For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మరంద్రాలను కుదించే లేదా మాయం చేసే సులభ చిట్కాలు

|

ముఖ చర్మంలో రంధ్రాలు, ముఖ్యంగా బుగ్గల్లో రంద్రాలతో ఇబ్బంది పడుతున్నారా? మరి మొటిమలు వల్ల ఏర్పడిన చర్మ రంద్రాలను డస్ట్ మరియు ఆయిల్ తో నింపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ రంద్రాలో డస్ట్ మరియు ఆయిల్ చేరడం వల్ల ముఖంలోని చర్మ రంద్రాలు మరింత పెద్దవిగా కనబడుతాయి.

READ MORE: ఛామన ఛాయ యొక్క చర్మ సౌందర్యాన్ని పెంచే నిమ్మరసం

మరి ఇలా ముఖ అందాన్ని పాడు చేసే చర్మ రంద్రాలను కుదించడం లేదా మాయం చేయడం ఎలా? మీ బుగ్గల మీద ఏర్పడ్డ చర్మ రంద్రాలను కుదించడానికి లేదా మాయం చేయడానికి మొదట మీరు చర్మరంద్రాల్లో చేరిని మురికిని తొలగించాలి . అక్కడ చేరిని జిడ్డును పూర్తిగా తొలగించాలి.

READ MORE: మొటిమలను నివారించే రెగ్యులర్ స్కిన్ కేర్ టిప్స్

చర్మం రంద్రాల్లో చేరే ఆయిల్ మరియు డస్ట్ చేరడం వల్ల పరిస్థితి మరింత తీవ్రం అవుతుంది. కాబట్టి చర్మ రంద్రాలను మాయం చేయడానికి క్లీనింగ్ మరియు ఎక్స్ ఫ్లోయేటింగ్ మాత్రమే కాకుండా కొన్ని మాయిశ్చరైజింగ్ టిప్స్ కూడా అనుసరించాలని చర్మ నిపుణుల యొక్క అభిప్రాయం. మరి మాయిశ్చరైజింగ్ టిప్స్ ఏంటో చూద్దాం....

స్టెప్ #1 :

స్టెప్ #1 :

చర్మంను శుభ్రపరుచుకోవడానికి ముఖానికి ఆవిరి పెట్టడం మొదట చేయాల్సిన పని. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖ చర్మంలో చర్మ రంద్రాల్లో ఉండే దుమ్ము, ధూళి తొలగిపోతుంది . చర్మం క్లియర్ అవుతుంది.

స్టెప్ # 2:

స్టెప్ # 2:

ముఖానికి ఆవిరి పట్టిన తర్వాత స్క్రబ్ చేయాలి. ఆవిరి పట్టిన వెంటనే స్ర్కబ్బింగ్ చేయడం వల్ల చాలా సులభంగా చర్మం ఎక్స్ ఫ్లోయేట్ అవుతుంది.

స్టెప్ # 3:

స్టెప్ # 3:

ఎక్స్ ఫ్లోయేట్ చేసుకొన్న తర్వాత, చర్మ రంద్రాలను కుందించే ముఖ్యమైన పని, ఐస్ క్యూబ్స్ తీసుకొని మీ ముఖం మీద రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం టైట్ అవుతుంది మరియు చూడటానికి అందంగా కనబడుతారు.

స్టెప్ # 4:

స్టెప్ # 4:

కొద్ది సమయం తర్వాత, చర్మానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. సాధారణంగా స్ర్కబ్బింగ్ వల్ల నేచురల్ ఆయిల్స్ తొలగిపోతాయి. కాబట్టి, ఎక్సఫ్లోయేషన్ తర్వాత ఎస్ఎఫ్ పి క్రీములతో చర్మానికి మాయిశ్చరైజ్ చేసుకోవాలి.

నివారణ చిట్కా స్టెప్ #1 :

నివారణ చిట్కా స్టెప్ #1 :

ముఖం శుభ్రం చేసుకోకుండా నిద్రించకూడదు, ప్రతి రోజూ సాయంత్రం ఖచ్చితంగా మేకప్ తొలగించి, మేకప్ వేసుకొనే అలవాటు లేకపోయినా మీరు మీ ముఖాన్ని నిద్రించడానికి ముందు శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మ రంద్రాల్లో డస్ట్ చేరకుండా నివారిస్తుంది.

నివారణ చిట్కా స్టెప్ #2 :

నివారణ చిట్కా స్టెప్ #2 :

మీ చర్మ తత్వానికి సూట్ కానివి మీ చర్మానికి ఉపయోగించకండి, అలా చేయడం వల్ల చర్మ రంద్రాలు మరింత పెద్దవిగా మారుతాయి. చర్మ రంద్రాలను మాయం చేయడానికి ఇవి కొన్ని ఎఫెక్టివ్ చిట్కాలు...

English summary

How To Shrink Pores Naturally: Beauty Tips in Telugu

How To Shrink Pores Naturally: Beauty Tips in Telugu. How to shrink the pores on your skin? If you wish to shrink pores on your cheeks, you must first work on removing the dust and washing off the oil deposited over there.
Story first published: Monday, August 31, 2015, 15:50 [IST]
Desktop Bottom Promotion