For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారించే ఉత్తమ హోం రెమెడీస్

|

స్కిన్ పిగ్మెంటేషన్ అంటే చర్మం రంగు మారడం. కొందరికి ఎండలో తిరిగితే వెంటనే చర్మం నల్లబడటం జరుగుతుంటుంది. అంతే కాదు, వాతావరణంలో మార్పుల వల్ల, కాలుష్యం వల్ల కూడా స్కిన్ పిగ్మెంటేషన్ కు కారణం అవుతుంది. చర్మం రంగు అంటే స్వతహాగా చర్మం రంగు మారి దీని వలన అసమానమైన చర్మపు రంగుకు దారి తీయడం. ఈ చర్మపు రంగు మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. చర్మపు రంగు జన్యు పరంగా సిద్ధించి ఉండవచ్చు. ఎండలో ఎక్కువగా తిరగడం, ఒత్తిడి, మొటిమల మచ్చలు, హార్మోనుల స్థాయిలోని హెచ్చుతగ్గులు లేదా కాలుష్యం వంటి వాతావరణ మూలకాలు, దీనికి ఇతర కారణాలై ఉండవచ్చు.

చాలామందిని వేధించే చర్మ సమస్యల్లో.. పిగ్మెంటేషన్‌ ఒకటి. చర్మం రంగు ముదురు చాయలోకి మారినా.. లేదా మెరుపు పూర్తిగా తగ్గి మచ్చలు పడినా తేలిగ్గా తీసుకోకూడదు. దాన్ని పిగ్మెంటేషన్‌గా పరిగణించాలి. ఈ సమస్య ప్రధానంగా మూడు రకాలుగా వేధిస్తుంది.
* చర్మం ముదురు రంగులోకి మారడాన్ని హైపర్‌ పిగ్మెంటేషన్‌ అంటారు.
* అక్కడక్కడా తెల్ల మచ్చలు పడితే.. హైపో పిగ్మెంటేషన్‌గా పరిగణిస్తారు.
* పూర్తిగా రంగు తగ్గిపోతే.. అది డీ పిగ్మెంటేషన్‌గా గుర్తించాలి.

READ MORE: చర్మంలోని సహజ రంగును కాపాడుకోవడానికి చిట్కాలు

ప్రపంచం మొత్తంలో స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను చాలా మంది స్త్రీ , పురుషలు ఎదుర్కొంటున్న బ్యూటీ సమస్య. స్కిన్ పిగ్మెంటేషన్ నివారించుకోవడానికి అనేక మెడికేషన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఈరోజు. స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను నివారించుకోవడానికి అనేక రకాల ఖరీదైన స్కిన్ పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్స్ మరియు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ సమస్యను నివారించుకోవాలంటే నేచురల్ హోం రెమడీస్ అద్భుతంగా సహాయపడుతాయి.

తేనె, పాలు మరియు నిమ్మరసం:

తేనె, పాలు మరియు నిమ్మరసం:

ఒక చెంచా తేనె, పాల పొడి, చెంచా నిమ్మరసం మిక్స్ చేయాలి. తర్వాత తేనె మరియు అరటీస్పూన్ బాదం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి. చిక్కగా పేస్ట్ చేసి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే, టానింగ్ ఎఫెక్ట్ లేకుండా, చర్మం ప్రకాశవంతంగా మెరుస్తూ నేచురల్ రేడియన్స్ ను అందిస్తుంది.

ఓట్ మీల్ పెరుగు:

ఓట్ మీల్ పెరుగు:

మరో ఉత్తమ హోం రెమెడీ. తాజా పెరుగును ఓట్ మీల్ పొడిలో మిక్స్ చేసి చర్మం మీద అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత, చల్లటి నీటితో శుభ్రం చేయాలి . ఇంకా ఈ మిశ్రమంలో కొద్దిగా టమోటో జ్యూస్ కూడా మిక్స్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

బంగాళదుంప:

బంగాళదుంప:

బంగాళదుంపలో నేచురల్ బ్లీచింగ్ లక్షనాలు కలిగి ఉన్నాయి. ఇది చర్మ మీద ఎటువంటి ప్యాచెస్ లేకుండా చేస్తుంది. బంగాళదుంపను స్లైస్ గా చేసి చర్మం నల్లగా మరియు పిగ్నెంటేషన్ తో ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల పిగ్మేంటేషన్ నేచురల్ గా నివారించబడుతుంది.

ఎండిన ఆరెంజ్ తొక్క మరియు పెరుగు:

ఎండిన ఆరెంజ్ తొక్క మరియు పెరుగు:

ప్లెయిన్ పెరుగు మరియు కొద్దిగా ఎండిన ఆరెంజ్ తొక్కను తీసుకొని పేస్ట్ చేసి పిగ్మెంటేషన్ ప్రభావితం అయిన ప్రదేశంలో అప్లై చేయాలి. 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల స్కిన్ టానింగ్ నివారించవచ్చు.

పుదీనా :

పుదీనా :

స్కిన్ టోన్, నల్ల మచ్చలను మాయం చేయడానికి పుదీనా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. పుదీనా ఆకులను పేస్ట్ చేసి పిగ్మెంటేషన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది.

