బ్రౌన్ ఐస్ అందాన్ని మరింత పెంపొందించే మేకప్ టిప్స్

Written By: Lalitha Lasya Peddada
Subscribe to Boldsky

బ్రౌన్ ఐస్ కలిగిన మగువలు ఎన్నో సౌందర్య ప్రయోజనాలను పొందుతారు. అన్ని రకాల ఐ కలర్స్ వారికి సూట్ అవుతాయి. కొన్నిసార్లు, మేకప్ ద్వారా కళ్ళ అందాన్ని రెట్టింపు చేసే మార్గాలు మనకు తెలియవు.

వివిధ ఐ కలర్స్ కి వివిధ షేడ్స్ కలిగిన ఐ మేకప్ అవసరం. ఎందుకంటే, సేమ్ కలర్ అనేది ఐ బ్యూటీని మెరుగుపరచలేదు. అదృష్టవశాత్తు, ఇంటర్నెట్ అనేది వివిధ మేకప్ ట్యుటోరియల్స్ తో మనకు అనేక సలహాలను అందిస్తోంది. ఇవన్నీ నిజానికి సులభంగా పాటించదగినవే.

makeup tips for brown eyes

బ్రౌన్ ఐస్ కలిగిన మగువలకి ఎటువంటి ఐ షాడో అయినా భలేగా నప్పుతుంది. ఇటువంటి కళ్ళు కలిగిన మగువలు తమ కళ్ళని మరింత కాంతివంతంగా మార్చుకునేందుకు కొన్ని సూచనలు అలాగే చిట్కాలను పాటిస్తే వారి కళ్ళ అందం మరింత రెట్టింపవుతుంది.

కాబట్టి, ఈ రోజు, ఈ ఆర్టికల్ లో డార్క్ బ్రౌన్ ఐస్ కలిగిన వారికి అలాగే మీడియం బ్రౌన్ షేడ్ కలిగిన వారికి ఎటువంటి షేడ్స్ నప్పుతాయో తెలుసుకుందాం. వీటిని చదివి ఈ లుక్స్ ని ప్రయత్నించండి మరి. ఈ లుక్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయని మేము భావిస్తున్నాము.

ఇక్కడ అందించే బెస్ట్ ఐ మేకప్ చిట్కాలు బ్రౌన్ ఐస్ వారికి ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని పరిశీలించండి మరి.

డార్క్ బ్రౌన్ ఐస్ కలిగిన వారికి:

1. ప్లమ్ ఐ షాడో:

1. ప్లమ్ ఐ షాడో:

బ్రౌన్ ఐ కలర్ కలిగిన వారికి ప్లమ్ షేడ్స్ బాగా కనిపిస్తాయి. వీటిలో ఎర్తీ ఫీల్ ఉండటం వలన ఆటమ్న్ సీజన్ లో ఈ లుక్ బాగుంటుంది. మీ ఐ షాడో కలర్ కి బ్రైట్ టాప్ ను అలాగే జీన్స్ పెయిర్ ను బూట్స్ తో మ్యాచ్ చేయండి.

కావలసిన పదార్థాలు

1. ప్లమ్ ఐ షాడో

2. బ్రౌన్ ఐ షాడో

3. డార్క్ పర్పుల్ ఐ షాడో

4. మస్కారా

5. ఐ లైనర్

ఎలా అప్లై చేయాలి:

ఎలా అప్లై చేయాలి:

• పింక్ అండర్ టోన్స్ తో బ్రౌన్ షేడ్ ను అప్లై చేస్తే కళ్ళు మరింత కాంతివంతంగా మారతాయి.

• ఐ లిడ్ కి మధ్యలో ప్లమ్ షేడ్ ను అప్లై చేయండి. అలాగే ఐ లిడ్స్ వెలుపల కూడా అప్లై చేయండి.

