For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చర్మంపై ముడతలు రావడానికి కారణమయ్యే బ్యాడ్ హ్యాబిట్స్..!

చాలామందిలో ముడతలు రావడానికి వాళ్లకున్న బ్యాడ్ హ్యాబిట్సే కారణమవుతున్నాయి. ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల ముడతలు లేని యంగ్ లుకింగ్ స్కిన్ పొందవచ్చో చూద్దాం..

By Swathi
|

వయసు పెరిగిందని తెలిపే లక్షణాల్లో చర్మంపై ముడతలు ఒకటి. మీ వయసు పెరుగుతోందని తెలపుతూ.. ఇవి చర్మంపై కనిపిస్తాయి. అయితే చాలామందికి చిన్న వయసులోనే ముడతలు ఇబ్బందిపెడుతున్నాయి. అలాగే ఎంత డబ్బైనా ఖర్చుపెట్టి వాటిని తొలగించుకునే ప్రయత్నం చేసేవాళ్లు ఎక్కువగా ఉన్నారు.

10 Bad Beauty Habits that are Giving You Wrinkles

ముడతలు అంటే.. చర్మం మడత పడటం, చివర్లలో ఎక్కువ ముడతలు కనిపించడం, ఎక్కువగా ఎండ తగిలే భాగాల్లో ముడతలు కనిపిస్తాయి. ముఖం, మెడ, చేతులలలో ముడతలు త్వరగా, ఎక్కువగా కనిపిస్తాయి. ముడతలు రావడానికి సూర్యరశ్మి ప్రధాన కారణం. ముఖ్యంగా ఫెయిర్ గా ఉన్నవాళ్లకి ముడతల సమస్య త్వరగా వస్తుంది.

కాలుష్యం, ఎక్కువగా స్మోకింగ్, డ్రింకింగ్, డీహైడ్రేషన్, కొన్ని మందులు, థెరపీలు కూడా చిన్నవయసులోనే ముడతలు రావడానికి కారణమవుతాయి. చాలామందిలో ముడతలు రావడానికి వాళ్లకున్న బ్యాడ్ హ్యాబిట్సే కారణమవుతున్నాయి. ఎలాంటి అలవాట్లకు దూరంగా ఉండటం వల్ల ముడతలు లేని యంగ్ లుకింగ్ స్కిన్ పొందవచ్చో చూద్దాం..

పొట్టపై పడుకోవడం

పొట్టపై పడుకోవడం

చర్మ ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. రోజుకి కనీసం 6 నుంచి 7 గంటల నిద్ర అవసరం. అలాగే మీరు నిద్రపోయే విధానం కూడా చాలా ముఖ్యం. పొట్టపై పడుకోవడం లేదా ఒకవైపు తిరిగి పడుకోవడం వల్ల కూడా ముడతలు వస్తాయి. ఎంత సాఫ్ట్ గా మీ దిండు ఉన్నా.. కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబర్స్ పై అది ఒత్తిడి పెంచుతుంది. దీనివల్ల గడ్డం, బుగ్గలు, నుదురుపై ముడతలు ఏర్పడతాయి.

వెంటవెంటనే ముఖంలో ఎక్స్ ప్రెషన్స్

వెంటవెంటనే ముఖంలో ఎక్స్ ప్రెషన్స్

ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ కమ్యునికేషన్ పవర్ ని పెంచుతాయి. కానీ చాలా తరచుగా ఎక్స్ ప్రెషన్స్ పెట్టడం వల్ల చిన్నవయసులోనే ముడతలు, ఫైన్ లైన్స్ వస్తాయి. అవసరం లేకపోయినా ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ పెడితే ముఖంలోని కండరాలు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల ఫ్లెక్సిబిలిటీ కోల్పోయి ముడతలు ఏర్పడతాయి.

ఆల్కహాల్

ఆల్కహాల్

చాలా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల.. చర్మానికి హాని చేస్తుంది. అలాగే ఏజింగ్ ప్రాసెస్ ని వేగవంతం చేస్తుంది. చర్మంలో కొల్లాజెస్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం త్వరగా ముడతలు ఏర్పడతాయి. అలాగే శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.