 వెనిగర్:

వెనిగర్:

పిగ్నెంటేషన్ ను నేచురల్ గా తగ్గించే మరో ఉత్తమ హోం రెమెడీ . కొద్దిగా వెనిగర్ ను నీటిలో వేసి బాగా గిలకొట్టి ముఖానికి అప్లై చేయాలి. వెనిగర్ లో కెమికల్ ఎసిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది ఇది పిగ్మెంటేషన్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

ఉల్లిపాయ రసం :

ఉల్లిపాయ రసం :

మరో ఉపయోగకరమైన హోం రెమెడీస్. ఉల్లిపాయ రసంలో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. అంతే ఇది స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది . లేదా ఉల్లిపాయ ముక్కను వెనిగర్ లో డిప్ చేసి ఎపెక్టెడ్ ఏరియాలో మర్దన చేయాలి.

 స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ:

మరో నేచురల్ హోం రెమెడీ స్ట్రాబెర్రీ. బాగా పండిన స్ట్రాబెర్రీని మ్యాష్ చేసి ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

పసుపు మరియు నిమ్మరసం:

పసుపు మరియు నిమ్మరసం:

ప్రెగ్నెన్సీ పిగ్మెంటేషన్ ను నివారించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. పసుపు, నిమ్మరసం శెనగపిండి, మిల్క్ క్రీమ్ మెత్తగా పేస్ట్ లా చేసి, ముఖానికి పట్టించాలి. మరింత ఉత్తమ ఫలితాల కోసం రోజ్ వాటర్ ను మిక్స్ చేయవచ్చు.

పాలు మరియు ఆరెంజ్ తొక్క:

పాలు మరియు ఆరెంజ్ తొక్క:

ఎండిన ఆరెంజ్ తొక్కను పౌడర్ చేసి అందులో పాలు మిక్స్ చేసి పేస్ట్ ను ముఖానికి పట్టించి 20 నిముషాల తరవ్ాత శుభ్రం చేసుకోవాలి. ఇది పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది.

 నిమ్మరసం -కీరదోసకాయ:

నిమ్మరసం -కీరదోసకాయ:

స్కిన్ పిగ్మెంటేషన్ నివారించడానికి మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ నిమ్మరసం, కీరదోసకాయ రసాన్ని మిక్స్ చేసి ప్రభావితప్రాంతాల్లో అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 పచ్చిబొప్పాయి:

పచ్చిబొప్పాయి:

పచ్చి బొప్పాయిను పచ్చి పాలతో కలిపి పది నిమిషాల పాటు ముఖంపై మర్దన చేయండి. ఈ లేపనం .మీ చర్మం పైన మచ్చలకు ప్రభావవంతమైన చికిత్స. ఎందుకంటే ఇందులో పెపైన్ అనే ఎంజైమ్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది . దాంతో స్కిన్ పిగ్మెంటేషన్ నివారించబడుతుంది.

బాదం:

బాదం:

బాదంను నీటిలో నానబెట్టి తర్వాత రెండు గంటల తర్వాత బయటకు తీసి, మెత్తగా పేస్ట్ చేసి, అందులో పాలు లేదా పాలక్రీమ్ వేసి మిక్స్ చేసి చర్మానికి పట్టించాలి. స్కిన్ పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది.

నీళ్ళు:

నీళ్ళు:

మీరు ఆరోగ్యకరమైన చర్మంను పొందాలనుకుంటే, ఎటువంటి పిగ్మెంటేషన్, చర్మం రంగు మారకుండా, మొటిమలు లేని స్వచ్చమైన చర్మం పొందాలంటే తప్పనిసరిగా నీళ్ళు తగిన మోతాదులో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో మలినాలన్నీ తొలగిపోతాయి. చర్మానికి తగినంత హైడ్రేషన్ ను అందిస్తుంది. చర్మంను సాఫ్ట్ గా మరియు ప్రకాశవంతంగా ఉంచుతుంది. ఇది చర్మం యొక్క రంగు మారకుండా సహజంగా ఉంటానికి సహాయపడుతుంది.

సన్ స్కీన్ లోషన్:

సన్ స్కీన్ లోషన్:

ఒక వేళ మీరు బయట ఉన్నట్టయితే ప్రతి మూడు గంటల కొకసారి సన్ స్క్రీన్ లోషన్ ను తిరిగి పూయండి.ఎస్ పి ఎఫ్ 30ఉన్న సన్ స్క్రీన్ లోషన్ ఎండకాలంలోనే కాదు, ఏసీజన్ అయినా, శరీరానికి అప్లై చేయవచ్చు.

చర్మాన్ని క్లెన్సింగ్ చేయడం:

చర్మాన్ని క్లెన్సింగ్ చేయడం:

మీ చర్మాన్ని అన్ని వేళలా క్లీన్ గా ఉంచాలి. శుభ్రంగా, సన్ టాన్ కు గురికాకుండా మరియు చర్మానికి తగినంత మాయిశ్చరైజ్ ను అప్లై చేస్తే సమస్యలు చాలా త్వరగా నిర్మూలించబడుతాయి.

English summary

16 Effective Home Remedies For Skin Pigmentation

Skin pigmentation is referred to as change in the colour of skin due to various external and internal factors. The skin colour is attributed to various pigments such as melanin and carotene. It is the presence of melanin that gives the skin its colour. However, in case there is a high amount of melanin, the skin gets a darker colour, which is known as hyperpigmentation.
Story first published: Tuesday, February 3, 2015, 12:01 [IST]
Desktop Bottom Promotion