For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రకాశించే చర్మం పొందడానికి యోగా గురువు చెప్పే10 టాప్ టిప్స్

|

ఈ మద్య కాలంలో అత్యంత ప్రసిద్ది చెందిన ఆధ్యాత్మిక, యోగా గురువు బాబా రామ్ దేవ్, ప్రపంచలంలోని అన్ని సమస్యలకు పరిష్కారం ఉంటుంది అని అంటుంటారు. అలాగే ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మానికి కూడా అద్భుతమైన మార్గాలున్నాయంటారు బాబా రామ్ దేవ్. అవును ఇది నిజం! ఈ వ్యాసం ద్వారా ప్రకాశించే, ఒక ఆరోగ్యకరమైన చర్మం కోసం బాబా రామ్ దేవ్ గారి చిట్కాలను మీకు వివరించడం జరిగింది .

ఈ చిట్కాలు మరియు పద్దతులు ఒక్క రోజులో అద్భుతాలను మరియు తక్షణమే ప్రభావం చూపించకపోవచ్చు (ఈ చిట్కాలను ప్రభావం వారం లేదా రెండు వారాలు, లేదా నెలకూడా పట్టవచ్చు). కానీ ఖచ్చితంగా ఫలితాలు మాత్ర దీర్ఘకాలం మరియు శాశ్వతంగా ఉంటాయి.

1. కపల్ బాటీ లేదా ప్రాణాయంను సాధన చేయండి:

1. కపల్ బాటీ లేదా ప్రాణాయంను సాధన చేయండి:

కపల్ బాటీ లేదా ప్రాణాయమ ఇది ఒక బ్రీథింగ్ (శ్వాసపీల్చే)వ్యాయామం. ఇది మీ ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. ఇందులో ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకొని, కార్బన్ డైయాక్సైడ్ ను బయటకు నెట్టివేసేందుకు సహాయపడుతుంది. ఈ కపల్ భాటీని క్రమంగా రెగ్యులర్ గా 6నెలలు చేయడం వల్ల ప్రకాశవంతమైన చర్మం మరియు మీ చర్మం మెరుస్తుండాల చేస్తుంది. దీన్ని ప్రతి రోజూ రెండు సార్లు చేయాల్సి ఉంటుంది. ఇది కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ను కూడా వదిలించడానికి సహాయపడుతుంది.

2. తాజా పండ్ల రసాలు:

2. తాజా పండ్ల రసాలు:

చల్లని పానీయాలు, పెప్సీ, కోక్, థమ్సప్ మొదలగు కార్బొనేటెడ్ డ్రింక్స్ కంటే తాజా పండ్ల రసాలు తీసుకోమని, ఆధ్యాత్మిక యోగా గురువు బాబా రామ్ దేవ్ యొక్క సలహ. మీ డైలీ డైట్ లో తాజా పండ్ల రసాలను చేర్చుకోవడం వల్ల, మీరు ఖచ్చతంగా మెరిసే చర్మాన్ని నేచురల్ గా పొందవచ్చు.

3. మీ ముఖాన్ని రుద్దాలి:

3. మీ ముఖాన్ని రుద్దాలి:

మీరు స్నానం చేసిన తర్వాత, ఒక మృదువైన టవల్ తో సున్నితంగా ముఖం మీద రుద్దుతూ తుడవాలి ఇలా 4-5నిముషాల స్ర్కబ్ చేయడం వల్ల చర్మం బిగువుగా అవుతుంది మరియు ఇది మీ చర్మం మరింత సాఫ్ట్ గా మరియు సపెల్ గా తయారుచేస్తుంది.

4. సానుకూలమైన ఆలోచనలు:

4. సానుకూలమైన ఆలోచనలు:

ప్రసిద్ద యోగ గురు అభిప్రాయం ప్రకారం మీరు ఎల్లప్పుడు మీ మనస్సులో సానుకూలమైన ఆలోచనలు కలిగి ఉండాలని సలహా. మీకు చాలా సంతోషంగా ఉండగలిగినప్పుడు మరియు మంచిగా ఆలోచించగలిగినప్పుడు, మీ ముఖంలో సానుకూలమైన షైన్ మరియు ప్రకాశవతంగా మార్చుతుంది. మీ మనస్సులో చెడు ఆలోచనలు ఉన్నప్పుడు, అది మీ ముఖంను నిస్తేజంగా మరియు ముడుతలతో మీ ముఖం ప్రతిబింబిచేలా చేస్తుంది.

