Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
రెండువారాల్లో ఫెయిర్ స్కిన్ పొందే అద్భుతమైన హోం రెమిడీ..
ఫెయిర్ అండ్ బ్రైట్ స్కిన్ పొందాలని మీరు భావిస్తుంటే.. మీకు ఈ చిట్కా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మన పూర్వీకులు ఫాలో అయి.. అద్భుతమైన ఫలితాలు పొందిన ఈ రెమిడీ.. గురించి చాలామందికి తెలియదు. కానీ ఒక్కసారి ట్రై చేస్తే.. ఫలితాలు మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి.
కొన్ని ప్రాంతాలు, కొంతమంది ఫెయిర్ స్కిన్ ఉంటే.. ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటారిన నమ్ముతారు. కాబట్టి.. చాలామంది ఫెయిర్ స్కిన్ పొందాలని ప్రయత్నిస్తారు. అయితే అందరూ.. ఫెయిర్ కాంప్లెక్షన్ తో పుట్టరు. కొన్ని టిప్స్ ఫాలో అవడం వల్ల స్కిన్ టోన్ ని మెరుగుపరుచుకోవచ్చు.

కొన్నిసార్లు ఫెయిర్ స్కిన్ ఉన్నప్పటికీ.. సరైన ఆహారం తీసుకోకపోవడం, కాలుష్యం, సన్ లైట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సరైన చర్మ సంరక్షణ జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల.. చర్మం ఫెయిర్ నెస్ ని కోల్పోతుంది.
ఫెయిర్ స్కిన్ టోన్ ని న్యాచురల్ గా పొందడానికి ఎలాంటి బ్లీచింగ్ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా.. పురాతన హోంరెమిడీ ద్వారా పొందవచ్చు. ఈ రెమిడీలో.. అన్ని న్యాచురల్ పదార్థాలనే ఉపయోగిస్తాం.

కావాల్సిన పదార్థాలు
ఉసిరికాయలు 2
బొప్పాయి 4 లేదా 5 ముక్కలు
ఫెయిర్ స్కిన్ టోన్ పొందడానికి ఈ హోంమేడ్ ప్యాక్ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది. కానీ.. రెగ్యులర్ గా కొన్ని రోజులు ఉపయోగించాలి. బొప్పాయి, ఉసిరిలో కాంప్లెక్షన్ ని మెరుగుపరిచే గుణాలు ఉండటం వల్ల రెండే రెండువారాల్లో మీరు కోరిన ఫెయిర్ నెస్ పొందవచ్చు.

ఉసిరిలో విటమిన్ సి ఉండటం వల్ల న్యాచురల్ స్కిన్ బ్లీచింగ్ లా పనిచేస్తుంది. ఇది చర్మానికి న్యాచురల్ గ్లో అందిస్తుంది. దుమ్ము, ధూళిని తొలగిస్తుంది. బొప్పాయిలో ఎక్స్ ఫోలియేటింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఫెయిర్ గా, బ్రైట్ గా మారుస్తుంది.
తయారు చేసే విధానం
రెండు పదార్థాలను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి.
కొన్ని నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి.
15 నిమిషాలు ఆరనివ్వాలి.
గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications