For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెరిసే చర్మానికి ఈ ఆయిల్స్ తో మసాజ్ తప్పనిసరి

By Nutheti
|

అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి రకరకాలు ప్రయత్నిస్తూ ఉంటాం. రోజూ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాష్, క్రీములు ఇలా రకరకాల బ్యూటీ టిప్స్ ఫాలో అవడం, బ్యూటీపార్లర్స్ కి వెళ్లి ఫేషియల్, బ్లీచింగ్ వంటివి చేయించుకుంటూ ఉంటారు. అయితే ఎన్ని చేసినా కొన్ని సందర్భాల్లో చర్మం నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది.

READ MORE: డ్యామేజ్ హెయిర్ నివారించే హోం మేడ్ నేచురల్ ఆయిల్స్

ఇలా క్రీములు, ఫేషియల్స్ మీద ఆధారపడితే.. చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది. కాబట్టి సహజసిద్ధమైన వాటిని ఎంచుకోవడం మంచిది. ప్రకృతిసిద్ధంగా లభించే ఉత్పత్తులతో చర్మాన్ని సంరక్షించుకుంటే అందం, ఆరోగ్యం మీ సొంతమవుతుంది. చర్మానికి పోషణనిచ్చి, మెరుపినిచ్చే నూనెలు లేదా ఆయిల్స్ వాడి చూడండి. మీ చర్మంలో కొంగొత్త మెరుపు సంతరించుకుంటుంది. చర్మానికి రెట్టింపు సోయగాన్నిచ్చే ఆయిల్స్ ఏంటో చూద్దాం..

శాండిల్ఉడ్ ఆయిల్

శాండిల్ఉడ్ ఆయిల్

ముఖంపై ఉండే మొటిమలు, సన్నని గీతలు, ముడతలు ఎక్కువగా ఉంటే.. చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. మేకప్ తో కవర్ చేస్తే కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి సహజసిద్ధమైన శాండల్ఉడ్ అయిల్ తో మర్దనా చేసుకోవడం వల్ల ఇవన్నీ తొలగిపోతాయి. గంధంలో ఉండే పోషకాలు చర్మాన్ని స్మూత్ గా మార్చుతాయి.

బాదం నూనె

బాదం నూనె

బాదం ఆయిల్ లో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మ పోషణకు సహాయపడుతుంది. అలర్జీలు రాకుండా, ప్రకాశవంతమైన చర్మానికి బాదం ఆయిల్ తో అప్పుడప్పుడు మర్దనా చేసుకుంటూ ఉండాలి.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె చర్మ సంరక్షణకు పవర్ ఫుల్‌గా పనిచేస్తుంది. కొబ్బరినూనె జుట్టు పెరుగుదలతో పాటు చర్మాన్ని సున్నితంగా మారుస్తుంది. కాబట్టి రాత్రిపూట లేదా స్నానానికి ముందు కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం స్మూత్ గా మారుతుంది.

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్

ఆలివ్ నూనె చర్మంలో అంతర్గత తేమ నష్టాన్ని తగ్గిస్తుంది. అంతేగాకుండా సమర్థవంతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దీనివల్ల చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. వృద్ధాప్యఛాయలను తగ్గించడంలో ఆలివ్ ఆయిల్ పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్

యూకలిప్టస్ ఆయిల్

ఘాటైన సువాసన కలిగి ఉండే యూకలిప్టస్ ఆయిల్ చర్మానికి హాని చేస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ ఆయిల్ చర్మానికి రాసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. మొటిమలు వేధిస్తుంటే ఈ ఆయిల్ రాసుకోండి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మానికి ఇన్ఫెక్షన్ సోకకుండా చూస్తాయి.

రోజ్ ఆయిల్

రోజ్ ఆయిల్

చిన్నవయసులోనే ముడతల చర్మంతో ఇబ్బందిపడుతున్న వాళ్లకు రోజ్ ఆయిల్ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆస్ర్టిజెంట్ గుణాలు దెబ్బతిన్న చర్మకణాలను మామూలుగా మార్చడానికి సహాయపడతాయి. ఇన్ఫెక్షన్లు రాకుండా, యవ్వనంగా కనిపించడానికి రోజ్ ఆయిల్ సహాయపడుతుంది.

అవకాడో ఆయిల్

అవకాడో ఆయిల్

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవకాడో ఆయిల్ చర్మానికి కూడా మంచిదే. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి చర్మానికి పోషణనిచ్చి చర్మం నిగారించడానికి సహకరిస్తాయి. ఈ నూనెలో ఉండే పోషకాలు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. దీనివల్ల చర్మం యూత్ ఫుల్ గా కనిపిస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు చర్మాన్ని ఈ ఆయిల్ తో మర్దనా చేసుకోండి.

క్యారెట్ గింజల ఆయిల్

క్యారెట్ గింజల ఆయిల్

సూర్యరశ్మికి చర్మకణాలు దెబ్బతింటాయి. అలాంటప్పుడు క్యారెట్ సీడ్ ఆయిల్ తో చర్మాన్ని మర్దనా చేసుకుంటూ ఉండాలి. ఇందులో ఉండే కెరొటినాయిడ్స్ చర్మంలో ఉండే మొటిమలు, ఎగ్జిమా, సొరియాసిస్ వంటి వాటి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

English summary

Eight Best Skin Lightening Oils: beauty in telugu

Lightening oils for skin should not be confused with fairness oils. Here we are not making any mention to fairness treatments. What these oils do is nourish the skin and help bring about a healthy glow to it.
Story first published:Saturday, November 28, 2015, 13:24 [IST]
Desktop Bottom Promotion