For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయిల్ స్కిన్ నివారించే 12 నేచురల్ స్కిన్ టోనర్స్ ...

|

మన చర్మాన్ని రొటీన్ గా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం . చర్మం సంరక్షణ కోసం తీసుకొనే జాగ్రత్తల్లో స్కిన్ టోనింగ్ గురించి ఎంత మందికి తెలుసు? చర్మ సంరక్షణ కోసం క్లెన్సింగ్ మరియు టోనింగ్ చేసుకోవడం రెండూ తప్పనిసరిగా చేసుకోవల్సిన చర్మ సంరక్షణలో ముఖ్యమైనటువంటి క్లీనింగ్ పద్దతులు . ఎందుకంటే చర్మ అందంగా సౌందర్య వంతంగా కనబడాలంటే స్కిన్ క్లెన్సింగ్, టోనింగ్ మరియు ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల మీ చర్మం అందంగా అద్భుతంగా మారుతుంది.

ఆయిల్ స్కిన్: నివారించే బెస్ట్ హోం రెమెడీస్

అదే ఆయిల్ స్కిన్ విషయంలో మరిన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది . మనం రెగ్యులర్ గా స్నానం చేసినట్లుగానే ఆయిల్ స్కిన్ నివారించడం కోసం రెగ్యులర్ టోనింగ్ చాలా ముఖ్యం. ఆయిల్ స్కిన్ కోసం రెగ్యులర్ టోనింగ్ ఎందుకు అవసరం? స్కిన్ టోనింగ్ వల్ల చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ గ్రహిస్తుంది. ముఖ చర్మంలో మురికిని తొలగిస్తుంది. అందుకే రెగ్యులర్ టోనర్ అవసరం. చర్మం మెరిసేలా కాంతివంతంగా కనబడేలా చేస్తుంది మరియు మొటిమలను లేకుండా చేస్తుంది!

కొబ్బరి నూనె ఉపయోగించడం వల్ల జీవనశైలిలో అనేక మార్పులు

ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి ఖరీదైనవి మాత్రమే కాదు, దీర్ఘకాలంలో చర్మానికి హాని కలిగించే కెమికల్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి, అలా జరగకుండా ఉండాలన్నా, డబ్బు ఆధా చేయాలన్నా....మీరు కొన్ని సింపుల్ హోం మేడ్ టోనర్స్ ను కనుగొని చర్మానికి టోనర్ గా వేసుకోవాలి. అలాంటి హోం రెమెడీస్ మన వంటగదిలో కూడా ఉండవచ్చు. అయితే ఆయిల్ స్కిన్ కు టోనర్ గా ఉపయోగపడేవి మాత్రమే ఎంపిక చేసుకొని టోనర్ గా ఉపయోగించుకోవాలి . ఇవి చాలా సింపుల్ హోం రెమెడీస్, చౌకైనవి మాత్రమే కాదు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి...మరి అవేంటో చూద్దాం.....

పుదీనా :

పుదీనా :

పుదీనా చాలా వండర్ ఫుల్ గా వర్కౌతుంది . ఇది ఒక గొప్ప ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. మరియు చర్మంలోని డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. పుదీనా ఆకులను హాట్ వాటర్లో మిక్స్ చేసి , ఈ నీటిని చల్లారనివ్వాలి. తర్వాత ఈ నీటిని ఉపయోగించి అప్పుడప్పుడు ముఖం శుభ్రం చేసుకుంటుండాలి.

అలోవెర:

అలోవెర:

కలబంద ఇది మాయిశ్చరైజర్ గా మాత్రమే కాదు, స్కిన్ స్మూతినెంగ్ ఏజెంట్ గా పనిస్తుంది. ఇది చర్మానికి గ్రేట్ టోనర్. కొద్దిగా అలోవెరా జ్యూస్ ను తీసి నేరులా ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటుంది . కాబట్టి చాలా ఎఫెక్టివ్ గా సన్ బర్న్, రాషెష్ ను నివారిస్తుంది.

టమోటో జ్యూస్ :

టమోటో జ్యూస్ :

టమోటో జ్యూస్ నేచురల్ గ్లోను పెంచుతుంది మరియు ముఖంలో మలినాలను తొలగిస్తుంది. టమోటో జ్యూస్ మరియు తేనె ఈ క్వెల్ గా మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 వెనిగర్:

వెనిగర్:

వెనిగర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వెనిగర్ లో ఉండే అసిడిక్ నేచర్ వల్ల చర్మంలో నార్మ పిహెచ్ లెవల్స్ ను రీస్టోర్ చేస్తుంది. వాటర్ లో కొద్దిగా వెనిగర్ మిక్స్ చేయాలి. అందులో కాటన్ బాల్ డిప్ చేసి ఆ నీటితో ముఖానికి మర్దన చేసి ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం, పుదీ, హాజల్ :

నిమ్మరసం, పుదీ, హాజల్ :

ఒక చెంచా నిమ్మరసం, ఒక మింట్ టీ బ్యాగ్, రెండు చెంచాల హాజల్ తీసుకొని వేడి నీళ్ళలో వేసి మిక్స్ చేసి ఉడికించాలి. మొదట టీ బ్యాగ్ ను వేడి నీళ్ళలో వేసి కొద్దిసేపు బాయిల్ చేయాలి . టీబ్యాగ్ ను తొలగించి తర్వాత నిమ్మరసం మరియు హాజల్ ను మిక్స్ చేసి నీటిని మరిగించాలి . మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసి తర్వాత చల్లార్చి అందులో కాటన్ బాల్ డిప్ చేసి ముఖం మరియు మెడను శుభ్రం చేసుకోవాలి.

తులసి టోనర్:

తులసి టోనర్:

తులసి ఆకులను మెత్తగా చేసి, పేస్ట్ ను అరకప్పు వేడి నీటిలో వేసి, బాగా మిక్స్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి. ఈ నీటికి ఒక చెంచా అలోవెర జెల్ మిక్స్ చేయాలి . తర్వాత ఈ నీటిని ముఖానికి పట్టించవచ్చు లేదా నేరుగా త్రాగవచ్చు. ఈ నేచురల్ హోం మేడ్ టోనర్ మొటిమలును మరియు మచ్చలను నివారిస్తుంది.

 కీరదోస +పెరుగు:

కీరదోస +పెరుగు:

ఫ్రెష్ గా ఉండే కీరదోసకాయను మెత్తగా తురుముకొని, పెరుగుతో మిక్స్ చేసి , ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి . 10నిముషాల తర్వాత శుభ్రం చేసుకోండం వల్ల ఆయిల్ స్కిన్ తొలగించి నేచరల్ ఎక్సలెంట్ స్కిన్ తో ఫ్రెష్ గా కనబడుతారు.

ఐస్ కోల్డ్ వాటర్ :

ఐస్ కోల్డ్ వాటర్ :

ఐస్ కోల్డ్ వాటర్ లేదా ఐస్ క్యూబ్ . ఐస్ క్యూబ్స్ ను ముఖానికి అప్లై చేస్తూ సున్నితంగా మసాజ్ చేసుకోవచ్చు . ఇది ఒక అద్భుతమైన నేచురల్ ఫేస్ ప్యాక్ ..

రోజ్ వాటర్:

రోజ్ వాటర్:

ముఖానికి ప్రతి రోజూ రోజ్ వాటర్ ను అప్లై చేయడం వల్ల చర్మానికి కొన్ని అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది . ఆయిల్ ఫ్రీ చేస్తుంది. చర్మంను సాఫ్ట్ గా మరియు రేడియంట్ గా మార్చుతుంది.

హనీ టోనర్:

హనీ టోనర్:

ఒక చెంచా తేనె మరియు ఒక చెంచా నిమ్మరసంలో కొద్దిగా ఎగ్ వైట్ వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల ఇది చర్మ రంద్రాలను శుభ్రపరిచి, రంధ్రాలు మూసుకొనేలా చేసి చర్మాన్ని టైట్ గా మార్చుతుంది. ఇంకా ముడుతలను నివారిస్తుంది. స్కిన్ ఎలాసిటి మెరుగుపరుస్తుంది మరియు చర్మానికి అవసరం అయ్యే పోషణను అందిస్తుంది.

కీరదోస-క్యారెట్ టోనర్:

కీరదోస-క్యారెట్ టోనర్:

గుప్పెడు పుదీనా ఆకులను వేడి నీటిలో వేసి బాయిల్ చేయాలి. దీనికి 3 చెంచాలి కీరదోస రసాన్ని, రెండు చెంచాల క్యారెట్ రసాన్ని మిక్స్ చేసి ఐస్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేయాలి. ఒక్కసారి ఐస్ క్యూబ్స్ ఏర్పడిన తర్వాత ఈ ఐస్ ముక్కలతో ముఖం మీద మర్దన చేయాలి.

మెంతులతో టోనర్:

మెంతులతో టోనర్:

గుప్పెడు మెంతులను వేడినీటిలో వేసి ఉడికించాలి. బాగా మరిగించిన తర్వాత నీటిని వేరే బౌల్లోనికి ఫిల్టర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ఫేస్ టోనర్ గా ఉపయోగించుకోవాలి.

English summary

TOP 12 Natural Toners For An Oily Skin

Cleansing, toning and moisturising the skin regularly can make it look more radiant and glowing. Toning the skin is one the most important and essential steps in skin care routine. Toning the skin is equally important, as moisturising the skin, because it helps in restoring the pH balance of the skin.
Story first published: Saturday, December 26, 2015, 13:20 [IST]