For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో అరటిపండు ఉంటే చాలు.. బ్యూటీపార్లర్‌ ఇంట్లో ఉన్నట్టే!

|

అందాన్ని సొంతం చేసుకోవడం కోసం రకరకాల పద్ధతులను అనుసరించడం కన్నా... ప్రకృతిలో లభించే సహజత్వ ఆహార పదార్థాలే మిన్న అంటున్నారు బ్యూటీషియన్లు! ఎందుకంటే.. ప్రస్తుతమున్న క్రీములు, ఇతర లోషన్లలో శరీరానికి హాని కలిగించే ఎన్నో రకాల రసాయనాలు, విషపదార్థాలు కలిగి వుంటాయి. అవి శరీరచర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో బాగానే సక్సెస్ అవుతాయి కానీ.. అంతే త్వరగా చర్మంలో వున్న కణాలను దెబ్బతీస్తాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అంటే.. క్రీములు శరీరానికి రాసుకోవడం కొద్దిమోతాదులో ఫర్వాలేదు కానీ.. దాన్నే వ్యసనంగా మార్చుకోవడం చాలా ప్రమాదమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

కానీ.. అమ్మాయిలు మాత్రం అందం విషయంలో ఎప్పటికీ వెనుకడుగు వేయరు. దానికోసం వీళ్లు ఏమిచేయడానికైనా సిద్ధంగా వుంటారు. భోజనం లేకపోయినా వుండగలరు కానీ.. అందానికి సంబంధించిన మేకప్ కిట్ దగ్గర లేకపోతే మాత్రం ఇంటినుంచి బయటకు అస్సలు అడుగులు పెట్టరు. అందం అంటే అంత ప్రాధాన్యమిస్తారు అమ్మాయిలు. అయితే ఇటువంటివారు నిత్యం క్రీములను వాడటం కంటే.. సహజత్వం కలిగిన ఆహారపదార్థాలతో అందాన్ని సొంతం చేసుకోవచ్చు శాస్త్రజ్ఞులు సలహాలు ఇస్తున్నారు. ఇందులో భాగంగానే అరటితో ఆరోగ్యకరమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చునని వారు పేర్కొంటున్నారు. ముఖ సౌందర్యాన్ని, చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి అరటిపండు ఓ మంచి సాధనమని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు లభిస్తున్నాయి. ఫేషియల్‌కి పళ్లు ఎంతో ఉపయోగపడతాయి, వాటిల్లో అరటిపండుతో ఫేషియల్‌ చేసుకుంటే ముఖారవిందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. అరటిపండు మనకు సహజ సిద్ధంగా లభించే పండు. ఇందులో అనేక రకాల పోషక విలువలున్నాయి. ముఖ్యంగా విటమిన్ ఎ, బి, సి, ఇ మరియు పొటాషియం, జింక్ మరియు ఐరన్ మినిరల్స్ ఉన్నాయి. ఇంకా చర్మ సంరక్షణకు ఉపయోగపడే అమినోయాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉండి, చర్మానికి మరియు కేస సంరక్షణకు గొప్పగా సహాయపడుతాయి. అదెలాగో చూద్దాం...

 స్కిన్ మాయిశ్చరైజర్ గా :

స్కిన్ మాయిశ్చరైజర్ గా :

డ్రై స్కిన్ తో బాధపడేవారు అరటిపండు గుజ్జును ఫేస్ మరియు నెక్ ప్యాక్ గా వేసుకోవచ్చు . దీన్ని ప్యాక్ గా వేసుకొన్న 15నిముషాల తర్వాత కోల్డ్ వాటర్ తో శుభ్రగా కడిగి తడిని పూర్తిగా ఆరనివ్వాలి. ఇది చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

 ముడుతలను నివారిస్తుంది:

ముడుతలను నివారిస్తుంది:

చర్మంపై ముడతలు ఏర్పడ్డాయంటే.. చర్మం కాంతి విహీనంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు.. అరకప్పు అరటిపండు గుజ్జు, ఒక టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని పచ్చసొన తీసుకుని మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

ఎక్స్ఫ్లోయేషన్ :

ఎక్స్ఫ్లోయేషన్ :

ఓట్ మీల్, కోకనట్ మిల్క్ మరియు అరటిపండ్లు మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకొని 20 నిముషాల బాగా స్క్రబ్ చేసి తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి మంచి గ్లోను అందిస్తుంది.

 ఆయిల్ స్కిన్

ఆయిల్ స్కిన్

అరటిపండుగుజ్జులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో ఆయిల్ నెస్ కంట్రోల్ అవుతుంది.

మొటిమలకు చెక్ పెట్టే బనానా ప్యాక్

మొటిమలకు చెక్ పెట్టే బనానా ప్యాక్

అరటిపండు గుజ్జుకి ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని.. 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత.. చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే.. మొటిమలు, మచ్చలు మాయమౌతాయి.

