Just In
- 6 hrs ago
రంజాన్ 2021: పవిత్రమైన ఉపవాసం నెల గురించి ఇవన్నీ తెలిసి ఉండాలి
- 6 hrs ago
‘తనను వదిలేసి తప్పు చేశా.. అందం, ఆస్తి ఉందని ఆ ఇద్దరిరీ పడేశా... కానీ చివరికి...’
- 7 hrs ago
రంజాన్ 2021: డయాబెటిస్ ఉన్నవారు ఉపవాసం ఉండటం సురక్షితమేనా?
- 8 hrs ago
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో ధనస్సు రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
Don't Miss
- News
‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’.. 7 ఆక్సిజన్ ట్యాంకర్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మహారాష్ట్రకు తొలి పయనం
- Movies
శంకర్ 'ఇండియన్ 2' రెమ్యునరేషన్ గొడవ.. ఇచ్చింది ఎంత? ఇవ్వాల్సింది ఎంత?
- Sports
RCB vs RR: పడిక్కల్ మెరుపు సెంచరీ.. కోహ్లీ అర్ధ శతకం.. రాజస్థాన్‌పై బెంగళూరు ఘన విజయం!
- Finance
భారీగా తగ్గిన బంగారం ధరలు: పసిడి రూ.500 డౌన్, వెండి రూ.1000 పతనం
- Automobiles
పూర్తి చార్జ్‌పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Holi 2021:హోలీ రంగుల నుండి అబ్బాయిలు చర్మం, జుట్టును కాపాడుకోవాలంటే... ఈ చిట్కాలు ఫాలో అవ్వండి...
హోలీ అంటేనే రంగుల పండుగ. ఈ వేడుకల సమయంలో మన మీద ఎవరు ఎలాంటి రంగులు చల్లుతారో తెలుసుకోవడం చాలా కష్టం. అయితే హోలీ సందర్భంగా చాలా మంది అమ్మాయిలు స్కిన్ అండ్ హెయిర్ పై చాలా శ్రద్ధ తీసుకుంటారు.
అయితే అబ్బాయిల విషయానికొస్తే.. చర్మం మరియు కేశ రక్షణపై పెద్దగా కేర్ తీసుకోరు. దీంతో వారి ముఖంపై చాలా రోజుల వరకు రంగులు అలాగే ఉండిపోతాయి.
అయితే ప్రస్తుత కాలంలో మగవారు కూడా తమ చర్మం మరియు హెయిర్ పై శ్రద్ధ పెడుతున్నారు. ఈ సందర్భంగా హోలీ పండుగ సమయంలో మీ చర్మం మరియు జుట్టు పాడవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
Holi 2021: హోలీ వేళ ఈ రాశులకు చాలా పవిత్రంగా ఉంటుందట...! మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!

మాయిశ్చరైజర్..
హోలీ రంగుల వేడుకల్లో పాల్గొనే ముందు అమ్మాయిల మాదిరిగానే అబ్బాయిలు కూడా వారి చర్మ సంరక్షణ కోసం కొన్ని బ్యూటీ టిప్స్ పాటించాలి. కెమికల్స్ తో ఉన్న కలర్స్ మీ స్కిన్ ను పొడిగా మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు హోలీకి ముందు మీ ఫేసుపై మాయిశ్చరైజర్ చేసుకోవాలి. దీని వల్ల మీ ముఖంపై తేమ ఉంటుంది. మీ స్కిన్ లోపలికి రంగులు కూడా వెళ్లవు.

సన్ స్క్రీన్ వాడండి..
హోలీ సమయంలో మీ చర్మానికి తగిలే సూర్యుని కిరణాల చాలా హాని కలుగుతుంది. దీనంతటికి కారణం కెమికల్స్ కలిసిన రంగులే. కాబట్టి ఇలాంటి నష్టం జరగకుండా మీ చర్మ సంరక్షణ కోసం సన్ స్క్రీన్ వాడాలి. దీన్ని రాసుకోవడం వల్ల మీ చర్మంపై ఎలాంటి మంట అనేది అనిపించదు.

కొబ్బరినూనె..
కెమిక్సల్ కలిసిన రంగుల వల్ల మీ చర్మంతో పాటు మీ జుట్టుకు కూడా చాలా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి హోలీ వేడుకల్లో పాల్గొనే ముందు కొబ్బరినూనెతో మీ జుట్టుపై బాగా మసాజ్ చేయండి. ఇది జుట్టు మీద పడే రంగు ప్రభావితం కాకుండా చూస్తుంది. హోలీ ఆడిన తర్వాత షాంపూ వంటివి వాడటం వల్ల రంగులన్నీ తొలగిపోతాయి. మీ హెయిర్ కు ఎలాంటి నష్టం ఉండదు.
Holi 2021:ఇంట్లోనే రంగులను తయారు చేయండి.. హోలీ ఉత్సవాలను రెట్టింపు చేసుకోండి...

సబ్బును వాడొద్దు..
హోలీ ఆడిన తర్వాత రంగులను తొలగించుకోవడానికి మీరు సబ్బును వాడకండి. ఒకవేళ మీరు సబ్బును ఉపయోగిస్తే.. మీ చర్మం పొడిగా మారుతుంది. అయితే మీరు మీ చర్మంపై రంగులను తొలగించడానికి, మీ శనగపిండి లేదా ఫేస్ ప్యాక్ పిండిని ఉపయోగించి మీ ముఖంపై ఉన్న రంగులను తొలగించుకోవచ్చు. అలాగే స్నానం చేసేటప్పుడు తేలికపాటి సబ్బులను వాడండి. దీని వల్ల మీ స్కిన్ కు ఎలాంటి హాని కలగదు.

వేడి నీళ్లు వాడొద్దు..
మీరు హోలీ ఆడిన తర్వాత నీటిని ఎక్కువగా వేడి చేసి స్నానం చేయకండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు మరింత పొడిబారుతుంది. సాధ్యమైనంత వరకు మీరు చల్లని నీటితో స్నానం చేయండి. తలస్నానం చేసే సమయంలో ఆ రంగులు పోయేంత వరకు వారంలో ఒకసారైనా కలబంద గుజ్జు, పెరుగు లేదా గుడ్డుతో, ఆలివ్ నూనె వంటి సహజ మాస్క్ లను వాడండి.

సన్ గ్లాసెస్..
మీరు హోలీ రంగుల వేడుకల్లో పాల్గొనే సమయంలో మీ కళ్లలోక రంగులు పడకుండా కచ్చితంగా సన్ గ్లాసెస్ పెట్టుకోండి. పొడి రంగులు ముక్కులోకి వెళ్లకుండా మాస్క్ తప్పనిసరిగా పంచుకోండి. హోలీ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఎక్కువసేపు ఎండలో ఉండకండి. రంగుల నుండి మీ చర్మాన్ని రక్షించుకునేందుకు మీ బాడీని కప్పి ఉంచే దుస్తులనే ధరించండి.