For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేస్ క్లీన్ గా..ఫ్రెష్ గా.. యంగ్ లుక్ తో కనబడాలంటే 10 సింపుల్ ఫేషియల్స్..!

|

ఫేషియల్ మాస్క్ వేసుకోవడం వల్ల ముఖం శుభ్రపడతుంది, అదే సయంలో చర్మ ఫ్రెష్ గా యంగర్ లుక్ సొంతం చేసుకుంటుంది. ముఖంలో ముడతలు తొలగిపోయి, కొత్తచర్మంతో మంచి గ్లో వస్తుంది. ముఖానికి వేసుకునే ఫేషియల్స్ చర్మానికి లోతుగా శుభ్రం చేస్తుంది, చర్మ రంద్రాలను సైజ్ ను తగ్గిస్తుంది లేదా ష్రింక్ చేస్తుంది.

ఆయిల్ స్కిన్ నివారించుకోవడానికి మన వంటగదిలోనే అమేజింగ్ హోం రెమెడీస్ ఉన్నాయి.వాటిని ఈ రోజు మీకు పరిచయం చేస్తున్నాము . ఇవి ఖచ్చితంగా ఆయిల్ స్కిన్ కు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. ఇవి ఫేషియల్ మజిల్స్ ను రిలాక్స్ చేస్తాయి, మొటిమలు, మచ్చలను నివారిస్తాయి. ఫేషియల్ మసాజ్ వాల్ల ముఖంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది, స్పాట్స్ మరియు స్కార్స్ తొలగిస్తుంది. ప్రీమెచ్యుర్ ఏజింగ్ స్కిన్ నివారిస్తుంది.

ముఖం జిడ్డుగా ఉండటం వల్ల మొటిమలు , మచ్చలు ఏర్పడుటకు కారణమవుతుంది. ముఖ్యంగా ఆయిల్ స్కిన్ కు ఫేషియల్స్ చేయడమంటే కాస్త కష్టమే. ముఖంలో ఉండే ఎక్స్ ట్రా ఆయిల్స్ ముఖాన్ని మరింత పాడు చేస్తుంది. మరైతే ఆయిల్ స్కిన్ ఉన్న వారు ఫేషియల్స్ ను ఎలా చేసుకోవాలి? అందుకే కొన్ని ఎఫెక్టివ్ ఫేషియల్ టిప్స్ మీకోసం ఈ క్రింది విధంగా అందిస్తున్నాము.. ఆయిల్ స్కిన్ ఉన్న వారు ఫేషియల్ చేసుకోవడానికి ముందు కొన్ని స్కిన్ కేర్ టిప్స్ ఈ క్రింది విధంగా...

1. క్లారిఫైయింగ్ ఫేషియల్ మాస్క్:

1. క్లారిఫైయింగ్ ఫేషియల్ మాస్క్:

క్లే ఫేషియల్ మాస్క్ . ఆయిల్ స్కిన్ ఉన్నవారికి క్లే ఫేషియల్ మాస్క్ చాలా బెటర్ గా ఉపయోగపడుతుంది. ఆయిల్ స్కిన్ ఉన్న వారిలో అదనపు స్కిన్ ఆయిల్ ను క్లే(మట్టి) గ్రహిస్తుంది. దాంతో ముఖం ఫ్రెష్ గా..ఆయిల్ ఫ్రీగా ఉంటుంది. ఈ ఫేస్ మాస్క్ ను ముల్తాని మట్టి, నిమ్మరసం, పెరుగు మరియు టమోటో జ్యూస్ తో తయారుచేసుకోవచ్చు.ఈ పదార్థాల మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసి 15 నిముషాల తర్వాత ముఖాన్ని వాష్ చేసుకోవాలి.

2. క్లెన్సింగ్ :

2. క్లెన్సింగ్ :

ఆయిల్ స్కిన్ ఉన్న వారు మొదట ముఖాన్ని శుభ్రంగా కడగాలి. అది కూడా పాలు మరియు తేనె క్లెన్సర్ అయితే మరింత బెటర్. ఇది ముఖంలో ఎక్సెస్ ఆయిల్ , మరియు మురికిని తొలగిస్తుంది. ఓట్స్ మరియు పెరుగు కాంబినేషన్ ప్యాక్ ముఖాన్ని శుభ్రం చేస్తుంది. ఆయిల్ స్కిన్ వారికి ఇది బెస్ట్ కాంబినేషన్ టిప్స్ .

3. స్టీమింగ్:

3. స్టీమింగ్:

ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఫేషియల్ కు ముందు ఖచ్చితంగా చేయాల్సింది స్టీమింగ్ . స్టీమింగ్ వల్ల చర్మ రంద్రాలు తెరచుకుంటాయి.ఎక్సెస్ ఆయిల్ , డర్ట్ మరియు ఇంప్యూరిటీస్ ను తొలగిస్తుంది. ఆయిల్ స్కిన్ ఉన్నవారు ఫేషియల్ చేసుకునే ప్రతి సారి ముందుగా స్టీమింగ్ చేయడం మంచిది. అలాగే చర్మానికి పోషణ అందివ్వాలి, అప్పుడే చర్మం గ్లోతో హెల్తీగా కనబడుతుంది. 10 నిముషాలు స్టీమ్ చేస్తా చాలు మంచి ఫలితం ఉంటుంది.

