For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేప, పెరుగు మిక్స్ ని ఫేస్ కి పట్టిస్తే పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!

By Swathi
|

ఖరీదైన బ్యూటి ప్రొడక్ట్స్ ట్రై చేసినా ఎలాంటి మెరుగైన ఫలితాలు లభించలేదా ? మీ పాకెట్ మాత్రం ఖాళీ అయిపోయిందా ? ఒకవేళ నిజమైతే.. న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ ని మీ డైలీ హ్యాబిట్స్ లో భాగం చేసుకోవాల్సిందే.

వేప నూనెలోని సొగసు చిట్కాలు తెలుసా ? వేప నూనెలోని సొగసు చిట్కాలు తెలుసా ?

కొంతమంది చర్మం ఎంత శుభ్రం చేసుకున్నా, ఎన్ని క్రీమ్స్ ఉపయోగించినా.. డల్ గా కనిపిస్తూ ఉంటుంది. చాలామంది ఒత్తిడితో కూడిన జాబ్స్, కాలుష్యం, చర్మ సంరక్షణకు సరైన సమయం లేకపోవడం వల్ల, డైట్ ఫాలో అవకపోవడం, చర్మ సమస్యల వల్ల.. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు.

వేప గింజల్లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు వేప గింజల్లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

న్యాచురల్ పదార్థాలైన పెరుగు, వేప వంటి ఫేస్ ప్యాక్స్ అద్భుత ఫలితాలను ఇస్తాయి. కొన్ని వేప ఆకులు తీసుకుని శుభ్రం చేసుకోవాలి. అందులో 2టేబుల్ స్పూన్ల పెరుగు మిక్స్ చేసి.. గ్రైండర్ లో పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. మరి ఈ ఫేస్ ప్యాక్ తో పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దామా..

మెరిసే చర్మం

మెరిసే చర్మం

ఈ న్యాచురల్ ఫేస్ ప్యాక్ లో విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల.. చర్మ కణాలకు పోషణ అందిస్తాయి. దీనివల్ల అవి.. హెల్తీగా మారి.. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

మొటిమల మచ్చలు

మొటిమల మచ్చలు

ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ న్యాచురల్ గానే.. ఎలాంటి గాయమైనా త్వరగా నయం అవడానికి సహాయపడుతుంది. డ్యామేజ్ అయిన టిష్యూలను మళ్లీ రీబిల్ట్ చేస్తుంది. కాబట్టి..మీరు మొటిమల తాలుకు మచ్చలతో బాధపడుతుంటే.. ఈ ప్యాక్ ని రెగ్యులర్ గా ఉపయోగించవచ్చు.

సన్ ప్రొటెక్షన్

సన్ ప్రొటెక్షన్

వేప, పెరుగు మిశ్రమం న్యాచురల్ సన్ స్క్రీన్ లా ఉపయోగపడుతుంది. సూర్య కిరణాల వల్ల చర్మానికి హాని కలుగకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.

మొటిమలు

మొటిమలు

ఈ న్యాచురల్ స్కిన్ ప్యాక్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుంటాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తగ్గిస్తాయి.

స్కిన్ టోన్

స్కిన్ టోన్

ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్.. చర్మాన్ని లైట్ గా మార్చడంలో సహాయపడతుంుది. న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది.

చిన్న చిన్న గాయాలు

చిన్న చిన్న గాయాలు

వేప, పెరుగు మిశ్రమం ఘాట్లు, తెగిన గాయాలను, కాలిన మచ్చలను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. ఇందులో ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు.. ఎలాంటి గాయాన్నైనా తేలికగా నయం చేస్తాయి.

సాఫ్ట్ స్కిన్

సాఫ్ట్ స్కిన్

పెరుగు హైడ్రేటింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. చర్మ కణాలను మాయిశ్చరైజ్ చేసే సత్తా ఉంటుంది. అందుకే ఈ ప్యాక్ ని రెగ్యులర్ ఉపయోగిస్తే. .మీ చర్మం సాఫ్ట్ గా మారుతుంది.

డార్క్ స్పాట్స్

డార్క్ స్పాట్స్

వేప, పెరుగు హోంమేడ్ ఫేస్ ప్యాక్.. డార్క్ స్పాట్స్ ని, బ్లాక్ హెడ్స్ ని చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

English summary

What Happens When You Apply Neem & Curd On Your Skin?

What Happens When You Apply Neem & Curd On Your Skin? Did you know that natural ingredients like neem and curd come with various beauty benefits that are exceptional for your skin?
Desktop Bottom Promotion