For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓట్ మీల్ స్క్రబ్స్ తో చర్మంలో మలినాలను మాయం చేయొచ్చు...

ఓట్ మీల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, ఇది కొల్లాజెన్ ఫైబర్ ను క్రమబాద్దం చేస్తుంది . అలాగే చర్మంను తేమగా మరియు స్మూత్ గా మార్చుతుంది. ఓట్ మీల్ లో ఉండే సపోనిన్ క్లెన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంద

|

ముఖంలో క్లీన్ గా ఉంచుకోడానికి రోజుకు రెండు మూడు సార్లు శుభ్రం చేసుకుంటున్నార? ముఖంలో మురికి, మలినాలను తొలగించుకోవడానికి ముఖం పై చర్మం మాత్రం శుభ్రం చేసుకుంటే మరి లోపలి స్కిన్ లేయర్స్ సంగతేంటి? ముఖం కడుక్కోవడం వల్ల చర్మంపైన ఉన్న మలినాలు, మురికి మాత్రమే పోతుంది మరియు ఎక్కువ సార్లు ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల జిడ్డుగా మారుతుంది.

చర్మం రంద్రాల్ోల చేరిన మురికిని తొలగించడం మరింత ముఖ్యం. చర్మం రంద్రాల్లోకి చొచ్చుకుని పోయి, లోపలి స్కిన్ లేయర్స్ ను కూడా శుభ్రచేయడానికి స్క్రబ్బింగ్ బాగా సహాయపడుతుంది.స్క్రబ్బింగ్ కోసం ఉపయోగించే హానికరమైన పదార్థాలు చర్మంను మరింత డ్రైగా , రఫ్ గా గాయపరుస్తుంది. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా ఓట్ మీల్ స్ర్కబ్ ను ఉపయోగించుకోవచ్చు.

7 Cleansing Oatmeal Scrub Recipes To Remove Skin Impurities!

ముఖంలో మొటిమలు, డ్రైస్కిన సమస్యలున్నా ఓట్ మీల్ స్క్రబ్ ఎలాంటి హాని కలిగించకుండా చర్మంలో మలినాలను తొలగిస్తుంది. ఓట్ మీల్ ను యూనివర్సల్ బ్యూటీ ప్రొడక్ట్ అని కూడా పిలుస్తారుచ . ఎందుకంటే ఇది అన్ని చర్మ తత్వాలకు సహాయపడుతుంది. మరి ఓ వోట్ మీల్ స్ర్కబ్ ఏం చేస్తుందో ఒకసారి తెలుసుకుందాం..

ఓట్ మీల్ లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇది డెడ్ స్కిన్ లేయర్స్ ను, మూసుకుపోయిన చర్మ రంద్రాలను, బ్యాక్టీరియాకు కారణమయ్యే ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. అలాగే పొడి చర్మంను, చర్మంలో దురదను తొలగిస్తుంది.

ఓట్ మీల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, ఇది కొల్లాజెన్ ఫైబర్ ను క్రమబాద్దం చేస్తుంది . అలాగే చర్మంను తేమగా మరియు స్మూత్ గా మార్చుతుంది. ఓట్ మీల్ లో ఉండే సపోనిన్ క్లెన్సింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మంలో మలినాలను తొలగిస్తుంది, చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. దాంతో చర్మం ప్రకాశవంతంగా కనబడుతుంది. ఇక ఓట్ మీల్ లో దాగున్న స్కిన్ బెనిఫీట్ సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం...

ఆపిల్ జ్యూస్, రోజ్ వాటర్ వాట్ మీల్ :

ఆపిల్ జ్యూస్, రోజ్ వాటర్ వాట్ మీల్ :

ఈ మూడింటి కాంబినేషన్ స్ర్కబ్ లో చర్మంను క్లీన్ చేస్తుంది, స్కిన్ టోన్ బ్రైట్ గా మార్చుతుంది, అందుకు రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్లో ఆపిల్ జ్యూస్, రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. తేనె కూడా మిక్స్ చేయవచ్చు. మొత్తం పదార్థాలు బాగా కలిసే వరకూ మిక్స్ చేయాలి. పేస్ట్ లా తయారైన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. తర్వాత సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. 15 నిముషాల చేసిన తర్వాత ముఖం మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్ మీల్, తేనె, పెరుగు:

ఓట్ మీల్, తేనె, పెరుగు:

ఓట్ మీల్ మాస్క్ చర్మంలో మలినాలను తొలగిస్తుంది, అన్ని సీజన్లో ఇది బెస్ట్ గా పనిచేస్తుంది. ఆయిల్ స్కిన్ నివారిస్తుంది:

ఒక కప్పు ఓట్ మీల్ పౌడర్ లో ఒక టేబుల్ స్పూన్ తేనె , పెరుగు మిక్స్ చేయాలి. పేస్ట్ అయిన తర్వాత బాడీ మొత్తం ఆవిరి పట్టాలి. తర్వాత బాడి మెత్తం ఈ పేస్ట్ అప్లై చేసి, మసాజ్ చేయాలి. అంతే అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

అరటి, ఓట్ మీల్, మిల్క్ :

అరటి, ఓట్ మీల్, మిల్క్ :

అరటిపండ్లలో ఉండే హై పొటాషియం కంటెంట్ స్ర్కబ్బింగ్ మచ్చలను తొలగిస్తుంది, చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. సగం అరటిపండు తీసుకిని మెత్తగా గుజ్జు చేయాలి. అందులో ఓట్ మీల్, పాలు మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. పేస్ట్ లా మారిన తర్వాత బాడి మొత్తం అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత బాడీ మొత్తం స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. తర్వాత కొద్దిగా నీళ్ళు చిలకరించి స్ర్కబ్ చేయాలి. 15 నిముషాలు స్ర్కబ్ చేసిన తర్వాత స్నానం చేయాలి.

కాఫీ, ఓట్ మీల్, ఆలివ్ ఆయిల్ :

కాఫీ, ఓట్ మీల్, ఆలివ్ ఆయిల్ :

టానిన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ స్ర్కబ్ డెడ్ స్కిన్ ను తొలగిస్తుంది. స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తుంది. 2 టేబుల్ స్పూన్ల వోట్స్ పౌడర్ లో ఒక టీస్పూన్ కాఫీ పౌడర్ మిక్స్, 3 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. దీన్ని బాడీ మొత్తం అప్లై చేసి, 15 నిముషాలు స్క్రబ్ చేయాలి. ఆ 15 నిముషాల తర్వాత స్నానం చేసి బాడీ లోషన్ అప్లైై చేసుకోవాలి.

ఓట్స్, చమోమెలీ టీ, గ్రేప్ సీడ్ ఆయిల్ :

ఓట్స్, చమోమెలీ టీ, గ్రేప్ సీడ్ ఆయిల్ :

ఈ క్లెన్సింగ్ ఓట్ స్ర్కబ్ చర్మంలో అద్భతమైన గ్లోను తీసుకొస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల్ల ఓట్స్ పౌడర్లో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనూనె, 10 చుక్కల గ్రేప్ సీడ్ ఆయిల్ ను , రెండు చమోమెలీ టీ బ్యాగ్స్ పౌడర్ ను వేసి పేస్ట్ చేయాలి. దీన్ని బాడీ మొత్తం అప్లై చేయాలిజ 16 నిముషాల తర్వాత స్ర్కబ్ చేసి, ఆ తర్వాత స్నానం చేసి లోషన్ అప్లై చేయాలి.

బ్రౌన్ షుగర్, ఓట్ మీల్ :

బ్రౌన్ షుగర్, ఓట్ మీల్ :

ఈ మాస్క్ చర్మంలో మలినాలను తొలగిస్తుంది, సెల్యులైట్ ను తగ్గిస్తుంది. అరకప్పు బ్రౌన్ షుగర్, ఒక టేబుల్ స్పూన్ ఓట్ మీల్ , ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ , 10 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ మిక్స్ చేసి ముఖానికి , బాడికి అప్లై చేసి స్ర్కబ్ చేసుకోవాలి. 20 నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ పీల్ , లెమన్ ఆయిల్, ఓట్స్ :

ఆరెంజ్ పీల్ , లెమన్ ఆయిల్, ఓట్స్ :

వీటిలో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ స్ర్కబ్బింగ్ వల్ల చర్మానికి ఎనర్జీ వస్తుంది. చర్మం కాంతివంతం చేస్తుంది ఆరెంజ్ లెమన్ తొక్క ఎండిన తర్వాత పొడి చేసి,అందులో ఓట్స్ పౌడర్ మిక్స్ చేయాలి. రోజ్ వాటర్, ఆయిల్ మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. లెమన్ ఆయిల్ తో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత స్ర్కబ్ చేయాలి తర్వాత స్నానం చేసి బాడీ లోషన్ అప్లై చేయాలి.

English summary

7 Cleansing Oatmeal Scrub Recipes To Remove Skin Impurities!

7 Cleansing Oatmeal Scrub Recipes To Remove Skin Impurities!,For that super smooth, gorgeous skin, these oatmeal scrubs are what you must try!
Desktop Bottom Promotion