ముఖం కాంతివంతంగా మార్చడానికి:

ముఖం కాంతివంతంగా మార్చడానికి:

అరటిపండు గుజ్జులో ఒక టీస్పూన్ తేనె, లేదా ఒక టీస్పూన్ పచ్చిపాలు వేసి కలపి ముఖానికి పట్టించి బాగా ఆరనివ్వాలి. కొద్దిసేపటి గోరువెచ్చటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి. ఇలా ఒక నెలా పాటు క్రమం తప్పకుండా చేసినట్లైతే ముఖం మిలమిల మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.

ముఖంలో మచ్చలను మాయం చేస్తుంది:

ముఖంలో మచ్చలను మాయం చేస్తుంది:

  1. ముఖం మీద మచ్చలతో బాధపడేవారు అరటిపండు తొక్కతో మచ్చలున్న ప్రదేశంలో సున్నితంగా రుద్ది ఓ అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. రోజూ మొత్తంమీద వీలైనన్నిసార్లు ఈ విధంగా చేసినట్లైతే మచ్చలు మాయం అవుతాయి.
 వయసు పెరిగిన ఆనవాళ్లను తెలియకుండా చేయడాని మృతకణాలను తొలగిస్తుంది :

వయసు పెరిగిన ఆనవాళ్లను తెలియకుండా చేయడాని మృతకణాలను తొలగిస్తుంది :

అరటిపళ్లలోని 'ఇ' విటమిన్‌ ముఖంలో వయసు తాలూకు ఛాయలను కనిపించకుండా చేస్తుంది. దీనికి ఓట్‌మీల్‌, కొబ్బరిపాలు కూడా జోడించి ముఖానికి మాస్క్‌లా వేసుకొంటే మృతకణాలు తొలగిపోతాయి. అరటి పండు గుజ్జుని పాదాలకు పట్టిస్తే, వాటికి తగినంత తేమ అంది పగుళ్లు రాకుండా ఉంటాయి.

హెయిర్ కేర్:

హెయిర్ కేర్:

ఎన్నిసార్లు కండిషనింగ్‌ చేసినా జుట్టు పొడి బారుతుంటే... పండిన అరటి పళ్లు తీసుకుని, దానిలో కొద్దిగా పెరుగు కలిపి... మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు మెరుస్తూ, అందంగా మెరిసిపోతుంది.

పాదాలు:

పాదాలు:

పగిలిన పాదాలను అందంగా తీర్చిదిద్దుకోవడానికీ అరటిపండు ఎంతో ఉపయోగపడుతుంది. పండిన అరటిపండును మెత్తని గుజ్జులా చేసుకుని, పాదాలకి పట్టించి, పావుగంట తరవాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరి. పాదాలు ఖరీదైన మాయిశ్చరైజర్లు ఇవ్వలేని తేమా, నునుపుదనం వస్తాయి.

ఉబ్బిన కళ్లు మాయం :

ఉబ్బిన కళ్లు మాయం :

పైన చెప్పినట్టు అరటిపండు ప్యాక్‌ను కళ్లలోకి పోకుండా జాగ్రత్తగా వాటి చుట్టూ రాసుకోవాలి. అలా రాసుకున్నాక ఓ 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కుంటే ఉబ్బిన కళ్ల కింద చర్మం సాధారణ స్థితికి చేరుతుంది. విటమిన్-ఏ ఉండటం వల్ల రోజూ అరటిపండ్లు తింటే కంటి చూపు కూడా చురుగ్గా ఉంటుంది.

హెయిర్ కండీషనర్ గా:

హెయిర్ కండీషనర్ గా:

కురులకు అరటి : జుట్టు రాలిపోతోందని బాధపడేవారికి, అలాగే డ్రై హెయిర్‌తో ఇబ్బంది పడేవారికి మంచి చిట్కా ఉంది అరటితో. ప్రతిసారి తల స్నానం చేసిన తర్వాత అరటిపండు గుజ్జును పెరుగుతో కలిపిన మిశ్రమాన్ని మాడుకు, జుట్టుకు బాగా పట్టించాలి. ఓ అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటే అది జుట్టుకు మంచి కండీషనర్‌గా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం త్వరగా తగ్గుతుంది. కెమికల్స్‌తో తయారయ్యే కండీషనర్లు వాడేకంటే ఈ అరటిగుజ్జు వాడితే అందం, ఆరోగ్యం రెండూనూ.

దురదకలిగించే జుట్టు:

దురదకలిగించే జుట్టు:

ఇందులో ఉండే పొటాసియం తలమాడుకు మరియు కేశాలకు గ్రేట్ గా సహాయపడుతాయి . కొద్దిగా పెరుగును అరటిపండు గుజ్జుకు మిక్స్ చేసి, దానికి కొద్దిగా అవొకాడో మిక్స్ చేసి తలకు పట్టించి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

 అరటిపండులో వుండే యాంటి బ్యాక్టీరియల్ గుణాలు

అరటిపండులో వుండే యాంటి బ్యాక్టీరియల్ గుణాలు

అరటిపండులో వుండే యాంటి బ్యాక్టీరియల్ గుణాలు, అందులోని విటమిన్ - ఎ, పొటాషియం వంటివి చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి అయినా అరటిపండుని చర్మ సౌందర్యానికి వాడటం మంచిది.

Story first published: Monday, October 19, 2015, 11:03 [IST]
Desktop Bottom Promotion