For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగాళదుంపతో గోల్డెన్ గ్లో..

|

మనం రోజువారి తీసుకునే ఆహారంలో బంగాళ‌దుంప‌ ఒక‌టి.ఇది ఆరోగ్యంతో పాటు అందం పెంచుకోవ‌డానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందంటూన్నారు నిపుణులు. బంగాళాదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు, అందానికి అడ్డుగా నిలిచే ఎన్నో సమస్యల్ని తీరుస్తుంది. కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుటుంది.

బంగాళదుంప కాస్మోటిక్స్ కంటే గ్రేట్ గా ఉపయోగపడుతుందంటున్నారు? మరి అలాంటప్పుడు బంగాళదుంపను చర్మ రక్షణకు ఎందుకు ఉపయోగించకూడదు. నేచురల్ గా లభించే ఏ ఆహారపదార్థమైనా సరే చర్మానికి హాని కలిగించవు. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. బంగాళదుంపలను డైట్ లో చేర్చుకోవడంతో పాటు, చర్మ రక్షణకు బహిర్గతంగా కూడా ఉపయోగించుకోవచ్చు. చాలా రకాల చర్మ సమస్యలను నయం చేస్తుంది. అలాగే జుట్టుకు కూడా గ్రేట్ గా ఉపయోగడపడుతుంది.

బంగాళదుంపలో ఉండే విటమిన్ బి మరియు సి లు మరియు స్ట్రార్చ్ కూడా చర్మ రంగును కాంతివంతంగా మార్చుతాయి మరియు కళ్ళ క్రింది చర్మంను కాపాడి, నల్లటి వలయాలను నివారిస్తాయి. కంటి చుట్టూ ఏర్పడే నల్లటి మ‌చ్చ‌ల‌కు ఆలు రసాన్ని ప‌ట్టిస్తే మంచి ఫ‌లిత‌ముంటుంది.ఆలును స్లైసుగా కోసి తరచూ మొహానికి అప్లై చేస్తుంటే చర్మపు మడతలు తగ్గుతాయి. మరి బంగాళదుంప ఏవిధంగా బ్యూటీ ప్రయోజనాలను అందిస్తుందో చూద్దాం....

నేచురల్ బ్లీచ్:

నేచురల్ బ్లీచ్:

చర్మం నల్లగా..కమిలినట్లు అనిపిస్తుంటే చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి, పొటాటో గుజ్జులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ముడతలు పోయేలా :

ముడతలు పోయేలా :

బంగాళాదుంప రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు రావడం తగ్గుతుంది. ముఖంపై వచ్చే తెల్లమచ్చల్లాంటివి కూడా పోతాయి. ఎండకి కమిలిపోయి బొబ్బలెక్కిన చర్మానికి బంగాళాదుంప రసాన్ని రాసిన చర్మం మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. బంగాళదుంప గుజ్జులో కొద్దిగా పెరుగు జోడించి ముఖానికి మాస్క్ లా వేసుకొని 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముడుతలతో పాటు ఏజింగ్ లక్షణాలు కూడా తొలగిపోతాయి.

చక్కని ఛాయకి :

చక్కని ఛాయకి :

బంగాళాదుంపని మిక్సీలో వేసి మెత్తగా చేసేయండి. అందులో కొద్దిగా ముల్తానీ మట్టి, నిమ్మరసం మిక్స్ చేసి ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంటపాటు వదిలేయండి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువు అవడంతో పాటు, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డుని కూడా అది పీల్చేసుకుంటుంది. దాంతో ముఖం తాజాగా మారుతుంది. అలాగే బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేసుకుంటే చర్మం రంగు తేలుతుంది. దీన్ని ఫేస్ మాస్క్ లాగ అప్లై చేయాలి .