స్మోకింగ్

స్మోకింగ్

స్మోకింగ్ వల్ల క్యాన్సర్, గుండె వ్యాధులు, ఇన్ఫెర్టిలిటీ, హైబ్లడ్ ప్రెజర్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే త్వరగా వయసు ఛాయలు కనిపించడానికి కారణమవుతుంది. రెగ్యులర్ గా స్మోక్ చేయడం వల్ల సోరియాసిస్, సాగుతున్న స్కిన్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

సన్ స్క్రీన్

సన్ స్క్రీన్

హానికారక యూవీ కిరణాలకు ఎక్కువగా చర్మం ఎక్స్ పోజ్ అయితే.. త్వరగా వయసు పెరిగిన చాయలు కనిపిస్తాయి. అలాగే స్కిన్ క్యాన్సర్ రిస్క్ ని పెంచుతాయి. ముడతలు అరికట్టడానికి బయటకు వెళ్లేముందు సన్ స్క్రీన్ లేకుండా వెళ్లకూడదు.

మేకప్ తో పడుకోవడం

మేకప్ తో పడుకోవడం

చాలా అలసిపోయిన తర్వాత మహిళలు ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అని ఫీలవుతుంటారు. దీంతో మేకప్ తొలగించకుండానే నిద్రపోతారు. అయితే ఇలా నిద్రపోతే చర్మం డ్యామేజ్ అవుతుంది. త్వరగా ముడతలు ఏర్పడతాయి. నిద్రకు ముందు కనీసం 10 నిమిషాలైనా చర్మానికి సమయం కేటాయించాలి. మైల్డ్ షాంపూతో మేకప్ తొలగించి, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.

ఎక్స్ ఫోలియేటింగ్ ఎక్కువగా చేయడం

ఎక్స్ ఫోలియేటింగ్ ఎక్కువగా చేయడం

ఎక్స్ ఫోలియేటింగ్ వల్ల దుమ్ము, ధూళి, అదనపు ఆయిల్, డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. రెగ్యులర్ గా ఎక్స్ ఫోలియేట్ చేస్తే.. చర్మానికి యంగ్ లుక్ ని ఇస్తుంది. కానీ చాలా ఎక్కువగా ఎక్స్ ఫోలియేట్ చేస్తే చర్మం న్యాచురల్ ఆయిల్స్ ని కోల్పోయి, స్కిన్ ఇరిటేషన్స్ కి కారణమవుతుంది.

ఎక్కువసేపు వేడినీటి స్నానాలు

ఎక్కువసేపు వేడినీటి స్నానాలు

రోజంతా అలసిపోయిన తర్వాత వేడినీటి స్నానంతో రిలాక్స్ అవ్వాలనుకుంటారు. కానీ.. ఇది చర్మానికి సమస్యలు తీసుకొస్తుంది. ముడతలకు కారణమవుతుంది. న్యాచురల్ ప్రొటెక్షన్ కోల్పోతే.. చర్మం ప్రీమెచ్యూర్ ఏజింగ్ కి గురయ్యే అవకాశం ఉంటుంది.

కళ్లను నిర్లక్ష్యం చేయడం

కళ్లను నిర్లక్ష్యం చేయడం

కళ్ల చుట్టూ ముడతలను నిర్లక్ష్యం చేయకూడదు. కళ్ల చుట్టూ చర్మం పలుచగా ఉంటుంది. కాబట్టి.. యూవీ కిరణాలకు ఎక్కువ ఎక్స్ పోజ్ అయితే.. డ్యామేజ్ అవుతుంది. ఇరిటేషన్ కి కారణమవుతుంది. ఈ ముడతలు నివారించడానికి చేతివేళ్లతో రబ్ చేయాలి. ఐ క్రీమ్ం ని ఉపయోగించి.. ఎప్పుడూ మాయిశ్చరైజర్ ఉండేలా జాగ్రత్తపడాలి.

English summary

10 Bad Beauty Habits that are Giving You Wrinkles

10 Bad Beauty Habits that are Giving You Wrinkles. Avoiding these bad habits can help keep your skin looking younger for years to come.
Story first published: Friday, December 2, 2016, 14:51 [IST]
Desktop Bottom Promotion