5. అలోవెరా మసాజ్:

5. అలోవెరా మసాజ్:

మీ ముఖం, మెడ మరియు చేతులను అలొవెరా జెల్ తో ప్రతి రోజూ ఉదయం మరియు రాత్రి మసాజ్ చేయడం వల్ల, ఇది మీ ముఖంలో ఎక్స్ ట్రా షైన్ తీసుకొస్తుంది.

6. శెనగపిండి ప్యాక్:

6. శెనగపిండి ప్యాక్:

మీ ఆరోగ్యం మరియు చర్మం రక్షణకు నేచురల్ మరియు ఆయుర్వేద వస్తువులను బాబా రామ్ దేవ్ చాలా కఠినంగా ఉపయోగిస్తుంటారు . శెనగపిండిని మీ ముఖం ప్రకాశవంత చేయడానికి శెనగపిండి ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని వారి సలహా. అందులో రెండు మార్గాలున్నాయి.

ఒకటి : శెనగపిండితో ఫేస్ వాష్ చేసుకోవడం. మీ ముఖం శుభ్రం చేసుకోవడానికి శెనగపిండిని ఉపయోగించాలి.

రెండు:శెనగపిండిని రోజ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ తో మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా రెండు మూడు వారాలు క్రమంగా చేస్తుంటే మీకు మంచి ఫలితాలు కనబడుతాయి.

7. ముఖానికి నిమ్మరసం:

7. ముఖానికి నిమ్మరసం:

మీ ముఖం సంరక్షణకు నిమ్మరసం ఒక ఉత్తమ చికిత్స వంటిదని బాబాజీ సలహా. ఎందుకంటే నిమ్మరసం సన్ టాన్ మరియు మొటిమలను నివారిస్తుంది. అందుకు నిమ్మరసం ఒక స్కిన్ లైటనింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. రోజుకు ఒక సారి నిమ్మతో మీ ముఖం మీద రుద్ది, గోరువెచ్చని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది.

 8. పచ్చిపాలు:

8. పచ్చిపాలు:

ప్రతి రోజూ మీరు నిద్రించే ముందు, పచ్చిపాలను మీ ముఖం మీద అప్లై చేసి మసాజ్ చేయాలి . మసాజ్ చేసిన తర్వాత రాత్రి అలా పడుకొని, ఉదయం చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది మీ చర్మంలో తక్షణ ప్రభావాన్ని చూపెడుతుంది. చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల శాశ్వతంగా మంచి ఫెయిర్ స్కిన్ పొందవచ్చు.

9. నీళ్ళు:

9. నీళ్ళు:

ప్రతి రోజూ 3-4లీటర్లు నీళ్ళు త్రాగమని బాబాజీ సలహా. మీరు భోజనం చేసే సమయంలో తీసుకొనే నీరు మాత్రమే సరిపోదు. నేచురల్ గా లభించే ఈ నీటిని మీరు తగినంత నీరు త్రాగడం వల్ల అది మీ ముఖంలో నేచురల్ గ్లో మరియు తేమను తీసుకొస్తుంది. దాంతో మీ చర్మం తేమగా మరియు హెత్తీగా ఉంటుంది.

10. తగినంత నిద్ర:

10. తగినంత నిద్ర:

‘ప్రతి రోజూ ప్రతి ఒక్కరికీ సరైన, తగినంత నిద్రా చాలా అవసరం'అని బాబాజీ సలహా. మీరు రోజుకు కనీసం 8గంట సమయం నిద్రపోవాలి . నిద్రించే సమయం కూడా చాలా ముఖ్యం. బాబా రామ్ దేవ్ ముఖ్య సలహా, మీరు ప్రతి రోజూ రాత్రి పదింటికి లేదా కనీసం 11గంటలకు నిద్రించాలంటారు. లేదంటే మీకు కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతాయి. అలాగే ఉదయాన్నే నిద్ర లేవడానికి ప్రయత్నించాలి .

ఈ చిట్కాలు చాలా సింపుల్ గా ఉన్నాయి. మరియు చాలా సులభంగా పాటించవచ్చు .కాబట్టి ఈ చిట్కాలను మీ దినచర్యలో భాగం చేసుకోండి.

English summary

Top 10 Baba Ramdev Tips To Get Glowing Skin

One of the most famous spiritual leaders, Yoga Guru, Baba Ramdev has solutions to almost all the problems in the world, even on ways to get healthy and glowing skin.
Desktop Bottom Promotion