డార్క్ సర్కిల్స్ మరియు కళ్లకి మెరుపుకు :

డార్క్ సర్కిల్స్ మరియు కళ్లకి మెరుపుకు :

ఎవరి ముఖంలోనైనా మొదట ఆకర్షించేవి కళ్లే. అయితే కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం, కళ్లు ఉబ్బడం లాంటివి ఇబ్బంది పెట్టే సమస్యలు. బంగాళాదుంపని ముక్కలుగా చేసి జ్యూసర్‌లో వేస్తే కొంచెం జ్యూస్‌ వస్తుంది. దానిలో దూది ముంచి, కళ్లపై పావుగంట సేపు ఉంచుకోండి. ఇలా రోజూ చేస్తూ ఉంటే నల్లని వలయాలు తగ్గుతాయి.పొటాటోను పేస్ట్ లా చేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి కంటి చుట్టూ అప్లై చేయాలి 10 నిముషాల తర్వాత శుభ్రం చేస్తే డార్క్ సర్కిల్స్ చాలా ఎఫెక్టివ్ గా తొలగిపోతాయి.

 స్కిన్ స్పాట్స్:

స్కిన్ స్పాట్స్:

చర్మంలో అక్కడక్కడా కనిపించే స్పాట్స్ కు పొటాటోతో చెక్క పెట్టవచ్చు. పొటాటో పేస్ట్ ను ముఖానికి పట్టించి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా దీన్ని 25 రోజుల పాటు ట్రై చేస్తే ఫలితం మీరే పసిగడుతారు.

టోనర్ గా:

టోనర్ గా:

మీరు నేచురల్ టోనర్ కోసం చూస్తుంటే ఇది గ్రేట్ గా హెల్ప్ అవుతుంది. పొటాటో పేస్ట్ లో కొద్దిగా కీరదోసకాయ రసాన్ని మిక్స్ చేసి ముఖానికి పట్టించడం వల్ల టోనర్ గా పనిచేస్తుంది.

షైనీ హెయిర్:

షైనీ హెయిర్:

ఆలు రసానికి కోడిగుడ్డు తెల్లసొన, కొంచెం నిమ్మరసాన్ని కలిపి జుట్టుకు పట్టిస్తే వెంట్రుకలు ఆరోగ్యవంతమ‌వ‌డంతో పాటు మెరుస్తాయి. అలాగే బంగాళదుంప తొక్క తొలగించి నీటిలో నానబెట్టి, ఆనీటితో తలస్నానం చేసుకుంటే జుట్టుకు మంచి మెరుపును అందిస్తుంది.

సన్ బర్న్ నివారిస్తుంది:

సన్ బర్న్ నివారిస్తుంది:

పొటాటో చర్మ మీద గాయాలను చర్మ సమస్యలను మాయం చేస్తుంది. ఇది సన్ బర్న్ కూడా నివారిస్తుంది. బంగాళదుంపను స్లైస్ గా కట్ చేసి సింపుల్ గా ముఖం మీద అప్లై చేసి మర్ధన చేయాలి. కొద్ది నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి . ఇలా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఫేస్‌మాస్క్‌లు :

ఫేస్‌మాస్క్‌లు :

ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరే వరకూ ఉంచండి. మొదట గోరువెచ్చటి నీళ్లతో, తరువాత చన్నీళ్లతో కడిగేసుకోండి. అలాగే బంగాళాదుంపని బాగా ఉడకబెట్టి ముద్దలా చేయండి. చల్లారాక ఒక స్పూను పాల పౌడర్‌ని, ఒక స్పూను బాదం నూనెని కలిపి పేస్టులా చేయండి. దానిని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత శుభ్రపరుచుకోండి.

పొడి చర్మము నివారిస్తుంది

పొడి చర్మము నివారిస్తుంది

పొడి చర్మము ఉన్నవాళ్ళు తురిమిన బంగాళాదుంప మరియు అర చెంచా పెరుగు కలిపి దానిని మూకానికి రాసుకొని 20 నిమిషాల తరువాత కడుగుకుంటే మృదువుగా తయారవుతుంది.

English summary

Heal Your Skin With Potato! : Beauty Tips in Telugu

Potato is an affordable vegetable but cosmetics aren't these days. So, why not try using potato for skin care? Well, any natural ingredient doesn't harm your skin and on the top of it, works more effectively.
Story first published: Wednesday, November 11, 2015, 15:46 [IST]
Desktop Bottom Promotion