చర్మంలో ముడుతలను మాయం చేసే న్యాచురల్ రెమెడీస్

Posted By: Lekhaka
Subscribe to Boldsky

సహజంగా వయస్సు పెరిగే కొద్ది శరీరంలో ఎన్నో మార్పులు. ముఖ్యంగా ఆ మార్పులు చర్మంలో ప్రస్పుటంగా కనబడుతాయి. 30 ఏళ్ళు వయస్సు దాటిందంటే తప్పకుండా చర్మం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ వయస్సు నుండి చర్మంలో అనేక మార్పుల వస్తాయి. చర్మ పొడిబారడం, ఫైన్ లైన్స్, ముడుతలను , మరియు ఏజింగ్ లక్షణాలు బయటకు బాగా కనబడుతూ, అసలు వయస్సు కంటే ఎక్కువ వయస్సైన వారిలా కనబడేలా చేస్తుంటాయి .

ఏజింగ్ లక్షణాలకు ముఖ్య కారణం చర్మంలో ముడుతలు. ఈ ముడుతను పోగొట్టుకోవడానికి లేదా కనబడకుండా చేయడానికి మార్కెట్లోని వివిధ రకాల క్రీములను కొంటుంటారు. అయితే వీటికి బదులుగా ఇంట్లో ఉండే కొన్ని సురక్షితమైన హోం రెమెడీస్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.

యాంటి వ్రింకిల్స్ (ముడతలకు వ్యతిరేఖంగా పోరాడే ) పదార్థాలతో ఇంట్లోనే నేచురల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇవి చర్మంలోని ముడుతలను మాయం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . వీటిని చాలా సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు . మరి అవేంటో ఒకసారి తెలుసుకుందాం...

పెరుగు ప్యాక్

పెరుగు ప్యాక్

కావల్సినవి:

పెరుగు ఒక కప్పు

కొబ్బరి నూనె

ఆలివ్ ఆయిల్

ఎలా ఉపయోగించాలి:

- ఒక కప్పు పెరుగు అందులోనే కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ తీసుకుని మూడింటిని బాగా మిక్స్ చేయాలి.

- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రిఫ్రిజరేటర్లో ఉంచాలి. ఇప్పుడు దీన్ని చర్మానికి అప్లై చేయాలి.

- పెరుగు పల్చగా ఉంటుంది. కాబట్టి, చర్మ మీద జారిపోతుంది. కాబట్టి ఫ్రిజ్ లో పెడితే చిక్కబడుతుంది.దాంతో మీరు మసాజ్ చేసుకోవచ్చు.

- ముఖానికి అప్లై చేసి 15 నిముషాలు మసాజ్ చేయాలి.

- తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి.

 కొబ్బరి పాలతో ప్యాక్

కొబ్బరి పాలతో ప్యాక్

కావల్సినవి:

కోకనట్ మిల్క్ : 1 కప్పు

పసుపు పౌడర్ : ఒక చిటికెడు

పాలు : 1స్పూన్

ఎలా ఉపయోగించాలి:

- ఒక కప్పు కోకనట్ మిల్క్ ను ఒక బౌల్లో తీసుకోవాలి. దీన్ని ఇంట్లో స్వయంగా తయారుచేసుకోవచ్చు.

- ఇప్పుడు, చిటికెడు పసుపును కోకనట్ మిల్క్ తో మిక్స్ చేయాలి.

- ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి.

- ఇప్పుడు ఇందులోనే పచ్చిపాలను ఒక స్పూన్ మిక్స్ చేసుకోవాలి.

- ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లౌ చేసి కాటన్ బాల్ తో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి చేతి వేళ్లతో మసాజ్ చేయాలి. పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి

టమోటో ప్యాక్

టమోటో ప్యాక్

కావల్సినవి:

టమోటో : 1

ఆలివ్ ఆయిల్ : ఒక టీస్పూన్

మస్టర్డ్ ఆయిల్ : కొద్దిగా(అవసరమనిపిస్తే)

ఎలా ఉపయోగించాలి:

-ఒక టమోటోను తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. అందులోని జ్యూస్ తియ్యాలి.

- ఇప్పుడు , టమోటో గుజ్జుకు ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేయాలి.

- మస్టర్డ్ ఆయిల్ వల్ల ఎలాంటి అలర్జీ లేకపోతే , ఒక టీస్పూన్ కమస్టర్డ్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవచ్చు.

- ఈ మొత్తం పదార్థాలన్నీ కూడా ఒకటిగా బాగా మిక్స్ చేయాలి.

- ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

లెమన్ , హాని & షుగర్ స్క్రబ్

లెమన్ , హాని & షుగర్ స్క్రబ్

కావల్సినవి:

నిమ్మరసం

తేనె

పంచదార

ఎలా ఉపయోగించాలి:

- నిమ్మరసంను సగానికి కట్ చేసి, అందులో తేనె మిక్స్ చేయాలి. ఇందులో తేనె కలపకూడదన్న విషయం గుర్తుంచుకోవాలి.

- ఇప్పుడు, నిమ్మచెక్క మీద పంచదారను చల్లుకోవాలి.

