For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేషియల్ హెయిర్ తొలగించడం కొరకు కొన్నిట్రిక్స్ &టిప్స్

|

ముఖం మీద సన్నని వెంట్రుకలుంటే చూడటానికి చాలా అసహ్యాంగా ఉంటుంది. ఫేషియల్ హెయిర్ ను తాత్కాలికంగా తొలగించుకోవడానికి చాలా మార్గాలున్నాయి, కానీ ఎన్ని సార్లని బ్యూటీ పార్లర్ల చుట్టు తిరుగుతారు? వ్యాక్సింగ్ చేయించుకోవడం, త్రెడ్డింగ్ మరియు ప్లక్కింగ్ ఈ మూడూ కూడా హెయిర్ రిమూవ్ చేయడానికి చాలా సాధరణ పద్దతులు. ఇలా హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత తిరిగి కొద్ది రోజులకు ప్రారంభమవుతుంది.

ముఖంలో హెయిర్ ఉండటం వల్ల మిమ్మల్ని నల్లగా కనబడేలా చేస్తుంది, అసహ్యంగా మరియు శుభ్రంగా లేనట్లు చేస్తుంది. అందువల్ల, కొన్ని హోం మేడ్ ఫేషియల్ హెయిర్ రిమూవర్స్ ను ఉపయోగించడం చాలా మంచిది. హోం మేడ్ ఫేషియల్ రిమూవర్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు అవాంచిత బాడీ హెయిర్ మరియు పెదవుల మీద, చెంపల మీద ఉన్న అవాంచిత రోమాలను తొలగించడానికి ఈ హోం మేడ్ ఫేషియల్ రిమూవర్స్ బాగా సహాయపడుతాయి.

ఫేషియల్ హెయిర్ తొలగించడం కోసం కొన్ని పద్దతులను ఇక్కడ వివరించడం జరిగింది. అందులో కొన్నినేచురల్ హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి మన వంటగదిలో నిత్యం మనకు అందుబాటులో ఉండే వస్తువులే, ఈ వస్తువులు ఫేషియల్ హెయిర్ తొలగించడం మాత్రమే కాదు, ఇది మీ చర్మాన్నిమరింత కాంతివంతంగా మార్చుతుంది. మరి ఫేషియల్ హెయిర్ ను తొలగించే

Magical Ways To Reduce Facial Hair

ఆ మ్యాజిల్ మార్గాలేంటో ఒకసారి చూద్దాం...

పసుపు: ఇది పురాతన కాలం నుండి సౌందర్య సాధానాలలో ఉపయోగిస్తున్నారు. పసుపు చర్మానికి రుద్దుకోవడం వల్ల చర్మంలో నేచురల్ గ్లో వస్తుంది. అంతే కాదు, బొప్పాయి లేదా శెనగపిండికి కొద్దిగా పసుపు మిక్స్ చేసి ప్యాక్ లా వేసి 15నిముషాలు అలాగే ఉండి తర్వాత ముఖంను శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల ఫేషియల్ హెయిర్ తగ్గుతుంది.

శెనగపిండి: శెనగపిండిలో నేచురల్ ప్రోటీన్స్ ఉంటాయి. ఇది చర్మానికి తగినంత పోషణను అందిస్తుంది. కాబట్టి, శెనగపిండికి కొద్దిగా పసుపు, పెరుగు మిక్స్ చేసి ముఖానికి ఫ్యాక్ లా వేసుకోవడం వల్ల చర్మకాంతిని మెరుగుపరచడంలో కొన్ని అద్భుతాలనే చేస్తుంది.

పంచదార: తేనె మరియు పంచదార తీసుకొని బాగా మిక్స్ చేసి ముఖానికి స్ర్కబ్బింగ్ గా ఉపయోగించడం వల్ల చర్మంలో కాంతివంతంగా మారుతుంది. ఫేషియల్ హెయిర్ తొలగించబడుతుంది.

తేనె : తేనెను నిమ్మరసంతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ఫేషియల్ హెయిర్ ను తొలగించడం మాత్రమే కాదు, క్లెన్సర్ గా కూడా పనిచేస్తుంది.

ఓట్ మీట్: ఓట్ మీల్ పొడికి కొద్దిగా తేనె, నిమ్మరసం మిక్స్ చేసి ప్యాక్ వేసుకోవడం వల్ల ఎక్స్ ఫ్లోయేట్ స్ర్కబ్బింగ్ గా సహాయపడుతుంది. ఫేషియల్ హెయిర్ తగ్గుతుంది. మరియు చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

ఎగ్ ప్యాక్: ఫేషియల్ హెయిర్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు, ఎగ్ వైట్ ను మిస్ చేయకండి . ఇది మాస్క్ లా ఉపయోగపడుతుంది . కార్న్ ఫ్లోర్ మరియు షుగర్ లో ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్, ఈ పేస్ట్ ను ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. ఫేస్ మాస్క్ ఎండిన తర్వతా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

నిమ్మరసం: నిమ్మరసంతో తయారుచేసే ఫేస్ ప్యాక్ బ్లీక్ గా మాత్రమే కాకుండా క్లెన్సర్ గా కూడా పనిచేస్తుంది. మరియు చర్మానికి మంచి కాంతిని అందిస్తుంది. కొద్దిగా నిమ్మరసం, పంచదార, తేనె మిశ్రమాన్ని వేడిచేసి వ్యాక్సింగ్ గా ఉపయోగించుకోవచ్చు.
ఇవన్నీ కూడా సురక్షితమైన మరియు నేచురల్ పదార్థాలు. ఇవి ఫేషియల్ తొలగించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. దీర్ఘకాల బ్యూటీ టిప్స్ లో ఫేషియల్ హెయిర్ రిమూవల్ గా ఈ పద్దతులను ఉపయోగించవచ్చు.

English summary

Magical Ways To Reduce Facial Hair

Here we discuss some beauty tips for facial hair removal. While some are natural home remedies, there are others that would require you to visit a specialist. Take a look. These are normal day-to-day stuff that we find in our kitchen. Packs made from these ingredients not only help remove facial hair but also pamper your skin.
Story first published: Tuesday, October 7, 2014, 11:33 [IST]
Desktop Bottom Promotion