For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళలకు ప్రత్యేకమైన మార్నింగ్ స్కిన్ కేర్ టిప్స్

|

ప్రతి రోజూ మీరు నిద్రలేవగానే, మీరు చూడటానికి అందంగా కనబడకపోవచ్చు, అవునా, కాదా?అది సాధారణం. ఎందుకంటే, జుట్టు చిందరవందగా కళ్ళమీద పడుతుంటే, కళ్ళు ఉబ్బుగా చూడటానికి అందంగా ఉండదు.

మీరు రోజులో ఏసమయం అయిన సరే అందంగా కనబడాలంటే, మార్నింగ్ స్కిన్ కేట్ టిప్స్ ను అనుసరించాల్సి ఉంటుంది. అందుకు కొన్ని బ్యూటీ కేర్ స్టెప్స్ ను పాటింస్తే మహిళలు మరింత అందంగా కబడుతారు. మార్నింగ్ స్కిన్ కేర్ టిప్స్ వల్ల మీ ముఖంలో తాజాగా, ఉత్సహాంగా మరియు రోజంత నవ్వు ముఖంతో ఉంటారు. రోజంతా అందంగా కనబడాలంటే, మార్నింగ్ టిప్స్ తో పాటు, నైట్ టైమ్ టప్స్ కూడా బాగా ఉపయోగపడుతాయి. అందుకొన్ని కొన్ని సులభమైన మార్నింగ్ స్కిన్ కేట్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..వాటిని పాటించండి...

Morning Skin Care Tips For Women

1. ముఖం శుభ్రం చేసుకోవాలి : ప్రతి మహిళ పాటించాల్సిన బేసిక్ రూల్, ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా రొటీన్ గా చేయడం వల్ల రాత్రి నుండి ఉదయం వరకూ ఎటువంటి మేకప్ మీ ముఖంలో ఉండదు. అలాగే మీరు నిద్రలేచిన తర్వాత గోరువెచ్చని నీటితో మీ ముఖం శుభ్రం చేసుకోవాలి. మరియు కాటన్ బాల్ తో లేదా మెత్తగా ఉండే కాటన్ క్లాత్ తో తుడవాలి. మీ కళ్ళ క్రింది మరియు ముక్కుదగ్గడ కాటన్ బాల్ తో శుభ్రం చేసుకోవాలి.

2. ఎక్స్ ఫ్లోయేట్: మరో బెస్ట్ మార్నింగ్ స్కిన్ కేర్ టిప్, మీ చర్మాన్నిఎక్స్ ఫ్లోయేట్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇలా చేయండ వల్ల మీ చర్మ సాఫ్ట్ గా మరియు స్మూత్ గా చేస్తుంది.

3. టోనింగ్: ఉదయం మీ చర్మానికి టోనింగ్ చేసుకోవాలంటే ఎక్కువ సమయం పడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ మార్నింగ్ స్కిన్ కేర్ టిప్ టోనింగ్ వల్ల మీ ముఖం చూడటానికి ఫ్రెష్ గా మరియు ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకు ఆల్కహాల్ లేనటువంటి టోనర్ ను ఉపయోగించండి.

4. మాయిశ్చరైజర్: మీ ముఖం మృదువుగా మరియు తేమగా ప్రకాశంతంగా ఉంచుతుంది. ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి . అందుకు నేచురల్ ఫేస్ ఫ్యాక్స్ ను అప్లై చేయాలి. తర్వాత ఉదయం కూడా ముఖానికి లైట్ ఫేస్ క్రీమ్ ను అప్లై చేసి, నిధానంగా మసాజ్ చేయాలి.

5. డి పఫ్: ఉదయం నిద్రలేచిన తర్వాత కళ్ళక్రింద ఉబ్బుగా అనిపిస్తుంటే, మీ కనురెప్పల మీద మీరు ఉపయోగించిన కోల్డో టీ బ్యాగ్స్ ను పెట్టుకోవాలి . ఇలా చేయడానికి ఎక్కువ సమయం ఏం పట్టడదు. 5నిముషాలు పెట్టుకొంటే సరిపోతుంది. కళ్ళు అందంగా ఫ్రెష్ గా కనబడుతాయి.

6. హైడ్రేషన్: ప్రతి రోజూ తగినంత నీళ్ళు త్రాగడం వల్ల మీ చర్మం మాయిశ్చరైజ్ గా ఉంటుంది. నిద్రలేవగానే మూడు గ్లాసుల నీళ్ళు త్రాగడం వల్ల ఆరోజంతా మీకు కావల్సినంత ఎనర్జీని అంధిస్తుంది.

మీ చర్మాన్నితేమగా ఉంచుకోవడానికి మీరు అనుసరించాల్సిన మార్నింగ్ స్కిన్ కేర్ టిప్స్ ఇవి, దినచర్యను పాజిటివ్ ఫేస్ తో, పాజిటివ్ అప్పియరెన్స్ తో కనబడాలంటే ఈ చిట్కాలు తప్పనిసరిగా అనుసరించాలి.

English summary

Morning Skin Care Tips For Women

Every morning when you wake up, you do not look your very best, don't you? It is quite natural that you will wake up to see messed up hair, drooping eyes and of course a puffy look. This is not so pleasing to your eyes right?
Desktop Bottom Promotion