- నిమ్మచెక్కతో 15 నిముషాలు స్ర్కబ్ చేయాలి

- 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

కాఫీ స్క్రబ్

కాఫీ స్క్రబ్

కావల్సినవి:

కాఫీ పౌడర్

జోజోబా ఆయిల్

ఎలా ఉపయోగించాలి:

- రెండు చెంచాలా కాఫీ పౌడర్ తీసుకుని అందులో వాటర్ మిక్స్ చేయాలి.

- ఇప్పుడు అందులోనే అర టీస్పూన్ కాఫీ పౌడర్ వేసి మరోసారి బాగా మిక్స్ చేయాలి. జోజోబా ఆయిల్ లేకపోతే జస్ట్ కొబ్బరి నూనెను మిక్స్ చేసుకోవచ్చు .

- ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిముషాలు స్ర్కబ్ చేయాలి.

 కేసర్ ప్యాక్

కేసర్ ప్యాక్

మీకు కావల్సినవి:

కుంకుమ పువ్వు : 1 టీస్పూన్

చల్లటి పాలు (ప్రత్యామ్నాయంగా పెరుగు కూడా ఉపయోగించుకోవచ్చు )

తేనె

తయారుచేయు విధానం :

- ఒక స్పూన్ కుంకుమ పువ్వు తీసుకుని అందులో ఒక స్పూన్ పాలను జోడించాలి.

- పెరుగును ఉపయోగించినట్లైతే, ఎక్కువ జోడించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి .

- ఇప్పుడు అందులో అర టీస్పూన్ తేనెను మిక్స్ చేయాలి

- ఈ మొత్తం పదార్థాలన్నింటిని ఒకటిగా కలిపి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ముఖంను నీటితో ఒక సారి కడిగి తర్వాత ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి మసాజ్ చేసుకొవాలి

- పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

 దాల్చిన చెక్కతో ప్యాక్

దాల్చిన చెక్కతో ప్యాక్

కావల్సిన పదార్థాలు :

దాల్చిన చెక్క పౌడర్

పెరుగు

నిమ్మరసం

ఎలా ఉపయోగించాలి:

- మీ వద్ద దాల్చిన చెక్క పౌడర్ లేకపోతే దాల్చిన చెక్కను మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి.

- ఇప్పుడు రెండు టీస్పూన్ల దాల్చిన చెక్క పౌడర్ కు ఒక స్పూన్ నిమ్మరసం మిక్స్ చేయాలి.

- ఇప్పుడు ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. 15 నిముషాల తర్వాత డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

- ముఖంలో ఎలాంటి దురద , మంట కలిగినా వెంటనే నీళ్లతో ముఖం కడిగేసుకోవాలి.

 గ్రీన్ ప్యాక్ :

గ్రీన్ ప్యాక్ :

కావల్సినవి:

గ్రీన్ టీ

పెరుగు

మీకు నచ్చిన ఆయిల్

ఎలా ఉపయోగించాలి :

- రెండు టీస్పూన్ల గ్రీన్ టీ పౌడర్ తీసుకుని ఒక బౌల్లో వేసి బాయిల్ చేయాలి.

- కొన్ని నిముషాలు బాయిల్ చేసిన తర్వాత , చల్లార్చి, అందులో పెరుగు మిక్స్ చేయాలి.

- ఈ రెండూ బాగా కలగలిసే వరకూ మిక్స్ చేయాలి.

- ఈ మిశ్రమానికి మీకు నచ్చిన ఆయిల్ జోడించాలి.

- ఈ మొత్తం మిశ్రమాన్ని మరో సారి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి.

- కొన్ని నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి .

స్వీట్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్

స్వీట్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్

కావల్సినవి:

స్వీట్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్

ఎలా ఉపయోగించాలి :

- కొద్దిగా స్వీట్ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకుని నేరుగా ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి .

- పూర్తిగా డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

- ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్ ముఖంలో ముడుతలను తగ్గిస్తుంది. ఏజింగ్ లక్షనాలను నివారిస్తుంది .

అరటి ఫేస్ ప్యాక్

అరటి ఫేస్ ప్యాక్

కావల్సినవి :

అరటి పండు : ఒకటి (బాగా పండినది)

పెరుగు

బాదం ఆయిల్

విటమిన్ ఇ ఆయిల్

ఎలా ఉపయోగించాలి :

- బాగా పండిన అరటిపండును తీసుకుని మెత్తగా గుజ్జులా తయారుచేసుకోవాలి.

- ఇందులో రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ బాదం ఆయిల్ , రెండు మూడు చుక్కల విటమిన్ ఇ ఆయిల్ మిక్స్ చేయాలి .

- ఈ మొత్తం పదార్థాలన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత ముఖానికి ప్యాక్ లా వేసుకుని మసాజ్ చేయాలి.

- అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి .

English summary

10 Natural Anti-wrinkle Treatments To Prepare At Home

You can prepare these homemade anti-wrinkle treatments and use them as per your convenience, without fearing about any side effects. Have a look at them.
Story first published: Wednesday, March 22, 2017, 10:30 [IST]
Subscribe Newsletter