For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో.. ఆకర్షణీయమైన సౌందర్యం

By Nutheti
|

కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి క్యారెట్స్. విటమిన్ ఏ పుష్కలంగా ఉండే క్యారెట్స్ ఆరోగ్యానికే కాదు.. సౌందర్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఆరోగ్యవంతమైన చర్మానికి విటమిన్ ఏ చాలా అవసరం. ఇందులో ఉండే అనేకరకాల పోషకాలు చర్మ సంరక్షణకు తోడ్పడతాయి.

READ MORE: క్యారెట్స్ లోని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు

క్యారెట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. దీంతో యాక్నే, పింపుల్స్ కి గుడ్ బై చెప్పవచ్చు. ఇవి రకరకాల చర్మ సమస్యలకు చికిత్సలా పనిచేయడమే కాదు.. చర్మం మెరిసిపోవడానికి సహాయపడతాయి. అయితే ఆహారంగా తీసుకోవడమే కాకుండా.. క్యారెట్స్‌తో ఫేస్‌ప్యాక్స్‌ వేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయని మీకు తెలుసా ?

 క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే వీర్య వృద్ధి..సంతాన ప్రాప్తి..! క్యారెట్ జ్యూస్ రెగ్యులర్ గా తాగితే వీర్య వృద్ధి..సంతాన ప్రాప్తి..!

నేచురల్‌గా మొటిమలు, మచ్చలు, వైట్ హెడ్స్, పిగ్మెంటేషన్, సన్ టాన్ నుంచి క్యారెట్స్ రక్షణ కల్పిస్తాయి. క్యారెట్ తో ఫేస్ ప్యాక్ లు ఇంట్లోనే తయారు చేసుకుని అప్లై చేసుకోవడం వల్ల మరింత అందంగా.. ఆకర్షణీయంగా కనిపింవచ్చు. సౌందర్యాన్ని మెరుగుపరిచే క్యారెట్ ఫేస్ ప్యాక్స్ ఎలా తయారుచేసుకోవాలో చూసి ట్రై చేయండి.

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

క్యారెట్ జ్యూస్ తీసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ ఎగ్ వైట్ కలపాలి. అందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, టేబుల్ స్పూన్ పెరుగు కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రెగ్యులర్ గా ఈ ప్యాక్ వేసుకుంటే.. డెడ్ సెల్స్ తొలగిపోయి.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

క్యారెట్‌, బొప్పాయి రెండింటిని సమానంగా తీసుకుని పేస్ట్‌ చేసుకోవాలి. ఇందులోకి తగినన్ని పాలు కలిపి పేస్ట్‌ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 15నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది.

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

పొడిచర్మంతో బాధపడేవాళ్లకు క్యారెట్ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది. టేబుల్‌ స్పూన్‌ క్యారెట్‌ జ్యూస్‌, టీ స్పూన్‌ తేనె తీసుకుని మిక్స్‌ చేయాలి. ఈ పేస్ట్ ని ఫేస్‌కు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల ముఖవర్చస్సు పెరుగుతుంది.

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

క్యారెట్‌ పేస్ట్‌, ఒక టేబుల్‌ స్పూన్‌ పెరుగు తీసుకుని బాగా కలపాలి. ఇందులో ఒక టీ స్పూన్‌ సెనగపిండి, కాస్త పసుపు కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. తరచుగా ఈ ఫేస్‌ప్యాక్‌ను వాడుతుంటే చర్మ కాంతి పెరుగుతుంది.

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

క్యారెట్ జ్యూస్, అరటిపండు గుజ్జు, ఎగ్ వైట్ అన్నింటిని రెండు రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. వీటికి 4 చుక్కల నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్యాక్ ని తరచుగా వాడటం వల్ల చర్మ సమస్యలు దూరమై అందంగా కనిపిస్తారు.

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

క్యారెట్‌ను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి అందులో కొద్దిగా తేనె, పాలు చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఐదు నిముషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడమే కాదు.. వాటి తాలూకు మచ్చలు కూడా మాయమవుతాయి.

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

మోచేతులు, మోకాళ్ల దగ్గర నలుపుదనం ఇబ్బంది పెడుతుంటే క్యారెట్ ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వారానికి రెండుసార్లు క్యారెట్ లో తేనె, పాలు కలిపిన మిశ్రమాన్ని రాస్తూ ఉండటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

క్యారెట్ ఫేస్ ప్యాక్స్ తో కాంతివంతమైన చర్మం

రెండు క్యారెట్లు, గుడ్డులోని తెల్ల సొన, అరకప్పు పాలు తీసుకోవాలి. ముందుగా క్యారెట్లను ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దానిలో పాలు, ఎగ్ వైట్ కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.

English summary

Carrot Face packs for Glowing Skin in telugu

Carrots are one of the amazing vegetables that nature has blessed us with. Carrots are the best source of vitamin A. Vitamin A is very much necessary for a healthy skin. It is loaded with plenty of nutrients which benefits our skin and hair.
Story first published: Monday, November 23, 2015, 16:32 [IST]
Desktop Bottom Promotion