For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నొప్పి లేకుండా.. బ్లాక్ హెడ్స్ తొలగించే సింపుల్ హోం రెమిడీస్

By Nutheti
|

బ్లాక్ హెడ్స్..!! ఇతి ప్రతి అమ్మాయిని ఇబ్బందిపెట్టే సమస్య. ఒకసారి బ్లాక్ హెడ్స్ మొదలయ్యాయంటే... పూర్తీగా పోగొట్టుకోవడం చాలా కష్టం. అలాగే వీటిని తొలగించుకునేటప్పుడు చాలా నొప్పి కూడా బాధిస్తుంది. బ్లాక్ హెడ్స్ లోపలి భాగంలో హెయిర్ తోపాటు పెరుగుతూ బయటివైపు ప్రభావం చూపుతాయి.

ఈ సమస్య మీ చర్మంపై కనిపిస్తూ ఉంటే.. వీటిని వెంటనే తొలగించుకోవాలి. అయితే.. పార్లర్స్ కంటే.. ఇంట్లోనే హోం రెమిడీస్ ద్వారా వీటిని తొలగించుకుంటే.. మంచి ఫలితం కనిపిస్తుంది. అది ఎలాంటి నొప్పి లేకుండా.. ఈజీగా రిమూవ్ చేసుకునే పద్ధతులు మీ చేతుల్లోనే ఉన్నాయి.

ముఖంలో నుదురు భాగం, ముక్కు, గడ్డం వంటి ప్రాంతాల్లో ఎక్కువగా బ్లాక్ హెడ్స్ వేధిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో కాస్త ఆయిల్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ బ్లాక్ హెడ్స్ ఎక్కువగా వస్తాయి. అయితే ఈ పార్ట్స్ అన్నీ.. చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. దీంతో వీటిని తొలగించుకోవాలంటే.. చాలా నొప్పిగా ఉంటుంది. పెయిన్ లేకుండా.. సింపుల్ ట్రీట్మెంట్ హోం రెమిడీస్ తోనే సాధ్యం. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

టొమాటో జ్యూస్

టొమాటో జ్యూస్

బ్లాక్ హెడ్స్ నివారించడానికి టొమాటో జ్యూస్ చక్కటి పరిష్కారం. ఇందులో యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. కాబట్టి దీన్ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో అప్లై చేసి.. చూపుడు వేలుతో.. కాస్త నొక్కడం వల్ల ఈజీగా తొలగిపోతాయి. ఈ సింపుల్ ట్రీట్మెంట్ రోజూ పడుకునే ముందు ఫాలో అవడం వల్ల న్యాచురల్ గా బ్లాక్ హెడ్స్ తొలగించుకోవచ్చు.

బంగాళదుంప రసం

బంగాళదుంప రసం

బంగాళదుంప రసంలో న్యాచురల్ బ్లీచింగ్, క్లెసింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక బంగాళదుంప తీసుకుని సగానికి కట్ చేసి.. బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో కింద నుంచి పైకి రుద్దుతూ ఉండాలి. ఇలా 10 నిమిషాల పాటు చేయడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.

పంచదారతో స్ర్కబ్

పంచదారతో స్ర్కబ్

ఒక బౌల్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేయాలి.. అందులో రెండు చుక్కల రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ స్ర్కబ్ ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో మసాజ్ చేయాలి. వారానికి రెండు సార్లు ఈ పద్ధతి ఫాలో అవడం వల్ల బ్లాక్ హెడ్స్ కి గుడ్ బై చెప్పవచ్చు.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడా

ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టేబుల్ స్పూన్ నీళ్లు కలిపి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని డైరెక్ట్ గా చర్మంపై రాసుకోవాలి. ఆరిన తర్వాత స్కిన్ పై నుంచి మెల్లగా లేయర్ లా తొలగించాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగించుకోవచ్చు.

నిమ్మరసం

నిమ్మరసం

నిమ్మరసం ఉపయోగించడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్ హెడ్స్ తొలగిపోవడమే కాదు.. స్కిన్ కొత్త నిగారింపు సంతరించుకుంటుంది. నిమ్మరసంతో ముఖాన్ని మసాజ్ చేయాలి. తర్వాత 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాసిడ్ బ్లాక్ హెడ్స్ ఈజీగా తొలగిస్తుంది.

తేనె

తేనె

చర్మాన్ని స్మూత్ గా మార్చడానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసానికి కొంచెం తేనె కలిపి బ్లాక్ హెడ్స్ పై రాసుకోవాలి. తర్వాత కాసేపు మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా

అలోవెరా

ఎలాంటి చర్మ సమస్యకైనా అలోవెరా చక్కటి పరిష్కారం. అలోవెరా జెల్ ని బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో అప్లై చేసి.. కొద్దిగా ఆరిన తర్వాత కింది నుంచి పైకి తొలగించాలి. రోజుకి రెండుసార్లు ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

English summary

Painless Home Remedies To Remove Blackheads

Blackheads are a common problem faced by both men and women. Blackheads can and should be treated at the earliest if you want to get rid of them immediately.
Story first published: Tuesday, December 22, 2015, 16:34 [IST]
Desktop Bottom Promotion