For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మ సౌందర్యాన్ని పెంచే కీరదోసకాయ ఫేస్ ప్యాక్స్...!

|

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో కీరదోసకాయ ఒక కూల్ వెజిటేబుల్ . దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల శరీరానికి బహుల ప్రయోజనాలను అందివ్వడం మాత్రమే కాదు...చర్మానికి మంచి గ్లోను అందిస్తుంది . మరియు నేచురల్ గా బ్యూటిఫుల్ గా కనబడుతారు . ఎందుకంటే కీరదోసకాయలో, విటమిన్స్ , మినిరల్స్, వాటర్ కంటెంట్ అధికం . కీరదోసకాలో ఉండే ప్రతి విటమిన్, ప్రతి మినిరల్ చర్మానికి చాలా ఎపెక్టివ్ గా పనిచేస్తుందని నిరూపించబడ్డాయి.

చర్మానికి వారంలో రెండు సార్లు కీరదోసకాయతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంలోని రంద్రాల్లో లోపల నుండి శుభ్రపడి చర్మం రంగును మరింత బ్రైట్ గా మార్చడంలో కీరదోసకాయ జ్యూస్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది చర్మాన్ని టైట్ చేస్తుంది . రెగ్యులర్ గా కీరదోసకాయతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మసంరక్షణ వేగంగా మరియు ఎఫెక్టివ్ ఫలితాలను పొందాలంటే వారంలో రెండు మూడు సార్లు కీరదోసకాయతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.

కీరకాయను తక్కువగా అంచనా వేయకండి..అందులోని గుణగణాలను చూడండి.!

ఈ కుకుంబర్ తో ఫేస్ ప్యాక్ వేసుకొన్న తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మం సాప్ట్ గా మరియు కాంతివంతంగా మరియు తేమగా మార్చుకోవడానికి ఈ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ ప్యాక్ వేసుకొన్న తర్వాత చల్లటి రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి . రోజ్ వాటర్లో ఉండే లక్షణాలు చర్మం ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది . చర్మం నేచురల్ గానే అందంగా కనబడుతుంది.

ఆయిల్ స్కిన్ నివారించడానికి టాప్ 12 హోం మేడ్ టోనర్స్

మరి చర్మానికి కుకుంబర్ ఫేస్ ప్యాక్ ను ఎందుకు వేసుకోవాలి, మరియు ఎలా వేసుకోవాలన్న విషయం ఈ క్రింది స్లైడ్ లో తెలపడం జరిగింది...

1. కావల్సిన పదార్థాలు:

1. కావల్సిన పదార్థాలు:

కీరదోసకాయ: 1కట్ చేసుకోవాలి

పెరుగు : 4టేబుల్ స్పూన్లు

2. తయారుచేయు విధానం:

2. తయారుచేయు విధానం:

కీరదోసకాయను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. దానికి పెరుగును చేసి బాగా మిక్స్ చేయాలి.

3. అప్లై చేయడం ఎలా:

3. అప్లై చేయడం ఎలా:

మొదట ముఖాన్ని క్లెన్సర్ తో శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత కీరదోసకాయ పెరుగు మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. ముఖానికి అప్లై చేసేప్పుడు ఈ పేస్ట్ మరింత చిక్కగా ఉండాలి.

ఈ ప్యాక్ బాగా డ్రైగా మారాలి . పూర్తిగా డ్రై అయిన తర్వాత చేతి వేళ్ళతో ప్యాక్ ను సున్నితంగా తొలగించాలి.

తర్వాత రోజ్ వాటర్ మరియు ఐస్ క్యూబ్స్ తో ముఖాన్ని శుభ్రం చేయడంవల్ల ముఖానికి పర్ఫెక్ట్ గ్లో వస్తుంది.

4. డ్రై స్కిన్

4. డ్రై స్కిన్

కీరదోసకాయలో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ ప్యాక్ ను ముఖానికి ఉపయోగించినప్పుడు , ఇది డ్రై అండ్ దురద పెట్టే చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది . కీరదోసకాయలో ఉండే వాటర్ చర్మానికి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దాంతో చర్మం సహజంగానే కాంతివంతంగా మెరుస్తుంటుంది.

5. ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

5. ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది:

కీరోదోసకాయలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది చాలా పవర్ ఫుల్ విటమిన్ . ఈ పవర్ ఫుల్ విటమిన్ అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. మరియు అనేక రకాల ఇన్ఫ్లమేటరీ డిసీజ్ లను నివారిస్తుంది . ఈ ఫేస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల బెటర్ స్కిస్ సెల్స్ ఏర్పడుతాయి.

6. ఏజింగ్ స్కిన్ దూరం అవుతుంది:

6. ఏజింగ్ స్కిన్ దూరం అవుతుంది:

కీరదోసకాయతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి . కీరదోసకాయలో విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది . చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి ఏజింగ్ స్కిన్ సెల్స్ ను దూరం చేస్తుంది.

7. ఇన్ఫ్లమేటెడ్ స్కిన్:

7. ఇన్ఫ్లమేటెడ్ స్కిన్:

కీరదోసకాలో బయోటిన్ అధికంగా ఉండటం వల్ల ఇది స్కిన్ రాషెష్ ను మాయం చేస్తుంది. మరో స్కిన్ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్, స్కిన్ రాషెష్, వంటి సమస్యలను నివారిస్తుంది .

English summary

Cucumber Face Pack Benefits For Skin

Cucumber is one of the many cool vegetables you can apply on the skin to make your face glow and look naturally beautiful. Cucumber has a ton of vitamins, where in each one of the vitamins have proved to be very effective for the skin.
Story first published: Friday, December 11, 2015, 11:36 [IST]
Desktop Bottom Promotion