For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చలికాలంలో వివిధ రకాల చర్మ సమస్యలను నివారించే వింటర్ ఫ్రూట్స్ ..!!

చలికాలంలో బయట నుండి మాత్రమే కాకుండా బాడీ లోపలి నుండి చర్మానికి పోషణను ఇచ్చి పొడిబారకుండా జాగ్రత్తపడాలి. దీనికి పండ్లు మనకి బాగా సహరిస్తాయి.

|

రోజురోజుకి చలి తీవ్రత ఎక్కువ అవుతోంది. సెడెన్ గా వచ్చే వాతావరణంలోని మార్పులు, చలికారణంటా చర్మం పొడిగా మారి, చర్మంలో పగుళ్ళు ఏర్పడుతాయి. ఫలితంగా చర్మంపై దురద, మంటి, ఇన్ఫ్లమేషన్, రాషెస్ వంటివి ఏర్పడటం సహజం. ఇలా జరగకుండా ఉండటానికే, చర్మానికి వివిధ రకాల మాయిశ్చరైజర్ ను అప్లై చేస్తుంటాం.

అయితే ఈ కమర్షియల్ మాయిశ్చరైజర్స్ తాత్కాలికం మాత్రమే కనిపిస్తుంది. అలాగని చర్మానికి తేమ అందించడానికి ఎక్కువ సార్లు దాన్ని అప్లై చేయడం మంచిది కాదు . అందుకే బయట నుండి మాత్రమే కాకుండా బాడీ లోపలి నుండి చర్మానికి పోషణను ఇచ్చి పొడిబారకుండా జాగ్రత్తపడాలి. దీనికి పండ్లు మనకి బాగా సహరిస్తాయి. అయితే చలికాలంలో చర్మ సంరక్షణ కోసం ఎలాటి పండ్లు తినాలో తెలుసుకుందాం..

అరటి:

అరటి:

ఈ కాలంలో చర్మం పొడిబారడానికి మరో కారణం కూడా ఉంది. వాతావరణ పరిస్థితుల కారణంగా చలికాలంలో మనం తాగే నీటి మోతాదు తక్కువగా ఉంటుంది. ఫలితంగా చర్మం తేమను కోల్పోయి పొడిగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తగినంత మొత్తంలో నీరు తాగడంతో పాటు అరటి పండుని రోజూ ఆహారంగా తీసుకోవాలి. దీనిలో ఉండే పొటాషియంతో పాటు సి, ఇ విటమిన్లు చర్మానికి తేమనందిస్తాయి. అలాగే ఈ సమయంలో నిర్జీవమైన చర్మాన్ని తిరిగి ప్రకాశవంతంగా మారుస్తాయి. అందుకే అల్పాహార సమయంలో ఒకటి లేదా రెండు అరటి పండ్లను తింటే మంచి ఫలితలుంటాయి.

ఉసిరి:

ఉసిరి:

ఉసిరి ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకించి చెప్పకోవాల్సిన అవసరం లేదు. అలాగే అందం విషయంలోనూ ఉసిరి మనకు అంతే ఉపయోగపడుతుంది. ఉసరిలో ఉండే పోషకా పదార్థాల కారణంగా కొన్ని రకాల సౌందర్య ఉత్పత్తుల తయారీలోనూ వినియోగిస్తారు. ఉసిరి ఆహారంగా తీసుకుంటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇందులోని గుణాలు రక్తాన్ని శుధ్ది చేసి మలినాలు, విషపదార్థలను బయటకు పంపిస్తాయి. అలాగే దీనిలో ఉన్న యాంటీబ్యాక్టీరియల్ గుణాలు..చర్మానికి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయి. కాబట్టి, రోజూ ఉసిరికాయలు తినడం, రసం తాగడం..ఇలా ఏదో ఒక రూపంలో ఉసిరిని ఆహారంగా తీసుకోవడం ద్వారా చలికాలంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఆరోగ్యాన్నీ సొంతం చేసుకోవచ్చు.

బొప్పాయి:

బొప్పాయి:

చలికాలంలో చర్మం ముడతలు పడినట్లుగా అనిపించడంతో పాటు కాంతి విహీనంగా మారుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే బొప్పాయిని ఆహారంగా తీసుకోవాల్సిందే. అంతే కాదు..చర్మ సంరక్షణ విషయంలో అమ్మాయిలు ఎక్కువగా బొప్పాయికే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే దీనిలో చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఎ అధికంగా లభిస్తుంది. ఇది చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అందులో ఉండే పెపైన్ చర్మంపైన పేరుకొన్న డెడ్స్ సెల్స్ ను తొలగించడంతో పాటు, యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేసి చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. అందుకే బొప్పాయితో ఫేషియల్ చేసుకోవడాని చాలా మంది మహిళలు ఆసక్తి చూపుతారు. అయితే ఇలా పై పూతగా మాత్రమే కాకుండా ఆహారంగా తీసుకోవడం ద్వారా చక్కటి చర్మ సౌందర్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవచ్చు. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా చర్మం కాంతి పెరుగుతుంది,

పైనాపిల్ :

పైనాపిల్ :

చలికాలంలో సాధారణంగా ఎదురయ్యే చర్మ సంబంధ సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. ఎందుకంటే,..ఈ సమయంలో చర్మం పొడిబారి పగిలినట్లుగా తయారవుతుంది. ఇలాంటి చోట ధూళి చేరడం వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలుంటాయి. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే పైనాపిల్ ఆహారంగా తీసుకోవాల్సిందే. ఎందుకంటే దీనిలో అధికంగా లభించే విటమిన్ సి చర్మానికి కావల్సిన పోషణను అందించి తేమను కోల్పోకుండా చేస్తుంది. అలాగే ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ రాకుండా కాపాడుతాయి.

