Latest Updates
-
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026
మొటిమలులేని క్లియర్ స్కిన్ పొందడానికి బెస్ట్ జ్యూసులు
ముఖం మీద మొటిమలు చాలా ఇబ్బందికరమైనవిగా, మరియు బాధాకరమైనవిగా ఉంటాయి. మొటిమలతో నిండిన ముఖంతో ఎక్కడికైనా, పార్టీలకు, ఫంక్షన్లకు లేదా స్నేహితులను కలవడానికి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది కరంగా ఉంటుందో ఒక సారి ఇమాజిన్ చేసుకోండి. వీటిని కనబడకుండా కన్సీలర్ ను ప్రయత్నించవచ్చు. కానీ ఏ మాత్రం పనిచేయదు. చివరకు, మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడుతాయి, కానీ మొటిమల తాలుకూ నల్ల మచ్చలు అలాగే మిగిలిపోతాయి.
అయితే అద్భుతంగా పనిచేసే అనేక హోం రెమడీస్ ఉన్నాయి. అయితే కొంత సమయాన్ని తీసుకుంటాయి. మొటిమలను నివారించుకోవడం కోసం క్రీములను వ్రాయడం కూడా ఒక ఉత్తమ పరిష్కారం. . అయితే, మొటిమలను వదిలించుకోవడం కోసం కొన్న జ్యూసులున్నాయి. మొటిమలను క్లియర్ చేసే ఈ నేచురల్ జ్యూసులు, మచ్చలను కూడా కనబడనియ్యకుండా చేస్తాయి. అందులకు పండ్ల రాసాలు, వెజిటేబుల్ రసాలు బాగా సహాయపడుతాయి.
ఉదాహరణకు, కొన్ని రకాల జ్యూసులు మొటిమలను మరియు మొటిమల తాలూకు మచ్చలను కూడా క్లియర్ చేస్తాయి!ఉదాహరణకు, మొటిమల మీద క్యారెట్ జ్యూస్ ను అప్లై చేయడం వల్ల మొటమలను లైట్ చేస్తుంది మరియు మొటిమలను క్లియర్ చేస్తుంది. అదేవిధంగా, టమోటోను మెత్తగా పేస్ట్ చేసి లేదా జ్యూస్ లా తయారుచేసి మరియు వండటానికి టమోటో కట్ చేసినప్పుడు అలాగే టమోటోతో ముఖం మీద మర్ధన చేయడం వల్ల మొటమలు, మచ్చలు పూర్తిగా నివారించవచ్చు.
మరి మొటిమలు, మచ్చలు నివారించే కొన్నిబెస్ట్ జ్యూసులు ఇక్కడ ఇస్తున్నాం..క్రింది స్లైడ్ లో పరిశీలించండి...

మొటిమలు రాకుండా చేసే బెస్ట్ జ్యూసులు
టమోటో జ్యూసులు: టమోటోలో అనేక స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి. చర్మాన్ని శుభ్రపరచడంతో మొదలు చర్మం మీద మొటమ, మచ్చలను కనబడనీయకుండా చేస్తుంది. టమోటో మన వంటగదిలో సులభంగా లభిస్తుంది. మరియు స్కిన్ ఫ్రెండ్లీ టూ...

మొటిమలు రాకుండా చేసే బెస్ట్ జ్యూసులు
క్యారెట్ జ్యూస్: మొటిమలను క్లియర్ చేయడంలో క్యారెట్ జ్యూస్ ఒక ఉత్తమ జ్యూస్ అంతే కాదు, స్వచ్చమైన, శుభ్రమైన క్లియర్ స్కిన్ ను అందిస్తుంది . ప్రతి రోజూ ఉదయం కాళీ కడుపుతో ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ ను తాగడం లేదా క్యారెట్ జ్యూస్ ను మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి.

మొటిమలు రాకుండా చేసే బెస్ట్ జ్యూసులు
నిమ్మరసం: చర్మంను శుభ్రం చేయడంలో నిమ్మరసం ఒక ఉత్తమ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్. నిమ్మకాయ నుండి రసాన్ని వేరుచేసి ముఖానికి అప్లై చేసి అనేక స్కిన్ బెనిఫిట్స్ పొంది, ఎంజాయ్ చేయవచ్చు.

మొటిమలు రాకుండా చేసే బెస్ట్ జ్యూసులు
అలోవెరా జ్యూస్: మొటిమలను క్లియర్ చేయడానికి ఇది మరొక జ్యూస్ మరియు మొటిమలతాలూకు మచ్చలను కూడా పూర్తిగా క్లియర్ చేస్తుంది. అంతే కాదు అలోవెరా జ్యూస్ చర్మాన్ని సాఫ్ట్ గా మరియు మెరిసేలా చేస్తుంది.

మొటిమలు రాకుండా చేసే బెస్ట్ జ్యూసులు
దోసకాయ జ్యూస్: కాంటాలోప్(దోసకాయ రసం)జ్యూస్ లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది పూర్తి ఆరోగ్యానికి మరియు చర్మానికి కూడా చాలా మంచిది. ఈ దోసకాయను చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసి, పేస్ట్ లేదా రసాన్ని మొటిమలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది సహజంగానే మొటిమలను నివారిస్తుంది.

మొటిమలు రాకుండా చేసే బెస్ట్ జ్యూసులు
ఆరెంజ్ జ్యూస్: ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది. ఇవి రెండూ కూడా చర్మానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి సాద్యమైనంత వరకూ ఆరెంజ్ జ్యూస్ ను తాగడంతో పాటు మొటిమలున్నచోట ఈ ఆరెంజ్ జ్యూస్ ను అప్లై చేయడం వల్ల మొటిమలను నివారిస్తుంది. మొటిమలు లేని ఒక క్లియర్ స్కిన్ ను మీరు పొందవచ్చు.



Click it and Unblock the Notifications