4. మాయిశ్చరైజింగ్ :

4. మాయిశ్చరైజింగ్ :

మాయిశ్చరైజర్స్ చర్మాన్ని మరింత జిడ్డుగా మార్చుతుందని నమ్మకండి. మాయిశ్చరైజింగ్ ఆయిల్ స్కిన్ నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. మాయిశ్చరైజర్స్ లో ఆల్కహాల్ ఉండటం వల్ల మాయిశ్చరైజర్స్ అప్లై చేయడంవల్ల ఎక్సెస్ ఆయిల్స్ ను గ్రహిస్తుంది. క్లెన్సింగ్ తర్వాత తప్పనిసరిగా మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.

5. టోనింగ్ :

5. టోనింగ్ :

టోనింగ్ వల్ల చర్మంలో మురికి తొలగిపోతుంది. చర్మంలో పిహెచ్ లెవల్స్ పెరుగుతాయి. దాంతో ఎక్సెస్ ఆయిల్ డర్టీ , ఇంప్యూరిటీస్ తొలగిపోతాయి, మీ ముఖానికి మాయిశ్చరైజింగ్ చేయడానికి ముందు టోనింగ్ అప్లై చేయడం మంచిది.ఇది చర్మ రంద్రాలను టైట్ చేసి, చర్మ రంద్రాల సైజ్ తగ్గిస్తుంది. రోజ్ వాటర్ ను నేచురల్ టోనర్ గా ఉపయోగించాలి.

6. స్క్రబ్బింగ్ మరియు ఎక్స్ ఫ్లోయేటింగ్:

6. స్క్రబ్బింగ్ మరియు ఎక్స్ ఫ్లోయేటింగ్:

స్క్రబ్బింగ్ మరియు ఎక్స్ ఫ్లోయేటింగ్ వల్ల మూసుకుపోయిన చర్మరంద్రాలు తెరచుకునేలా చేసి శుభ్రం చేస్తుంది. డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. పంచదార మరియు తెనె మిక్స్ చేసి హోం మేడ్ ఫేషియల్ స్ర్కబ్ ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.దీన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి.

7. ఎసెన్షియల్ ఆయిల్స్:

7. ఎసెన్షియల్ ఆయిల్స్:

ల్యావెండర్ ఆయిల్ లేదా ఇతర ఆరోమ్యాటిక్ ఆయిల్స్ ను అప్లై చేయాలి. ఆయిల్ చర్మంలో ఈ నేచురల్ ఆయిల్స్ ను డిజాల్వ్ అయ్యి, ఎక్సెస్ ఆయిల్ ను తొలగిస్తుంది. . ఆయిల్ స్కిన్ వారికి ఇది ఒక బెస్ట్ నేచురల్ స్కిన్ కేర్ టిప్.

8. అలోవెర జెల్ :

8. అలోవెర జెల్ :

ఫేషియల్ కు ముందు అలోవెర జెల్ ను అప్లై చేయాలి. ఇందులో ఆస్ట్రింజెంట్ ప్రొపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. ఇది చర్మాన్ని డ్రై చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ ను నాశనం చేస్తుంది. ఎక్సెస్ ఆయిల్ ను తొలగించి చర్మం జిడ్డుగా లేకుండా చేస్తుంది. ః

9. శెనగపిండి పెరుగు:

9. శెనగపిండి పెరుగు:

ఈ రెండింటిని మిక్స్ చేసి, పేస్ట్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖంలో ఎక్సెస్ ఆయిల్ తొలగిపోతుంది. స్కిన్ హెల్తీగా...గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.

10. ఫేషియల్ సెలక్షన్:

10. ఫేషియల్ సెలక్షన్:

కొన్ని రకాల ఫేషియల్స్ డ్రై స్కిన్ కోసం మాత్రమే తయారుచేస్తారు. కాబట్టి, ఫేషియల్స్ కొనే ముందు లేబుల్స్ చూసి ఎంపిక చేసుకోవాలి. లేదా ఫ్రూట్స్ , తేనె మరియు నిమ్మరసంతో ఇంట్లోని నేచురల్ పదార్థాలో స్వంతంగా ఫేషియల్స్ తయారుచేసుకోవడం మరింత ఉత్తమం.

English summary

10 Tips For Facials On Oils Skin

A facial makes your face clean, fresh, younger looking, free from wrinkles and glowing. Facial cleanses your skin deeply and also reduces pore size.
Story first published:Tuesday, August 9, 2016, 14:30 [IST]
Desktop Bottom Promotion