• ఇప్పుడు, కంటి అవుటర్ కార్నర్ లో డార్క్ పర్పుల్ ను అప్లై చేసి సరిగ్గా బ్లెండ్ చేయండి.

• ఐ లైనర్ మరియు మస్కారాను అప్లై చేసి మేకప్ ను ఫినిష్ చేయండి.

2. డార్క్ గ్రీన్ ఐ షాడో:

2. డార్క్ గ్రీన్ ఐ షాడో:

బ్రౌన్ కలర్ ఐస్ కి డార్క్ గ్రీన్ భలేగా సూట్ అవుతుంది. ఈ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. మ్యాట్టే లేదా షిమ్మర్ ను మీరు ప్రిఫర్ చేయవచ్చు. ఉదయం పూట బయటకు వెళ్ళినప్పుడు మ్యాట్టే అనేది సూట్ అవుతుంది. ఫంక్షన్ అలాగే పార్టీలలో షిమ్మర్ ను ప్రయత్నించడం మానకండి.

కావలసిన పదార్థాలు

1. బ్రౌన్ ఐ షాడో

2. డార్క్ గ్రీన్ ఐ షాడో

3. బ్లాక్ ఐ షాడో

4. ఐ లైనర్

5. మస్కారా

ఎలా అప్లై చేయాలి:

ఎలా అప్లై చేయాలి:

• ఐస్ క్రీజ్ వద్ద బ్రౌన్ షాడో ని ట్రాన్సిషన్ షేడ్ గా అప్లై చేయండి.

• ఇప్పుడు, ఐ లిడ్ మొత్తానికి డార్క్ గ్రీన్ షేడ్ ని అప్లై చేయండి.

• ఇప్పుడు బ్లాక్ ఐ షాడో ని ఐస్ అవుటర్ కార్నర్స్ లో అప్లై చేయండి.

• ఐ లైనర్ మరియు మస్కారాతో ఐ మేకప్ ని ఫినిష్ చేయండి.

3. గ్రే ఐ షాడో:

3. గ్రే ఐ షాడో:

డార్క్ లేదా సబ్టిల్ ఐ షాడో కలర్ కోసం మీరు చూస్తున్నట్టయితే గ్రే అనేది అద్భుతమైన ఆప్షన్. గ్రే కలర్ బ్రౌన్ ఐస్ కు సూట్ అవుతుంది. వింగ్డ్ ఐ లైనర్ తో మీ లుక్ మరింత రాకింగ్ గా ఉంటుంది. ఇంకాస్త మెరుపు కోసం సిల్వర్ గ్లిట్టర్ ని ఐ లైనర్ వింగ్ లో యాడ్ చేయండి.

కావలసిన పదార్థాలు:

1. గ్రే ఐ షాడో

2. సాఫ్ట్ బ్రౌన్ ఐ షాడో

3. సిల్వర్ ఐ లైనర్

4. బ్లాక్ ఐ లైనర్

5. మస్కారా

ఎలా అప్లై చేయాలి:

ఎలా అప్లై చేయాలి:

• ట్రాన్సిషన్ షేడ్ గా సాఫ్ట్ బ్రౌన్ కలర్ ని క్రీజ్ లో అప్లై చేయండి.

• ఇప్పుడు గ్రే ఐ షాడో ని అప్లై చేస్తూ సరిగ్గా బ్లెండ్ చేయండి

• ఇప్పుడు, వింగ్డ్ లైనర్ ని డ్రా చేసి దాని కిందగా సిల్వర్ లైన్ ని జోడించండి.

• మస్కారాతో ఐ మేకప్ ని ఫినిష్ చేయండి.

English summary

makeup tips for brown eyes

If you have brown eyes, then you must be lucky! Yes, any shade of eye colour will look amazing on you! The next time you want apply makeup to your eyes, try plum eyeshadow, grey eye shadow, brown eye shadow, etc. These will enhance the beauty of your eyes.
Story first published: Tuesday, March 13, 2018, 19:00 [IST]