దానిమ్మ:

దానిమ్మ:

చలికాలంలో చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు తినాల్సిన మరో పండు దానిమ్మ. ఈ సమయంలో చర్మం పొడిగా మారి మంట పుడుతుంది. కాబట్టి, దానిమ్మను ఆహారంగా తీసుకోవడం ద్వార ఈ సమస్యను నివారించుకోవచ్చు. ఇందులో ఉండే ఐరన్, ఫైటో కెమికల్స్, విటమిన్ సి , పాలీ ఫినాల్స్ తో పాటు గా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్నీ పెంపొందించేవే. ముఖ్యంగా విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఫ్రీరాడికల్స్ ని తొలగిస్తుంది. అలాగే రోజూ దానిమ్మను ఆహారంగా తీసుకోవడం ద్వారా చర్మం కోల్పోయిన తేమను తిరిగి పొందుతుంది, ఈ గుణాల వల్ల చర్మం ముడుతలు పడకుండా కాపాడుతుంది.

సీతా ఫలం:

సీతా ఫలం:

శీతాకాలంలో లభించే పండ్లలో సీతాఫలం కూడా ఒకటి. దీనిలో ఉండే విటమిన్ ఎ, సి లు పుష్కలంగా ఉండటం వల్ల విటమిన్ సి శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే పొడిగా మారిన చర్మానికి తేమనందించి సాధారణ స్థితిలోకి మారుస్తుంది. ఈ కాలంలో చర్మానికి ఏదైనా గాయమైతే తగ్గడానికి చాలా రోజులు పడుతుంది. దీనికి కారణం కొత్త కణాల ఉత్పత్తిని మందకొడిగా సాగడమే.అందుకే రోజూ సీతాఫలం తినడం లేదా జ్యూస్ తాగడం ద్వారా చర్మంలో కొత్త కణాలు ఉత్పత్తయ్యే వేగం పెరుగుగుతుంది. గాయాలు త్వరగా మానిపోతాయి.

క్యారెట్స్ :

క్యారెట్స్ :

క్యారెట్స్ లో విటమిన్ ఎ, ఇతర యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది చర్మంను హెల్తీగా..వైబ్రెంట్ గా మార్చుతుంది. వింటర్లో చర్మం కాంతివంతంగా మార్చుతుంది. ఇది ముడుతలను నివారిస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ నివారస్తుంది. చర్మంలో మంచి కాంతి తీసుకొస్తుంది. క్యారెట్ లో కెరోటినాయిడ్స్, కెరోటిన్, లేకోపిన్ వంటివి యూవీ కిరణాల నుండి చర్మ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే పొటాసియం, డ్రై స్కిన్ సమస్యను నివారిస్తుంది.

కివీ :

కివీ :

చర్మ సంరక్షణకు అవసరమైన పోషకాలన్నీ కివి ఫ్రూట్స్ లో ఎక్కువగా ఉన్నాయి. ఈ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఇ అధికంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యవతంమైన, ప్రకాశంతమూన చర్మాన్ని మనకు అందిస్తాయి. అలాగే ఈ పండులో పుష్కలంగా లభించే యాంటీఆక్సిడెంట్లు రక్తంలోని టాక్సిన్లను తొలగించి చర్మ ారోగ్యాన్ని కాపాడుతాయి. విటమిన్ ఇ చర్మానికి అవసరమైన తేమను అందించి సాప్ట్ గా మారేలా చేస్తుంది. కివి తినడం వల్ల శరీరానికి లభించే విటమిన్ సి కొలాజెన్ ఉత్పత్తిని మెరుగుపరిచి చర్మం యవ్వనంగా మెరిసేలా చేస్తుంది. అలాగే ఈ ఫ్రూట్ లో ఉండే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని సాప్ట్ గా మార్చుతాయి,.డ్రై స్కిన్ సమస్య ను నివారించుకోవచ్చు.

అవకాడో :

అవకాడో :

లోపలి నుండి చర్మాన్ని పొడిబారకుండా కాపాడే వాటిలో ముఖ్యమైనది అవకాడో..దీనిలో చర్మ సంరక్షణకు అవసరమైన ఎ, సి, ఇ విటమిన్లు చర్మానికి పోషణనిస్తాయి. అలాగే ఇందులోని మోనో శ్యాచురేటెడ్ కొవ్వులు, ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు..వంటివన్నీ చర్మం తేమను కోల్పోకుండా చేసి సాప్ట్ గా మారుస్తాయి. అలాగే ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియంలు చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. అవొకాడోలో ఉన్న పోషకాలు చర్మంపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. వాటి స్థానంలో కొత్త కణాలు ఏర్పడేలా చేస్తాయి. విటమిన్ ఇ చర్మానికి ముడతు పడకుండా చేస్తుంది.

English summary

Top 9 Super Fruits to Make Your Skin Glow This Winter

The chilly dry wind, low temperature, low humidity and indoor heating that come with winter can play havoc on your skin, lips and other parts of the body.
Story first published: Thursday, December 22, 2016, 18:35 [IST]
Desktop Bottom Promotion