For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డార్క్ లిప్స్ ను పింక్ అండ్ సాప్ట్ గా మార్చే గ్లిజరిన్...

|

సహజ చర్మ సంరక్షణలో గ్లిజరిన్ అద్భుతంగా పనిచేస్తుంది. పెట్రోలియం నుండి గ్రహించే ఒక నేచురల్ ప్రొడక్ట్స్ గ్లిజరిన్ . ఇది చిక్కగా ఉంటుంది. స్వీట్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఇది చౌకైన ఒక బ్యూటి ప్రొడక్ట్ మరియు ఇది చాలా సులభంగా అందుబాటులో ఉండే ఒక మాయిశ్చరైజింగ్ ప్రొడక్ట్. అంతే కాదు ఇది క్లెన్సింగ్, టోనింగ్ మరియు చర్మంలో ముడుతలను నివారిస్తుంది.

పురుషుల్లో డార్క్ లిప్స్(పెదాల నలుపు)నివారించే టిప్స్

చర్మ సమస్యలకు ఉత్తమమైన నివారినిగా పనిచేస్తుంది గ్లిజరిన్. చర్మ సంరక్షణలో డ్రై స్కిన్ కు గ్లిజరిన్ మాయిశ్చరైజర్ గా అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కాదు గ్లిజరిన్ సాప్ట్ అండ్ పింక్ లిప్స్ ను అందిస్తుంది? గ్లిజరిన్ కంటే మరింత బెటర్ గా మరేది పనిచేయదంటే నమ్మకం కుదరదు. లిప్ కేర్ లో ఖరీదైన లిప్ బామ్స్ ను కొనుగోలు చేయడం కంటే చౌకైన గ్లిజరిన్ తోనే చర్మ సౌందర్యంతో పాటు, పెదాల అందాన్ని సొంత చేసుకోవచ్చు . చాలా మంది డార్క్ లిప్స్ తో బాధపడుతుంటారు. ముఖ్యంగా ఇది డ్రైనెస్సే కారణం . ఈ సమస్యను నివారించడానికి గ్లిజరిన్ అద్భుతంగా పనిచేస్తుంది.

చౌకైన గ్లిజరిన్ తో ఎఫెక్టివ్ బ్యూటి బెనిఫిట్స్

అందుకే గ్లిజరిన్ ను చాలా కాస్మోటిక్స్ లో వినియోగిస్తారు. మరియు చర్మ సమస్యలకు వినియోగించే మెడిసినల్ ప్రొడక్ట్స్ లోనూ గ్టిజరిన్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే గ్లిజరిన్ ను ఉపయోగించే ముందు అతి తక్కువ మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. అదికూడా చాలా పలుచగా ముఖానికి రాసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇది చర్మానికి హాని కలిగిస్తుంది. మరి పెదాలకు గ్లిజరిన్ ఎలాంటి అద్భుతాలను చేస్తుందో చూద్దాం...

పెదాలను సాఫ్ట్ గా మార్చుతుంది:

పెదాలను సాఫ్ట్ గా మార్చుతుంది:

గ్లిజరిన్ లో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు పొడిబారిన పెదాలకు మరియు పగిలిన పెదాలకు ఒక పర్ఫెక్ట్ రెమెడీ . ముఖ్యంగా వింటర్ సీజన్ లో లిప్స్ పగుళ్ళు, చీలడం, కొన్ని సందర్భాల్లో బ్లీడింగ్ వంటి సమస్యలన్నింటికి గ్లిజరిన్ అద్భుతంగా సహాయపడుతుంది.

పెదాలను పింక్ గా మార్చుతుంది:

పెదాలను పింక్ గా మార్చుతుంది:

స్మోకింగ్ మరియు ఇతర కారణాల వల్ల డార్క్ లిప్స్ తో బాధపడే వారు, గ్లిజరిన్ ను ప్రతి రోజూ ఉపయోగించడం వల్ల పింక్ కలర్ లిప్స్ ను పొందవచ్చు . రాత్రి నిద్రించడానికి ముందు గ్లిజరిన్ ను పెదాలకు అప్లై చేయాలి. ఈ రెగ్యులర్ గా చేస్తూ కొన్ని రోజుల తర్వాత డిఫరెన్స్ ను గుర్తించండి.

పెదాలు మాయిశ్చరైజింగ్ గా ఉంటాయి :

పెదాలు మాయిశ్చరైజింగ్ గా ఉంటాయి :

సున్నితమైన పెదాల కోసం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి . పెదాలను ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. రోజంతా తేమగా..మాయిశ్చరైజింగ్ గా ఉన్నప్పుడు, పెదాలు చూడటానికి అందంగా మరియు గ్రేట్ గా కనబడుతాయి . ఇతర కాస్మోటిక్ లిప్ బామ్స్ కంటే గ్లిజరిన్ ఉత్తమమైనది ఇది పెదాలకు తగిన మాయిశ్చరైజర్ ను అందివ్వడంతో పాటు, తేమగా ఉంచుతుంది.

