For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే.. అందమైన చర్మానికి పంచదారే బెటర్

By Nutheti
|

ఎలాంటి శుభాకార్యాలైనా, ఫంక్షన్స్ అయినా.. తీపి కబురైనా.. పండగ ఏదైనా అందరికీ ముందుగా గుర్తొచ్చేది స్వీట్స్. అలా అన్ని సందర్భాల్లో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ సంపాదించుకున్న స్వీట్స్ అంటే ఇష్టపడని వారుండరు. ఈ స్వీట్ నెస్ అంటే ముందుగా గుర్తొచ్చే పంచదార. ఇది నోటికి మాత్రమే కాదు.. చర్మానికి కూడా అందం తీసుకొస్తుంది.

READ MORE: షుగర్స్ మరియు షుగర్ ఫుడ్స్ వల్ల ఆరోగ్యానికి కలిగే డేంజరెస్ ఎఫెక్ట్స్

చర్మ సౌందర్యంపై ప్రతి ఒక్కరికీ ఆసక్తి పెరిగింది అలాగే కేర్ కూడా పెరిగింది. అయితే ఇంట్లోనే ఉండే వస్తువులతో చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవడం చాలా మంచి అలవాటు. మార్కెట్ లో దొరికే వస్తువుల్లో కెమికల్స్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. వాటికి బదులు ఇంట్లో ఉండే వస్తువులతోనే సహజ సౌందర్యం పొందడం వల్ల మంచి ఫలితంతోపాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

 చక్కెర ఎక్కువగా తింటే ఏమవుతుందో మీకు తెలుసా ? చక్కెర ఎక్కువగా తింటే ఏమవుతుందో మీకు తెలుసా ?

షుగర్ ను ఇప్పుడు చర్మ సౌందర్య సాధనాల్లో కూడా వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి సహజ సౌందర్యం అందించడంతో పాటు, ముఖంలో రంధ్రాలు ఏర్పడకుండా కాపాడుతుంది. పంచదార చర్మం లోని నూనె గ్రంధులను సమతుల్యం చేస్తుంది. చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి.. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చేసే గుణాలు చక్కెరలో ఉన్నాయి. పంచదారలో దాగున్న బ్యూటీ సీక్రెట్స్, చర్మ సంరక్షణకు పంచదారను ఎలా ఉపయోగించాలో ఓ లుక్కేద్దాం..

గ్లోయింగ్ స్కిన్

గ్లోయింగ్ స్కిన్

చర్మ సంరక్షణలో పంచదార ఎంతో తేనె, నిమ్మరసం సమానంగా తీసుకుని అందులో కాస్త చక్కెర మిక్స్ చేసి.. బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. దీనివల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది.

ఎసెన్షియల్ ఆయిల్ తో

ఎసెన్షియల్ ఆయిల్ తో

చర్మం పొడిబారి నిర్జీవంగా మారినప్పుడు చక్కెరను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా చక్కెర తీసుకుని అందులో ఏదో ఒక ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. మర్దనా చేయాలి. తర్వాత చల్లటినీటితో శుభ్రం చేసుకుంటే కొత్త కళ సంతరించుకుంటుంది.

నలుపు తగ్గడానికి

నలుపు తగ్గడానికి

చాలామందికి మోకాళ్లు, మోచేతులు నల్లగా మారి ఇబ్బంది పెడుతుంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి పంచదార బాగా సహాయపడుతుంది. కొన్ని గులాబీ రేకలు ఆరబెట్టి పొడిచేసుకోవాలి. ఈ పొడిని కొంచెం తీసుకుని కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో మోకాళ్లు, మోచేతులపై రుద్దడం వల్ల నలుపు తగ్గుతుంది.

స్ర్కబ్

స్ర్కబ్

షుగర్, లెమన్ జ్యూస్, తేనె మిక్స్ చేసి ముఖానికి స్ర్కబ్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ ఫలితాలిస్తుంది. తరచుగా ఈ స్ర్కబ్ ట్రై చేయడం వల్ల చర్మంలో పేరుకున్న దుమ్ము, ధూళి శుభ్రమవుతుంది.

