For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శెనగపిండి, నిమ్మరసం, పసుపుతో ఫెయిన్ నెస్.. గోల్డెన్ స్కిన్ మీ సొంతం...

|

స్కిన్ టాన్, సన్ డ్యామేజ్, డెడ్ స్కిన్ వల్ల నల్లగా మారిన చర్మంలో వెంటనే మార్పులు తీసుకురావాలంటే కష్టం . స్కిన్ టోన్ మార్చుకోవడానికి ఉపయోగించే కొన్ని కెమికల్ బేస్డ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల చర్మం మరింత నల్లగా మారుతుంది . తర్వాత దీర్ఘకాలంలో చర్మాన్ని మరింత డ్యామేజ్ చేస్తుంది. ఫలితాన్నివ్వకపోగా, మార్కెట్లోని బ్యూటిప్రొడక్ట్స్ ఖరీదైనవి కూడా.

అందువల్ల స్కిన్ టాన్ నివారించుకోవడానికి మార్కెట్లోని ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ కొనడాని కంటే, ఇంట్లో మనకు సహజసిద్దంగా అందుబాటులో ఉండే నేచురల్ ప్రొడక్ట్స్ తో సన్ టాన్ నివారించుకోవచ్చు. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఈ నేచురల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించడంలో వల్ల చర్మంలో సన్ స్పాట్స్, డెడ్ స్కిన్ సెల్స్, పిగ్మెంటేషన్ మరియు చర్మంలో డల్ నెస్ ను నివారించుకోవచ్చు . స్కిన్ టోన్ తెల్లగా , ప్రకాశవంతంగా మార్చడానికి కూడా సహాయపడుతాయి.

అలుఅటువంటి నేచురల్ స్కిన్ ప్రొడక్ట్స్ లో శెనగపిండి, నిమ్మరసం, పసుపు ఒకటి. ఈ మూడింటి కాంబినేషన్ లో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మంలో బ్రైట్ నెస్ వస్తుంది. శెనగపిండి చర్మాన్ని ఎక్సఫ్లోయేట్ చేస్తుంది. నిమ్మరసం క్లెన్సింగ్ ఏజింట్, పసుపు చర్మ రంగును మార్చుతుంది. అంతే కాదు, ఈ ఫేస్ ప్యాక్ చర్మ సంరక్షణలో మరిన్ని ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అవేంటో తెలుసుకుందాం..

 సన్ టాన్ తగ్గిస్తుంది:

సన్ టాన్ తగ్గిస్తుంది:

నిమ్మరసం, శెనగపిండి, పసుపు అవసరమైతే పెరుగు మిక్స్ చేసి ప్యాక్ రెడీ చేసి ముఖానికి, మెడకు అప్లై చేసి డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం స్మూత్ గా మరియు రేడియంట్ గా మారుతుంది. .ఈ ప్రొసెస్ ప్రతి రోజూ అనుసరిస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

 స్కిన్ తెల్లగా మార్చుతుంది.

స్కిన్ తెల్లగా మార్చుతుంది.

చర్మంను తెల్లగా మార్చడంలో నిమ్మరసం మరియు శెనగపిండి గ్రేట్ హోం రెమెడీ. నాలు చెంచాలా శెనగపిండిలో 1 చెంచా పచ్చిపాలు, ఒక చెంచా నిమ్మరసం మిక్స్ చేసి, మెత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని ముఖానికి మెడకు అప్లై చేసి మర్దన చేయాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

చర్మంలో ఆయిల్ నెస్ తగ్గిస్తుంది:

చర్మంలో ఆయిల్ నెస్ తగ్గిస్తుంది:

ఆయిల్ మరియు జిడ్డు చర్మం ఉన్నవారు, ఈ ఫేస్ ప్యాక్ తక్షణ ఫలితాన్నిస్తుంది. శెనగపిండికి పెరుగు, పచ్చిపాలు మిక్స్ చేసి పేస్ట్ చేసి ముఖానికి మెడకు పట్టించి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

 మొటిమలను నివారిస్తుంది:

మొటిమలను నివారిస్తుంది:

శెనగపిండి ఫేస్ ప్యాక్ మొటిమలకు యాంటీ ఫేస్ ప్యాక్ గా పనిచేస్తుంది. రెండు చెంచాల శెనగపిండిలో 2 చెంచాలా గందం మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా పచ్చిపాలు, చిటికెడు పసుపు మిక్స్ చేసి పేస్ట్ చేసి ముఖం మొత్తానికి అప్లై చేయాలి. తడి ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఇన్ స్టాంట్ ఫెయిర్ నెస్ ను అందిస్తుంది:

ఇన్ స్టాంట్ ఫెయిర్ నెస్ ను అందిస్తుంది:

నాలుగు చెంచాలా శెనగపిండిలో 1 చెంచా ఆరెంజ్ పీల్ పౌడర్, అర చెంచా పసుపు మిక్స్ చేసి పేస్ట్ చేయాలి. దీన్ని ముఖం, మెడకు ప్యాక్ లా వేసుకుని 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

బాడీ స్ర్కబ్:

బాడీ స్ర్కబ్:

శెనగపిండి చర్మానికి ఎక్స్ ఫ్లోయేటర్ గానే కాదు, బాడీ స్ర్కబ్ గా కూడా పనిచేస్తుంది. మూడు చెంచాల శెనగపిండి, ఒక చెంచా ఓట్స్ పొడి, ఒక చెంచా పసుపు మిక్స్ చేసి, పచ్చిపాలతో పేస్ట్ చేసి ముఖానికి, బాడీకి ప్యాక్ లా వేసుకుని మసాజ్ చేయాలి. ఇది గ్రేట్ బాడీ స్ర్కబ్బర్ లా పనిచేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది . సెబమ్ నివారిస్తుంది. ఎపెక్టివ్ గా పనిచేస్తుంది. క్లీన్ అండ్ స్మూత్ స్కిన్ అందిస్తుంది.

మెడ, భుజాల నలుపును తగ్గిస్తుంది:

మెడ, భుజాల నలుపును తగ్గిస్తుంది:

చాలా మంది మహిళలు డార్క్ నెక్ కలిగి ఉంటారు. ఎక్సెసివ్ టానింగ్ వల్ల మెడ, భుజాల మీద చర్మం నల్లగా మారుతుంది. అందుకోసం, ఒక చెంచా శెనగపిండి, పెరుగు, పసుపు, నిమ్మరసం మిక్స్ చేసి పేస్ట్ చేసి మెడ్, భుజాలకు అప్లై చేసి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టాన్ నివారించి చర్మంలో గ్లో వస్తుంది.

English summary

DIY Lime And Chickpea Facepack For Fairness

Dead skin, pollution, high levels of stress and sun damage lead to darkening of the skin. We all wish that we could get back our natural skin tones.
Story first published: Friday, July 22, 2016, 17:21 [IST]
Desktop Bottom Promotion