Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పచ్చికూరలతో చర్మ సౌందర్య సాధనాలు...!

1. ఎండ వేడికి కళ్లు మంటగా వుండటం, ముఖం నిస్తేజంగా మారటం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇటువంటప్పుడు పొట్టు తీసిన బంగాళదుంపని సంగం వరకు చక్రాల్లా తరిగి నుదురు, కళ్లపై పెట్లుకోవాలి. మిగిలిని సగభాగాన్ని గుజ్జులా చేసి కొంచెం తేనె చేర్చి ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరాక చల్లని నీటితో తొలగించాలి. ఇది కళ్లకు స్వాంతన నివ్వడమే కాక.. చర్మంపై జిడ్డును తొలగించి తేజోవంతంగా మార్చుతుంది.
2. జిడ్డు చర్మం గల వారికి కీరదోస చక్కని పరిష్కారం. దీనిని మెత్తగా చేసి రసాన్ని వేరు చేయాలి. ఇందులో అరచెంచా నిమ్మరసం, ఒక చెంచా రోజువాటర్ చేర్చి అరగంటపాటు ప్రిజ్ లో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ముఖం, మెడ భాగాల్లో రాసుకొని చల్లని నీటితో శుభ్రపరచాలి. ఈ చల్లని ప్యాక్ మంచి క్లెన్సర్ లా పనిచేసి, అలసిన చర్మానికి సాంత్వననిస్తుంది.
3. క్యాబేజి ఆకులను ముద్దలా చేసి రసాన్ని వేరు చేయాలి. దీనికి రెండు చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని అరగంట తర్వాత తడి చేసిన దూదితో తొలగించాలి. ఇది చర్మంపై పేరుకొన్న మురికిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.
4. ముల్లంగిని మొత్తని పేస్ట్ చేసి రసం వేరుచేయలి. దీనికి రెండు చెంచాల పెరుగు చేర్చి ముఖానికి, చేతులకు రాసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ఎండకు వడలిపోయిన చర్మానికి కొత్త తేజస్సునందిస్తుంది.
5. పొడి చర్మం కలవారికి ఈ ప్యాక్ చక్కగా పనిచేస్తుంది. ఒక నారింజ పండు, ఐదారు కర్జూరాలను తీసుకొని గింజలు తీసివేయాలి. ఈ రెండింటిని మిక్సీలో వేసి ముద్దలా చేయాలి. దీనిని ముఖం చేతులకు రాసుకొని మునివేళ్లతో వృత్తాకారంగా మర్ధన చేయాలి. అరగంట తర్వాత ఈ ప్యాక్ ను తడి దూదితో తొలగించాలి. ఇది చర్మ కణాలకు తగిన తేమనందించి చాలా సేపటి వరకు చర్మ పొడిబారకుండా చేస్తుంది.
6. కేరట్ ను తురిమి కొద్దిగా పచ్చిపాలు కలిపి మెత్తగా రుబ్బి ఈ ముద్దని మెడ, చేతులకి నాలుగైదుసార్లు చొప్పున రాయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. దీని ద్వారా చర్మానికి సమృద్దిగా విటమిన్లు అందుతాయి.
7. బంగాళదుంపల్ని ఉడికించి అనంతరం రెండు స్పూన్ల పాలు కలిపి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. ఈ ముద్దని గోరువెచ్చిన నీటితో కడిగి అనంతరం పాల మీగడ రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. ముఖం ఎంత కాంతివంతంగా ఉంటుందో మీరే గమనిస్తారు.
8. కొద్దిగా నీటిలో క్యాబేజీని ఉడకబెట్టి ఆ నీరు చల్లారిన తర్వాత ఆ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖంపై మచ్చలు, నల్లబడటం పోయి చర్మం నునుపుగా మారుతుంది.
9. ఉడకబెట్టిన బంగాళాదుంప గుజ్జును ముఖానికి రాసుకుంటే తెగిన, కాలిన గాయలు మానుతాయి. మొటిమలు తగ్గి, ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
10. పొదీన ఆకుల్ని మెత్తగా నూరి కొంచెం రోజ్ వాటర్ చేర్చి ముఖానికి రాసుకోవాలి. ఇది మాయిశ్చరైజర్ లా పనిచేయడమే కాకుండా.. మొటిమలు, బ్లాక్ హెడ్స్ ల్లాంటివి తొలగిస్తుంది.



Click it and Unblock the Notifications