చర్మం అందంగా..ఆరోగ్యంగా ఉండటానికి ఆయుర్వేదంలో 10 సింపుల్ చిట్కాలు

Posted By: Staff
Subscribe to Boldsky

ఆయుర్వేదం అంటే న్యాచురల్ పద్దతి, ఆయుర్వేదం వల్ల ఎలాంటి హాని జరగదు. ఆయుర్వేదం ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఆయుర్వేదం గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకే ఆయుర్వేదం పురాతన కాలం నుండి బాగా ప్రాచుర్యం పొందినది. మీరు నమ్ముతారో నమ్మరో కానీ, ఆయుర్వేదానికి మించినది మరొకటి లేదంటే ఆశ్చర్యం కలగక మానదు.

ఆయుర్వేదం ప్రకారం ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో విధమైన చర్మ తత్వాన్ని, చర్మ సమస్యలను కలిగి ఉంటారు. కాబట్టి, ఆయుర్వేద చికిత్స కూడా వివిధ రకాలుగా ఉంటుంది. ఆయుర్వేదంలో మూడు దోషాలున్నాయి-కఫ, వాత మరియు పిత్త. శరీరంలో ఈ మూడు వివిధ రకాల కారణాల వల్ల అసమతుల్యంగా ఉంటాయి. ఆ కారణంగా చర్మ సమస్యలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి.

ఎలాంటి చర్మ సమస్యలకైనా ఆయుర్వేదం సమాధానం ఇస్తుంది. దీన్ని పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పండుగల సందర్భాలో దివాలి సమయంలో గాలి, వాతావరణ కాలుష్యం వల్ల చర్మ సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ స్ట్రెస్ ఫుల్ లైఫ్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకు బహిర్గితంగా చర్మ సంరక్షణ మాత్రమే కాదు, అంతర్గతంగా, శరీరం ఆరోగ్య సంరక్షణ, చర్మంలోపలి నుండి కండీషనర్ అవసరం అవుతుంది. హెల్తీ స్కిన్ కు ఆయుర్వేదం బాగా సహాయపడుతుంది.

ఆయుర్వేద పద్ధతిని అనుసరించేటప్పుడు, చర్మానికి హాని కలిగించే కెమికల్ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండాలి. చర్మ ఆరోగ్యానికి, అందానికి సహాయపడే 10 ఆయుర్వేద చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. చర్మ తత్వాన్ని బట్టి

1. చర్మ తత్వాన్ని బట్టి

శరీరంలో ఎలాంటి దోషమున్నా, చర్మ తత్వాన్ని బట్టి ఉంటుంది. ఆయుర్వేదిక నిపుణులను కలిసి మీ చర్మ తత్వానికి సరిపడే వాటిని ఉపయోగించాలి. అలాగే మీలో ఉండే దోషం ప్రకారం సరైన ఆహార నియమాలను ఎంపిక చేసుకుని తినాలి.

2. స్కిన్ హైడ్రేషన్ ముఖ్యం

2. స్కిన్ హైడ్రేషన్ ముఖ్యం

హైడ్రేషన్ లో రెండు రకాలున్నాయి-నీళ్ళ ఆధారితం, నూనె ఆధారితం. కాబట్టి, ఎక్కువ నీళ్లు తాగాలి. రోజుకు రెండు మూడు లీటర్ల నీళ్లు తాగడం వల్ల శరీరంలోపల నుండి చర్మానికి తేమ అందుతుంది. ఆయుర్వేదంలో వివిధ రకాల నూనెలున్నాయి. వీటిలో ఏది మీ చర్మ తత్వానికి నప్పుతాయో చూసి ఎంపిక చేసుకోవాలి. తర్వాత ముఖం, కాళ్ళు, చేతులకు మసాజ్ చేయాలి. కనీసం వారంలో రెండు మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

3. మంచి నిద్ర

3. మంచి నిద్ర

మనిషికి తగినంత నిద్ర చాలా అవసరం. సరైన నిద్రపొందడం చాలా అవసరం. మీ చర్మానికి కూడా విశ్రాంతి అవసరం అవుతుంది. నిద్రించే సమయంలో డ్యామేజ్ అయిన స్కిన్ టిష్యులు ఉత్తేజం అవుతాయి. కనీసం 8 గంటల నిద్ర చాలా అవసరం. అంతకంటే ఎక్కువ లేదా అంతకంటే తక్కువ ఉండకూడదు. నిద్రించే సమయం రాత్రి పది నుండి ఉదయం ఆరు వరకు. సూర్యోదయంకు ముందే నిద్రలేవడం వల్ల మెటబాలిజం షార్ప్ గా ఉంటుంది. రోజంతా కావల్సిన శక్తిని పొందుతారు.