పెదవులకు

పెదవులకు

కొద్దిగా చక్కెర తీసుకుని అందులో కొన్ని పాలు, కొంచెం తేనె కలపాలి. ఈ మిశ్రమంతో రోజూ రాత్రి పడుకునే ముందు పెదాలకు మర్దనా చేయాలి. ఇలా రెండు మూడు రోజులకొకసారి చేస్తూ ఉంటే.. అందమైన పెదవులు మీ సొంతమవుతాయి.

నిర్జీవమైన చర్మానికి

నిర్జీవమైన చర్మానికి

ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకున్నా కొంతమందికి చర్మం నిర్జీవంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం గంధం, రోజ్ వాటర్, చక్కెర అన్నింటినీ సమంగా తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్యాక్ లా అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మేని ఛాయ మెరుస్తుంది.

ముడతల చర్మానికి

ముడతల చర్మానికి

చర్మం ముడతలు పడటం, సన్నని గీతలు వంటివి వయసు మరింత ఎక్కువైందని తెలుపుతాయి. అలాంటప్పుడు చక్కెర తీసుకుని అందులో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది వయసు ఛాయలే కాదు ట్యాన్, పిగ్మెంటేషన్ సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.

చర్మాన్ని స్మూత్ గా చేయడానికి

చర్మాన్ని స్మూత్ గా చేయడానికి

పంచదార చర్మాన్ని ఎక్స్ ఫ్లోయేట్ చేయడం మాత్రమే కాదు, బ్రౌన్ షుగర్, ఆలివ్ ఆయిల్ మిశ్రమంతో స్ర్కబ్ చేయడం వల్ల చర్మాన్ని తేమగా, సాఫ్ట్ గా, కాంతివంతంగా ఉంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

చర్మంలోని నూనెను బ్యాలెన్స్ చేయడానికి

చర్మంలోని నూనెను బ్యాలెన్స్ చేయడానికి

పంచదారతో మరో గొప్ప ప్రయోజనం ఏమిటంటే ఇది చర్మంలో ఆయిల్ ను బ్యాలెన్స్ చేస్తుంది. షుగర్ లో రెండు ముఖ్యమైన కాంపోనెంట్స్ గ్లైకోలిక్ యాసిడ్, ఆల్ఫా మైడ్రాక్సి యాసిడ్స్ ఉంటాయి. ఈ రెండు కాంపోనెంట్స్ చర్మంలో ఫర్ ఫెక్ట్ ఆయిల్ బ్యాలెన్స్ చేస్తుంది. అవి మీ చర్మాన్ని పొడిబారనివ్వకుండా, ఎక్కువ జిడ్డుగా లేకుండా సమతుల్యం చేస్తాయి.

బేసిక్ స్క్రబ్

బేసిక్ స్క్రబ్

ఒక బౌల్లో అరకప్పు పంచదార తీసుకొని, దానిలో కొన్ని నీటి చుక్కలు కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను పేస్ ప్యాక్ గా వేసుకొని మసాజ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

ల్యావెండర్ విత్ షుగర్

ల్యావెండర్ విత్ షుగర్

ఒక బౌల్లో షుగర్, ఒక చెంచా ల్యావెండర్ ఆయిల్ వేసి బాగా కలపాలి... ఈ మిశ్రమాన్ని చర్మం డ్రై గా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

మూడు చెంచాల కొబ్బరి నూనెలో కొద్దిగా షుగర్ వేసి బాగా కలపాలి. షుగర్ కరగడం ప్రారంభమైనప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలి. కొబ్బరి నూనె చర్మానికి పోషణ అందించి బెటర్ లుక్ ని ఇస్తుంది.

English summary

The Amazing Beauty Benefits Of Sugar

When consumed as part of a regular diet, sugar is one food item to be avoided. A high-sugar diet is a definite trigger for weight gain. Also, consumption of sugar is bad for the skin as it causes breakouts and wrinkles.
Story first published: Monday, December 7, 2015, 14:07 [IST]
Desktop Bottom Promotion