పెదాల మీద పొట్టుగా రాలడం మరియు బ్లీడింగ్ ను నివారిస్తుంది :

పెదాల మీద పొట్టుగా రాలడం మరియు బ్లీడింగ్ ను నివారిస్తుంది :

డ్రై లిప్స్ కు ఒక కామన్ సమస్య పెదాల పగుళ్ళు, పెదాల మీద తడి ఆరిపోయి, పొట్టుపొట్టుగా రాలిపోవడం, మరియు రక్తం కారడం జరగుతుంది . చాలా సందర్భాల్లో, పరిస్థితి చాలా బ్యాడ్ గా ఉంటుంది . ఈ సమస్యలను గ్లిజరిన్ అద్భుతంగా ఎదుర్కొంటుంటుంది.

ఏజింగ్ సైన్స్ ను డిలే చేస్తుంది:

ఏజింగ్ సైన్స్ ను డిలే చేస్తుంది:

ఫేషియల్ స్కిన్ లో లాగే పెదాల మీద కూడా ఏజింగ్ లక్షణాలు నిధానంగా కనబడుతాయి . ఫైన్ లైన్స్ మరియు కాంతిని కోల్పోవడం వల్ల పెదాల చుట్టూ ఉన్న చర్మం అందవిహీనంగా కనబడుతుంది. ఈ లక్షణాలు గ్లిజరిన్ నివారించి, పెదాలను స్మూత్ గా మరియు సపెల్ గా మార్చుతుంది,.

పెదాల ఇరిటేషన్ తగ్గిస్తుంది:

పెదాల ఇరిటేషన్ తగ్గిస్తుంది:

పెదాల బాగా డ్రైగా మారినప్పుడు, ఇరిటేషన్ కు గురి అవుతుంది. ఈ సమస్యను గ్లిజరిన్ తో నివారించుకోవచ్చు . ఈ సమస్యను నివారించుకోవడానికి గ్లిజరిన్ బెస్ట్ నేచురల్ హోం రెమెడీ.

మౌత్ అల్సర్ మరియు సోర్ ను తగ్గిస్తుంది:

మౌత్ అల్సర్ మరియు సోర్ ను తగ్గిస్తుంది:

మౌల్ అల్సర్ మరియు కోల్డ్ సోర్స్ సమస్యలను నివారించడంలో మెడికేటెడ్ ఆయిట్మెంట్ ను ఉపయోగిస్తుంటాము . వీటికి ప్రత్యామ్నాయంగా గ్లిజరిన్ అద్భుతంగా పనిచేస్తుంది . దీన్ని ఉపయోగించడం వల్ల మౌత్ అల్సర్ గ్రేట్ గా నివారించబడుతుంది .

పెదాల మీద స్కిన్ పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది.

పెదాల మీద స్కిన్ పిగ్మెంటేషన్ ను తగ్గిస్తుంది.

ఎండ, మేకప్, మరియు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల పెదాలు త్వరగా పిగ్మెంటేషన్ కు గురి అవుతాయి . కారణం ఏదైనా, వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే గ్లిజరిన్ అద్భుతంగా పనిచేస్తుంది. దాంతో పెదాలు హెల్తీగా కనబడుతాయి.

డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది:

డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది:

డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో గ్లిజరిన్ అద్భుతంగా పనిచేస్తుంది . గ్లిజరిన్ ను ప్రతి రోజూ రాత్రి నిద్రించే ముందు పెదాలకు అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది . డెడ్ స్కిన్ తొలగించనప్పుడు, ఆ స్థానంలో కొత్త చర్మం రూపొందుంతుంది . దాంతో పెదాలు అందంగా, గ్రేట్ గా కనబడుతాయి.

 లిప్స్ హెల్తీగా :

లిప్స్ హెల్తీగా :

హెల్తీ లిప్స్ పొందాలంటే గ్లిజరిన్ బెస్ట్ . ఇందులో ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాలు, సాప్ట్ స్కిన్ లక్షణాల వల్ల పెదాల డ్రై నెస్ నివారిస్తుంది. మరియు వివిధ రకాల సమస్యలను నివారించడంతో పాటు పెదాలను హెల్తీగా ఉంచుతుంది .

English summary

10 Amazing Benefits Of Using Glycerin On Your Lips

Do you want soft, pink lips? Nothing works better than glycerin. Forget about buying expensive lip balms from all those different brands that advertise how great their products are. As you know, glycerin works wonders for your skin, especially as a moisturizer for dry skin.
Story first published: Wednesday, February 3, 2016, 11:49 [IST]
Desktop Bottom Promotion