For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేస్ పీల్స్ తో చర్మంలో గులాబి మెరుపులు...

|

చర్మం ప్రకాశవంతంగా మారడానికి ...ముఖవర్ఛస్సు మరింతగా ఇనుమడించడానికి ఫేషియల్స్ వేసుకోవడం సహజం. అయితే వాటితో పాటు అప్పుడప్పుడూ ఫేస్ పీల్స్ కూడా వేసుకుంటూ ఉండాలి. అప్పుడే చర్మం నిగారింపు రెట్టింపు అవుతుంది. తద్వారా అందం కూడా ఇనుమడిస్తుంది. అయితే ఫేస్ పీల్స్ అనగానే...పార్లర్ కే వెళ్లక్కర్లేదు. ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలను ఉపయోగించే అద్భుతమైన ఫేస్ పీల్స్ తయారుచేసుకుని, ముఖానికి వేసుకోవచ్చు. మరి ఆ పదార్థాలేంటి? వాటిని ఉపయోగించి ఎలాంటి పీల్స్ వేసుకోవచ్చు ఒక సారి తెలుసుకుందాం...

ఇంట్లో వేసుకునే ఫేస్ ప్యాక్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ అందుబాటులో ఉన్న పదార్థాలను మాత్రమే ఎంపిక చేసుకొని ఉపయోగించి ఫేస్ పీల్స్ కూడా వేసుకోవచ్చు. వాటిలో కొన్నింటిని మీకోసం...

స్ట్రాబెర్రీ, నల్లద్రాక్ష, తేనెతో:

స్ట్రాబెర్రీ, నల్లద్రాక్ష, తేనెతో:

ముందుగా స్ట్రాబెర్రీ, నల్లద్రాక్ష పళ్లను కొద్దికొద్దిగా తీసుకొని, రెండూ కలిపి మిక్సిలో వేసి మెత్తగా పేస్ట్ లా చేయాలి. తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా తేనె తీసుకొని, వేడిగా ఉన్న నీటిలో కాసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల అది కాస్త నీరులా మారుతుంది. ఇప్పుడు అందులో ముందుగా తయారుచేసుకున్న పండ్ల పేస్ట్ ని వేసి, కొద్దిగా పెరుగు జతచేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి ప్యాక్ లా అప్లై చేసుకుని 20 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత మొదట గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుని, వెంటనే చల్లని నీళ్లు ముఖం మీద జల్లుకోవాలి. అనంతరం పొడివస్త్రంతో ముఖం తుడుచుకుని ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల చర్మం పైపొరల్లో పేరుకున్న డెడ్ స్కిన్ సెల్ తొలగిపవోడంతో పాటు ముఖం ప్రకాశవంతంగా కనబడుతుంది.

పైనాపిల్, బొప్పాయితో:

పైనాపిల్, బొప్పాయితో:

అరకప్పు పైనాపిల్ ముక్కలు, పావు కప్పు బొప్పాయి ముక్కలు తీసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత అందులో అరచెంచా ఆర్గానిక్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లా వేసుకుని 20 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ఓసారి, చల్లని నీటితో మరోసారి ముఖాన్ని శుభ్రం చేసుకుని పొడివస్త్రంతో తుడుచుకోవాలి.

చర్మ మీద ముడుతల పోవడానికి :

చర్మ మీద ముడుతల పోవడానికి :

అరకప్పు కీరదోసగుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకుని 20 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉన్న కీరోదోస పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించడంతో పాటు ముడతలు, సన్నని గీతలు వంటివి కూడా తగ్గుముఖం పట్టేలా చేస్తుంది.

తేమని నిలిపి ఉంచే మాస్క్:

తేమని నిలిపి ఉంచే మాస్క్:

బాగా గిలకొట్టిన కోడిగుడ్డులోని తెల్లసొనలో మెత్తగా చేసుకొన్న అవకాడోని అరచెంచా, రెండు చెంచాలా తేనె మిక్స్ చేసి బాగా కలపాలి. ఇవన్నీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 20 నిముషాల ఆరనిచ్చి తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అనంతరం చల్లని నీళ్లను ముఖం మీద చల్లుకుని పొడివస్త్రంతో తుడుచుకోవాలి. ఈ మాస్క్ చర్మంలోని తేమని అధిక సమయం నిలిపి ఉంచడానికి బాగా తోడ్పడుతుంది.

 బ్లాక్ హెడ్స్ తొలగిపోవడానికి :

బ్లాక్ హెడ్స్ తొలగిపోవడానికి :

పాలల్లో కొద్దిగా ఓట్స్ వేసి ఉడికించాలి. తర్వాత ఇందులో కాస్త పెరుగు, తేనె వేసి బాగా కలపాలి. మిశ్రమం కాస్త చల్లబడిన తర్వాత బ్లాక్ హెడ్స్ ఉన్న చోట అప్లై చేసుకుని 20 నిముషాలు ఆరనివ్వాలి. తర్వాత మైల్డ్ క్లెన్సర్ ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మంపై ఉండే బ్లాక్ హెడ్స్ సులభంగా తొలగిపోతాయి.

నియమాలు:

నియమాలు:

సున్నిత చర్మం ఉన్న వారు ఫేస్ పీల్స్ కు తయారుచేసుకొనే మాస్క్ లలో నిమ్మరసం ఉపయోగించకూడదు. దీనికి బదులు నీటినే వాడుకోవచ్చు.

నియమాలు:

నియమాలు:

మరీ పొడి చర్మ తత్వం ఉన్నవాళ్లు ఫేస్ పీల్ వేసుకుని తీసేశాక శుభ్రం చేసుకున్న వెంటనే మాయిశ్చరైజర్ ను విధిగా అప్లై చేసుకోవాలి. లేకపోతే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది.

నియమాలు:

నియమాలు:

కొత్త ప్యాక్ లేదా పదార్థాలను ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఎలాంటి దుష్ప్రభావం లేదని నిర్ధారించుకున్న తర్వాతే ముఖానికి అప్లై చేసుకోవాలి.

నియమాలు:

నియమాలు:

ఫేస్ పీల్స్ వేసుకున్నా తర్వాత ఎండలోకి వెళ్లే ముందు సన్ స్క్రీన్ లోషన్ విధిగా రాసుకోవాలి. లేదంటే ట్యాన్ సమస్య బారిన పడే అవకాశాలు లేకపోలేవు.

English summary

Homemade Face Peels for Glowing Skin

Homemade Face Peels for Glowing Skin ,Are you throwing away the peels after eating fruits?.. Fruit Peels contains numerous health and skin benefits.Peels are packed with powerful antioxidants, vitamins, dietary fiber and essential oils that fights acne and skin blemishes, boost collagen, premature ageing, lig
Story first published: Tuesday, February 9, 2016, 16:39 [IST]
Desktop Bottom Promotion