For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజంతా తాజాదనం ఉట్టిపడాలంటే..!

|

Tips for Skin Freshness
'నేటి ఆధునిక యుగంలో ప్రతి మహిళా ఓ శక్తి' అన్నాడో ఓ మహా కవి.. పోటీ ప్రపచంలో మేటిగా దూసుకుపోతున్న మహిళలు సంస్కృతి, సాంప్రదాయలతో పాటు అందానికి అధిక ప్రాధాన్యతనిస్తారు. అలాంటి వారు రోజుంతా తాజదనంతో పరిమళించేందుకు ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. మీరు అలాంటి వారైతే ఈ కథనం చదవాల్సిందే.. బకట్ నీటిలో ఒక కప్పు పాలపొడి వేసి స్నానం చేయండి. లేదా స్నానం చేసే ముందు చర్మానికి పచ్చిపాలు రాసుకుని చూడండి ఫలితం మీకు ఇట్లే కనిపిస్తుంది.

అలాగూ మీ పెరట్లో ఉండే కలబందు గుజ్జును కాస్తంత తీసుకుని బకెట్ నీటిలో వేసి స్నానం చేస్తే.. ఎండ కారణంగా కమిలిన చర్మానికి మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగపడటమే కాకుండా, అందులోని సుగుణాలు చర్మానికి తేమనందిస్తాయి. అదేవిధంగా అలసత్వం దూరం కావాలంటే గుప్పెడు తులసి ఆకుల్ని నీళ్లో వేసుకుంటే సరిపోతుంది.

శరీరాన్ని శుభ్రపరచడంతో పాటు మృదువుగా, ప్రకాశవంతంగా మార్చడంలో కామొమైల్ ఉపయోగపడుతుంది. అందుకే వారానికోసారి పదిచుక్కలు కామొమైల్ నూనెను నీటిలో రంగరించి స్నానం చేస్తే పొడిగల చర్మం గల వారికి హాయినిస్తుంది. దీని వల్ల అలసత్వం కూడా దూరమవుతుందని శరీర నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Tips for Skin Freshness | ఇక ‘నిగారింపే’...!!

In every time period women are very sensitive about their beauty. But today’s mostly women depend on creams and artificial things which can bring brightness for short time but not for ever. Mostly products develop infections on sensitive skin.
Story first published:Wednesday, August 10, 2011, 11:46 [IST]
Desktop Bottom Promotion