ముఖ అందాన్ని పాడు చేసే సమస్యలన్నింటికి ఇంట్లోని ఫేస్ ప్యాక్స్ ..!

Posted By: Super Admin
Subscribe to Boldsky

ప్రపంచంలో మొత్తంలో మన ఇండియన్ మహిళలు చాలా అందంగా..కళగా ఉంటారని చెప్పుకుంటుంటారు. మంచి కళతో పాటు కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని కలిగి ఉంటారని, ప్రకాశంతంగా కనబడుతారని అనడమే కాదు, చాలా మంది కవులు భారతీయ స్త్రీల మీద కొన్ని వేల సంఖ్యల్లో కవిత్వాలు కూడా వర్ణించారు. అలాంటి అందానికి మేకప్ జోడిస్తే..అందం మరింత రెట్టింపు అవుతుంది.

ఇండియన్ మహిళలు అంత అందంగా ఉండటానికి కొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయి. అందుకు కారణం పురాత కాలం నుండి అమ్మమ్మలు, అమ్మల నుండి కొన్ని సౌందర్య సీక్రెట్స్ ను ఫాలో అవ్వడమే. ఈ సీక్రెట్స్ తరతరాలుగా అలాగే ఫాలో అవుతున్నారు. పురాతన కాలం నాటీ ఈ పద్దతులు అనుసరిస్తుండటం వల్ల గ్లోయింగ్ స్కిన్ తో మెరిసిపోతుంటారు. ఈ ఏజ్ ఓల్డ్ రెమెడీస్ వల్ల ఎలాంటి హాని ఉండదు. ఇవి వందకి వందశాతం సహజసిద్దమైనవి మరియు సురక్షితమైనవి .

రహస్యం ఏంటంటే సహజసిద్దమైన పదార్థాలతో ఫేస్ మాస్క్ లను తాయరుచేసుకోవడంలో అసలు రహస్యం దాగుతుంది. కొన్ని హోం రెమెడీస్ లో అద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, మినిరల్స్ ఉండి కొన్ని వండర్స్ ను క్రియేట్ చేస్తుంది.

ముఖ్యంగా, ప్రస్తుత రోజుల్లో వర్క్ ప్రెజర్ , నిద్రలేమి, కాలుష్యం, ఎండలు, ఉష్ణోగ్రతలు, వ్యాయామలోపం, ఆహారపు అలవాట్లు వల్ల చర్మ సౌందర్యం తగ్గడం మాత్రమే కాదు, ఎల్లప్పుడు నిర్జీవమైన చర్మాన్ని కలిగి ఉంటారు.

అటువంటి నిర్జీవమైన చర్మాన్ని ఏ ఒక్కరూ కోరుకోరు. అందమైన ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందాలనుకుంటే..ఇక్కడ కొన్ని అద్భుతమైన నేచురల్ ఫేస్ మాస్క్ రెమెడీస్ ను పరిచయం చేస్తున్నాము. వాటిని ఫాలో అయితే చాలు స్వప్న సుందరిలా మెరిసిపోతారు..

కాంతివతంతమైన ప్రకాశవంతమైన చర్మ సౌందర్యాన్ని పొందడానికి ఇవి బెస్ట్ ఫేస్ మాస్క్ లుగా చెబుతున్నారు. మరింకెందుకు ఆలస్యం..ఈ మిరాక్యులస్ ఇండియన్ ఫేస్ మాస్క్ లను అనుసరించి గ్లోయింగ్ అండ్ రేడియంట్ స్కిన్ ను పొందండి..

1. అలోవెర ఫేస్ మాస్క్ :

1. అలోవెర ఫేస్ మాస్క్ :

అలోవెర జెల్ నేచురల్ పదార్థం. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది చర్మంలోని మ్రుతకణాలను తొలగిస్తుంది. చర్మ రంగును మెరుగుపరుస్తుంది. అయితే కేవలం కలబంద రసాన్ని మాత్రమే కాదు, దీనికి ఇతర నేచురల్ పదార్థాలైన నిమ్మరసం, టమోటో రసం వంటివి మిక్స్ చేసి ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

ఎలా తయారుచేయాలి:

కలబద్ద మొక్కనుండి ఆకును వేరుచేసి, స్పూన్ తో జెల్ ను తీసి ఒక కప్పులో వేసుకోవాలి. తర్వాత దీనికి నిమ్మరసం లేదా టమోటో గుజ్జును మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లో వేసుకోవాలి. 20 నిముషాల తర్వాత చన్నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

2. కీరదోస & నిమ్మరసం

2. కీరదోస & నిమ్మరసం

నిమ్మరసం, కీరోదసకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది చర్మంను కాంతివంతంగా మార్చడంలో గొప్పగా సహాయపడుతుంది. ఈ ఏజ్ ఓల్డ్ బ్యూటి ట్రిక్ ను ఉపయోగించడం వల్ల ఇండియన్ ఉమెన్ బ్యూటి మరింత పెరుగుతుంది. కీరదోకాయ, నిమ్మరసం రేడియంట్ స్కిన్ అందివ్వడంలో గొప్పగా సహాయపడుతుంది

ఎలా తయారుచేయాలి:

కీరదోసకాయను తురిమి, అందులో నుండి ఒక టేబుల్ స్పూన్ రసాన్ని తీసి, అందులో నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత చన్నీటితో ముఖం శుభ్రపరుచుకోవాలి.

