For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మం నిగనిగలాడాలంటే పాటించవలసిన ఆహార జాగ్రత్తలు...!

|

Skin Care
ప్రతి మహిళ తన చర్మం నిగనిగలాడుతూ ఉండాలని కోరుకుంటుంది. అయితే కాలుష్యం, ఎండ మెదలైన వాటి బారిన పడి చర్మం కమిలిపోవడం, తెల్లని మచ్చలురావడం, గరుకుగా తయారవడం వంటివి జరగవచ్చు. రకరకాలైనటువంటి దుష్ప్రభావాల వల్ల మీ చర్మాన్ని రక్షించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్క సారి చూడండి...

ఆహారపరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు:
1. నిమ్మ, ఉసిరి, టమోట, జామ వంటి పుల్లటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఉండే సిట్రస్ ఆమ్లం, సి విటమిన్ మీ చర్మాన్ని కాపాడుతుంది.
2. టీస్పూన్ కీరాజ్యూస్ లో కొంచెం నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
3. ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె, కోడిగుడ్డు తెల్లసొన కలిపి చర్మానికి పట్టిస్తే చర్మం నిగనిగలాడుతుంది.
4. ఒక చిన్న పాత్రలో నారింజ తొక్కలు వేసి అయిదు నిమిషాలు మరిగించి దించి ఆ తొక్కలను చర్మంపై రాసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.
5. నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తీసుకుంటే చర్మం పొడిబారదు.
6. ఎక్కువగా పళ్ళరసాలను తాగితే చర్మానికి గ్లో వస్తుంది.
7. కొబ్బరి నూనెను చర్మమంతా వారానికి ఒకసారి మర్ధనా చేసుకోవాలి.
8. కలబందను కొన్ని రోజులు పాటు చర్మానికి రాసుకుంటే ఫలితం కనపడుతుంది.

English summary

Food Tips for Glowing and smooth Skin...! |చర్మం నిగనిగలాడాలంటే పాటించవలసిన ఆహార జాగ్రత్తలు...!|

Eat foods that have skin hydrating, sun-protecting and wrinkle preventing powers. Eat plenty of nutrient rich (especially antioxidant and vitamin C and A rich) vegetables and fruits such as sweet potatoes, tomatoes, cantaloupe, tea - green or black, oranges, lemons, limes, grapefruit, spinach, turnip greens, broccoli and omega-3 rich foods. These foods will provide you the nutrients needed for your skin to keep it smooth, glowing and wrinkle free.
Story first published:Monday, January 2, 2012, 12:44 [IST]
Desktop Bottom Promotion