For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రిపూట ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన స్కిన్ కేర్ రూల్స్..!

By Swathi
|

మనందరం యూత్ ఫుల్, గ్లోయింగ్ స్కిన్ పొందాలని ఆరాటపడతాం. కనీసం వయసు చాయలు కనిపించకూడదని భావిస్తాం. కానీ.. వయసు పెరిగేకొద్దీ.. వాటిని ఆపలేం. కానీ.. కొన్ని టిప్స్, రూల్స్ ఫాలో అవడం వల్ల.. యూత్ ఫుల్ స్కిన్ పొందడం పెద్ద కష్టమేమీ కాదు.

రాత్రిపూట మన చర్మం రిపేర్ అవుతుంది. కాబట్టి రాత్రిపూట కొన్ని నియమాలు, కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల.. యూత్ ఫుల్ స్కిన్ పొందవచ్చు. 20లలో చర్మం చాలా అందంగా, పర్ఫెక్ట్ లుక్ కలిగి ఉంటుంది. అమేజింగ్ స్కిన్ పొందడానికి ఇదే సరైన సమయం.

కానీ.. అలాగే చాలా ముఖ్యంగా చర్మ సంరక్షణ కూడా ఫాలో అవ్వాలి. 20లలో ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అయితేనే.. ఆ అందం కలకాలం ఉంటుంది. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయితే.. అందమైన చర్మం మీ సొంతమవుతుంది. మరి అవేంటో చూద్దామా.. రాత్రి పూట ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన నియమాలేంటో తెలుసుకుందామా..

మేకప్ తొలగించుకోవడం

మేకప్ తొలగించుకోవడం

రాత్రిపడుకునే ముందు మేకప్ తొలగించుకోవడం కంపల్సరీ. చాలాసార్లు రాత్రి పూట బద్ధకంగా ఉంటాం. కానీ.. మేకప్ తొలగించడం చాలా ముఖ్యం. లేదంటే.. రాత్రంతా.. దుమ్ము, ధూళి చర్మంలో పేరుకుపోయి.. మొటిమలకు కారణమవుతాయి.

ముఖం శుభ్రం చేసుకోవడం

ముఖం శుభ్రం చేసుకోవడం

రోజంతా ముఖం శుభ్రం చేసుకోకపోయినా.. రాత్రిపూట ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. సున్నితమైన ఫేస్ వాష్ ఉపయోగించి ముఖం శుభ్రం చేసుకోవాలి.

టోన్

టోన్

చాలామంది టోనింగ్ ఎంత ఇంపార్టెంటో తెలియదు. టోనర్స్.. చర్మంలో పీహెచ్ బ్యాలెన్స్ చేస్తాయి. పెద్ద పెద్ద రంధ్రాలను మూసేస్తాయి. కాబట్టి.. ఇది చాలా ముఖ్యమైనది.

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్

పగటిపూట పట్టించుకునే మాయిశ్చరైజర్ కి.. రాత్రి పట్టించుకునే మాయిశ్చరైజర్ వేరుగా ఉండాలి. నైట్ క్రీం రాత్రంతా చర్మాన్ని రిపేర్ చేయాలి. కాబట్టి.. అలాంటి క్రీములు ఉపయోగించాలి.

ఐ క్రీం

ఐ క్రీం

కళ్ల కింద ఇరవైలలో క్రీం రాయడం చాలా అవసరం. కళ్లకింద చర్మం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అలాగే.. వయసు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి .. ప్రతిరోజూ రాత్రిపూట కళ్లకింద క్రీం రాసుకోవాలి.

నిద్రపోయే విధానం

నిద్రపోయే విధానం

ఎంతవీలైతే అంత ఎక్కువగా వెల్లకిలా పడుకోవాలి. బోర్లా పడుకోవడం వల్ల ముఖంపై దిండుపై పెట్టుకుంటారు. అప్పుడు ముడతలు, మొటిమలు రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కాబట్టి.. ఈ సింపుల్ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి.

హైడ్రేషన్

హైడ్రేషన్

బాటిల్ నీటిని ఎప్పుడూ మీ పక్కన పెట్టుకోండి. అలాగే.. రాత్రిపూట నీళ్లు తాగుతూ ఉండాలి. ఈ అలవాటు కాస్త కష్టమే అయినా.. ఫాలో అవడం వల్ల.. ఉదయం చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది.

English summary

7 Night-time Skin Care Rules To Follow For Youthful Skin

7 Night-time Skin Care Rules To Follow For Youthful Skin. We all want to be blessed with youthful, glowing skin, or to at least delay all the signs of ageing, till it is actually time for ageing to occur, don't we?
Story first published: Thursday, September 15, 2016, 16:44 [IST]
Desktop Bottom Promotion