For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిర్యాని ఆకులో దాగున్న అమేజింగ్ బ్యూటి సీక్రెట్స్..!!

By Swathi
|

బిర్యాని ఆకు అంటే తెలియని వారుండరు. ఆహారంలో.. ఇది.. మంచి ఫ్లేవర్ ని తీసుకొస్తుంది. బిర్యాని ఆకు గురించి జరిగిన కొన్ని అధ్యయనాలు.. అందులో దాగున్న సర్ ప్రైజింగ్ బ్యూటి బెన్ఫిట్స్ ని.. వివరిస్తోంది.

నమ్ముతారో లేదో కానీ.. ఇందులో ఉండే చాలా ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు, చర్మానికి అనేక ప్రయోజనాలు తీసుకొస్తాయి. ఆయిలీ స్కిన్ నివారించడంలో.. బిర్యాని ఆకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

bay leaves beauty benefits

మొటిమలు తగ్గించడమే కాకుండా.. ఫేషియల్ స్కిన్ తాజాగా మారుస్తుంది. అలాగే.. చుండ్రు నివారించి.. పేలును శాశ్వతంగా తొలగిస్తుంది. అంతేనా.. బిర్యానీ ఆకుల్లో ఎన్నో బ్యూటి బెన్ఫిట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం..

ఆయిలీ స్కిన్

ఆయిలీ స్కిన్

ఒక కప్పు నీటిలో 5 బిర్యానీ ఆకులు వేసి మరిగించాలి. వడకట్టి.. రూం టెంపరేటర్ లో చల్లారనివ్వాలి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ ముల్తానీమట్టి కలపాలి. మెత్తటి పేస్ట్ అయిన తర్వాత ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. అద్భుత ఫలితాలు పొందుతారు.

ఫ్రెష్ లుక్

ఫ్రెష్ లుక్

5 బిర్యాని ఆకులను 2కప్పుల నీటిలో మరిగించాలి. బాగా మరిగిన తర్వాత మంట తగ్గించి.. 5 నిమిషాలు మళ్లీ ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి.. మరో గిన్నెలో పోసుకోవాలి. టవల్ ఉపయోగించి.. 5నిమిషాల పాటు ఆవిరి పట్టుకోవాలి. వెంటనే మీ చర్మం రిలాక్స్ అవడమే కాకుండా.. ఫ్రెష్ గా కనిపిస్తుంది.

స్కాల్ప్ క్లెన్స్

స్కాల్ప్ క్లెన్స్

5 బిర్యాని ఆకులను 2 కప్పుల వేడి నీటిలో కలపాలి. షాంపూ చేసుకున్న తర్వాత.. ఈ నీటితో జుట్టుని శుభ్రపరుచుకోవాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. డ్రై హెయిర్ నివారిస్తుంది.

చుండ్రు నివారించడానికి

చుండ్రు నివారించడానికి

3 బిర్యాని ఆకులను పొడి చేసుకోవాలి. అరకప్పు కొబ్బరినూనెలో కలిపి..సన్నని మంటపై 5నిమిషాలు వేడిచేయాలి. ఈ ఆయిల్ తో.. స్కాల్ప్ కి మసాజ్ చేయాలి. గంట తర్వాత.. షాంపూ, కండిషనర్ చేసుకోవాలి. ఈ న్యాచురల్ రెమిడీని.. వారానికి ఒకసారి ఉపయోగిస్తే.. చుండ్రు తేలికగా తొలగిపోతుంది.

స్కిన్ టోనర్

స్కిన్ టోనర్

4 బిర్యానీ ఆకులను ఒక కప్పు నీటిలో ఉడికించాలి. తర్వాత వడకట్టి.. రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ లో కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రేబాటిల్ లో చేర్చుకుని.. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. దీన్ని ముఖంపై రోజుకి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.

పేలు నివారించడానికి

పేలు నివారించడానికి

తీవ్రంగా ఇబ్బందిపెట్టే పేలు నివారించడానికి 2 టేబుల్ స్పూన్ల బిర్యాని ఆకు పొడిని ఒక కప్పు నీటిలో మరిగించాలి. వడకట్టిన తర్వాత.. కాటన్ బాల్ ఉపయోగించి.. స్కాల్ప్ అంతా పట్టించాలి. గంట తర్వాత.. షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

English summary

6 Surprising Uses Of Tej Patta In Your Skin & Hair Care

6 Surprising Uses Of Tej Patta In Your Skin & Hair Care. Tej patta, also popularly known as bay leaves, does more than add a tinge of flavour and aroma to your food.
Story first published: Monday, October 10, 2016, 12:49 [IST]
Desktop Bottom Promotion