, మీ జుట్టు యొక్క రంగు మారడానికి మరియు అంటుకునే జిగురును కూడా క్రమంగా కోల్పోతుంది.

సగం తెరచి ఉన్న బాక్సులోనూ మరియు త్వరగా పాడైపోయే ప్లాస్టిక్ బాక్సుల్లోనూ వీటిని వుంచకూడదు. దుమ్ము, దూళి నుండి రక్షించడానికి వీలుగా ఉన్న బాక్స్లో చాలా జాగ్రత్తగా దాచండి. మీరు ఈ ఫాల్సీస్ను శుభ్రపర్చడానికి చాలా సమయాన్ని వృధా చెయ్యాలి, అవి చాలాకాలంపాటు శుభ్రంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా ? అయితే వీటిని ఒక ప్రత్యేకమైన బాక్సులో దాచి పెట్టండి.

ఆ బాక్స్లు అర్ధ చంద్రాకారంగా ఉండడంతోపాటు చాలా బిగుతుగా కూడా ఉండాలి. అవి మీ ఫాల్సీస్ను తగిన ఆకారంలోనే ఉంచుతుంది. ఆ తర్వాత వాటిని స్నాప్-షట్ బాక్స్లో ఉంచండి.

ఆ బాక్స్లో ఒక మూలగా లష్-క్లస్టర్ను కూడా ఉంచాలి. ఇలా చేయటానికి ఒక ట్వీజర్ను ఉపయోగించవద్దు, ఎందుకంటే ఇది మీ కనురెప్పల లాషేస్ను నాశనం చేస్తుంది.

ఈ లాషేస్ను తలక్రిందులుగా ఉంచవద్దు, ఇలా ఉంచడం వల్ల మీ లాషేస్ పాడైపోతాయి.

ఈ చిట్కాలు చాలా సులభమైనవి, కాబట్టి మీరు ఈ పద్ధతులను అనుసరించి, మీ ఫాల్సీస్ను ఎక్కువ కాలంపాటు ఉపయోగించుకోగలరు, కావాలంటే మీరూ కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి.

English summary

how to maintain falsies | tips to maintain falsies

False eyelashes are the best option to add extra volume to your otherwise thin eyelashes, but maintaining them is a tricky part, and we need to handle it more gently. Cleaning them often, not keeping them under direct sunlight and always removing the glue could help maintain them well for long.
Story first published: Monday, February 26, 2018, 16:05 [IST]