4. యోగా చేయాలి:

4. యోగా చేయాలి:

ఆయు-యోగ యొక్క కాంబినేషనే ఆయుర్వేద మరియు యోగ. మీకున్న దోషం ప్రకారం , యోగా ఎంపిక చేసుకోవాలి. బ్రీతింగ్ ఎక్సర్ సైజ్ 5 నిముషాలు చేయాలి. రోజుకు రెండు సార్లు చేస్తే మరింత మంచిది.

5. పక్షులు తిన్నట్లు తినాలి:

5. పక్షులు తిన్నట్లు తినాలి:

నట్స్, విటమిన్ ఇ కలిగిన ఆయిల్ సీడ్స్ తినాలి. ఇవి చర్మం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతాయి. నట్స్, ఆయిల్ సీడ్స్ మీకు నచ్చినవి ఎంపిక చేసుకోవాలి. ఫ్లాక్ సీడ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్, బాదం, వాల్ నట్స్ ను ఎంపి చేసుకోవాలి. వీటిలో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ , ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి.

6. రోజూ ఒక కప్పు టీ:

6. రోజూ ఒక కప్పు టీ:

ఈ టీ రెగ్యులర్ మిల్క్ , గుప్పెడు పంచదారతో తయారుచేయకూడదు. అల్లం, తులసి, తేనె వంటి న్యాచురల్ పదార్థాలు జోడించిన వాటిని ఎంపిక చేసుకోవాలి. రోజుకు ఒక కప్పు మాత్రమే తీసుకోవాలి. దీన్ని మెడిసినల్ డ్రింక్ లా తీసుకోవాలి. ఈ టీలో అనేక యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది స్ట్రెస్ తగ్గిస్తుంది.

7. వంటింటి వస్తువులతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి

7. వంటింటి వస్తువులతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి

వంటగదిలోని పదార్థాలను మూడు సెలక్ట్ చేసుకుని, ఫేస్ ప్యాక్, ఫేస్ స్క్రబ్ వేసుకోవాలి. ఇది మాయిశ్చరైజింగ్ గుణాలు కలిగి ఉంటాయి. అంతే కాదు టోనింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.

8. ఫ్రెష్ ఫ్రూట్ప్, వెజిటేబుల్స్ తినాలి

8. ఫ్రెష్ ఫ్రూట్ప్, వెజిటేబుల్స్ తినాలి

వెజిటేబుల్స్ లో విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువ. ఈ న్యూట్రీషియన్స్ అన్నీ హెల్తీ స్కిన్ మెయింటైన్ చేయడానికి అవసరం అవుతాయి.

9. ఫ్రీక్వెంట్ గా మసాజ్ చేయాలి

9. ఫ్రీక్వెంట్ గా మసాజ్ చేయాలి

వారంలో రెండు సార్లు నిపుణులతో ఆయుర్వేదిక్ మసాజ్ చేయించుకోవాలి. కొబ్బరినూనె బెస్ట్ మసాజింగ్ ఆయిల్. ఇది మజిల్ టెన్షన్ తగ్గిస్తుంది. నారాలను ఉత్తేజపరుస్తుంది.

10. ఆప్రికాట్ మాయిశ్చరైజర్

10. ఆప్రికాట్ మాయిశ్చరైజర్

వారంలో రెండు మూడు సార్లు శరీరం మొత్తం మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. అందుకు ఆప్రికాట్ ఆయిల్, బాదం లేదా కోకనట్ ఆయిల్ సహాయపడుతుంది. శరీరంలో వాటర్ ను తగ్గిస్తుంది. రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. హెల్తీ స్కిన్ కోసం ఇది ఒక బెస్ట్ ఆయుర్వేద చిట్కా.

English summary

10 Ayurvedic Tips For Healthy Skin

Ayurveda makes use of the most natural, minimally harmful ingredients to boost the healthy state of your skin. There are major brands out there boasting about how their creams are age defying. But, trust us, there is nothing better than the ayurvedic science.
Story first published: Tuesday, May 30, 2017, 18:00 [IST]
Subscribe Newsletter