For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏ వయసు వాళ్లకు ఎలాంటి ఫేషియల్స్ అవసరం

By Nutheti
|

చర్మం కాంతివంతంగా ఉండాలని.. అందంగా మెరిసిపోవాలని.. అందరిలోనూ స్పెషల్ ఎట్రాక్టివ్ గా ఉండాలని.. ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అమ్మాయిలు వయసుతో పరిమితం లేకుండా... ప్రతి ఒక్కరూ అందంపై శ్రద్ధ తీసుకుంటారు. క్రీములు, సోప్ ల విషయంలోనే కాదు.. నెల నెలా పార్లర్లకి వెళ్లూ మరింత అందంగా కనిపించడానికి ఆరాటపడుతుంటారు.

చాలామంది అమ్మాయిలు ప్రతి నెలా ఫేసియల్స్ చేసుకుంటూ ఉంటాయి. అయితే ఫేషియల్స్ చేయించుకునేటప్పుడు.. వయసుని, చర్మతత్వాన్ని మైండ్ లో పెట్టుకోవాలి. లేదంటే.. మరిన్ని సమస్యలు కొన్నితెచ్చుకున్నట్టే అవుతుంది. అంతేకాదు.. వాటివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. కాబట్టి ఏ వయసు వాళ్లు ఎలాంటి ఫేషియల్స్ ఎంచుకుంటే.. మీరు కోరుకున్న అందం మీ సొంతమవుతుందో ఇప్పుడు చూద్దాం..

pimples

20 ఏళ్లలో:
20 ఏళ్ల వయసు ఉన్నవాళ్లకు ఎక్కువగా యాక్నే సమస్య ఇబ్బందిపెడుతుంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి. బయటతిరగడం వల్ల ట్యాన్ సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి.. నెలకొకసారి పార్లర్ లో క్లీనప్ ట్రీట్మెంట్ చేయించుకుంటే పింపుల్స్, మచ్చలు, ట్యాన్ బారినపడకుండా జాగ్రత్తపడవచ్చు. అయితే గాఢత తక్కువగా ఉన్నవాటిని ఫేషియల్ కి వాడటం మంచిది. పార్లర్ కి వెళ్లడం ఇష్టంలేని వాళ్లు ఇంట్లో పసుపు, కీరా, తేనె, నారింజ వంటి వాటితో ఫేషియల్ చేయించుకున్నా సరిపోతుంది.

papaya

30 ఏళ్లలో
ముప్పై ఏళ్లలోకి అడుగుపెట్టగానే చర్మం సాగే గుణాన్ని కోల్పోవడం మొదలవుతుంది. శరీరంలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోవడమే ఇందుకు కారణం. ఈ వయసులో పండ్లతో చేసే ఫేషియల్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడప్పుడు బొప్పాయి, చెర్రీ, గుమ్మడి వంటి పండ్లతో ఫేషియల్స్ చేసుకోవడం వల్ల చర్మం వయసు ఛాయలు కనిపించకుండా మెరిసిపోతుంది.

wrinkles

40 ఏళ్లలో
నలభైలోకి అడుగుపెట్టేసరికి మీ చర్మం సాగే గుణాన్ని బాగా కోల్పోతుంది. వయసుపైబడిన ఛాయలు ఈజీగా తెలిసిపోతాయి. ఇలాంటప్పుడు చాలా మైల్డ్ గా ఉండే ఫేషియల్స్ మాత్రమే చేయించుకోవాలి. అలాగే ఫేషియల్స్ సమయంలో ఆవిరి పట్టడం ఈ వయసు వాళ్లకు మంచిది కాదు. రోజూ క్లెన్సింగ్ మిల్క్ తో చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి. దీనివల్ల చర్మంపై మలినాలు తొలగిపోయి, కాంతివంతంగా తయారవుతుంది. అలాగే అప్పుడప్పుడు చల్లని పాలతో చర్మంపై మసాజ్ చేయడం వల్ల ముడతలు పడకుండా ఉంటుంది.

sagging

50 ఏళ్లలో
యాభై ఏళ్లు వచ్చాయంటే.. చర్మం తేమ శాతం పూర్తీగా కోల్పోతుంది. చర్మం సాగిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ వయసు వాళ్లు విటమిన్స్ లభించే ఆహారానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఫేషియల్ కి బదులు, క్లీనప్ ఎక్కువగా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లతో ఫేషియల్స్ చేయించుకోవచ్చు. ఎసెన్షియల్ ఆయిల్స్ తో మసాజ్ చేసుకున్నా మడతలు పెరగకుండా కాపాడుకోవచ్చు.

English summary

Facials Based on Age: Beauty Benefits Of Facial Massage

Do you love to have a glowing skin? Of course, the answer will be a big ‘Yes’. Sometimes our face may look dull and older than the real age. This makes most women depressed and they will start trying hard to make it beautiful.
Story first published: Saturday, December 19, 2015, 14:23 [IST]
Desktop Bottom Promotion