3. శెనగపిండి మరియు పచ్చిపాలు

3. శెనగపిండి మరియు పచ్చిపాలు

చర్మ సమస్యలను నివారించడంలో శెనగపిండి గ్రేట్ రెమెడీ. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. దీనికి పచ్చిపాలను మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. చర్మంను కాంతివంతంగా మార్చడంలో ఉత్తమమైన ఫేస్ ప్యాక్.

ఎలా తయారుచేయాలి:

శెనగపిండి తీసుకుని, అందులో పచ్చిపాలను మిక్స్ చేయాలి. పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ వేసుకుని 15 నిముషాల తర్వాత చన్నీటితో కడిగేసుకోవాలి.

4. గుడ్డు మరియు బాదం నూనె:

4. గుడ్డు మరియు బాదం నూనె:

గుడ్డులో ఆస్ట్రిజెంట్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.అలాగే బాదం ఆయిల్లో విటమిన్ ఇ ఎక్కువ. ఈ రెండు పదార్థాలను కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది. నేచురల్ గ్లో పెరుగుతుంది.

ఎలా తయారుచేయాలి:

రెండు టీస్పూన్ల బాదం ఆయిల్ ను గుడ్డు మిశ్రమంలో వేసి మిక్స్ చేసి ముఖం, మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మంలో మంచి గ్లో పెరుగుతుంది. ఈ ప్యాక్ వేసుకున్న 20 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

5. పసుపు , బేకింగ్ సోడ మరియు రోజ్ వాటర్

5. పసుపు , బేకింగ్ సోడ మరియు రోజ్ వాటర్

పసుపు, బేకింగ్ సోడ, రోజ్ వాటర్ మూడు అన్ని రకాల చర్మ సమస్యలను, డల్ స్కిన్, మొటిమలను ను నివారిస్తాయి. యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్ కు ఈ మూడు పవర్ హౌస్ వంటిది. చర్మానికి చాల మేలు చేస్తుంది.

ఎలా తయారుచేయాలి:

ఒక టీస్పూన్ పసుపుకు ఒక టీస్పూన్ బేకింగ్ సోడ, ఒక టీస్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి ముఖం మెడకు అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత ముఖంను శుభ్రం చేసుకోవాలి.

6. పసుపు, తేనె & పాలు ఫేస్ మాస్క్

6. పసుపు, తేనె & పాలు ఫేస్ మాస్క్

ఈ మూడు పదార్థాలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తాయి. చర్మంలోని బ్యాక్టీరియాను తొలగించి, నేచురల్ గ్లో పెరిగేలా చేస్తాయి.

ఎలా తయారుచేయాలి:

పసుపులో ఒక టీస్పూన్, తేనె, ఒక టేబుల్ స్పూన్ పాలు మిక్స్ చేసి, పేస్ట్ లా అయిన తర్వాత ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

7. అరటి & తేనె ఫేస్ మాస్క్

7. అరటి & తేనె ఫేస్ మాస్క్

అరటికాయను సౌందర్య పోషణలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అరటి పండులో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. విటమిన్ బి16 కూడా అధికంగా ఉంటుంది. దీన్ని తేనెతో పాటు మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మ కాంతిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

ఎలా తయారుచేయాలి:

బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి, అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ హోం మేడ్ ఫేస్ ను అప్లై చేసి అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

8. బొప్పాయి & తేనె ఫేస్ మాస్క్

8. బొప్పాయి & తేనె ఫేస్ మాస్క్

బొప్పాయిలో పెపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మానికి వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తుంది. బొప్పాయిని మెత్తగా పేస్ట్ చేసి, అందులో తేనె మిక్స్ చేయడం వల్ల పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్ గా పనిచేసి, చర్మంలో డల్ నెస్ ను తొలగిస్తుంది.

ఎలా తయారుచేయాలి:

బాగా పండిన బొప్పాయిని మెత్తగా చేసి,అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. ముఖానికి అప్లై చేసి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. చర్మంలో గ్లో మరియు బ్రైట్ నెస్ పెరుగుతుంది.

9. కీరదోసకాయ-వాటర్ మెలో ఫేస్ మాస్క్

9. కీరదోసకాయ-వాటర్ మెలో ఫేస్ మాస్క్

కీరదోసకాయ మరియు వాటర్ మెలోన్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది స్కిన్ రివైవింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. డల్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఈ రెండు పదార్థాలను ఒకేసారి ఉపయోగించడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందుతారు.

ఎలా తయారుచేయాలి:

1/4 కీరదోసకాయను తురిమాలి, అలాగే వాటర్ మెలోన్ ను ముక్కలుగా కట్ చేసి , ఈ రెండింటిని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ ను వేసుకున్న 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం వాష్ చేసుకోవాలి

10. బ్రెడ్ పొడి, మలై ఫేస్ మాస్క్

10. బ్రెడ్ పొడి, మలై ఫేస్ మాస్క్

బ్రెడ్ పొడిలో మలై క్రీమ్ వేసి, మిక్స్ చేసి చర్మానికి అప్లై చేసి మర్ధన చేసి 15నిముషాలు అలాగే వదిలేయాలి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

ఎలా తయారుచేయాలి:

బ్రెండ్ పొడిలో రెండు స్పూన్ల మలై మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 20 నిముషాల తర్వాత చన్నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

11. ఓట్ మీల్, టమోటో, పెరుగు ఫేస్ మాస్క్

11. ఓట్ మీల్, టమోటో, పెరుగు ఫేస్ మాస్క్

ఈ మూడు పదార్థాలను మిక్సీలో వేసి పేస్ట్ లా చేయాలి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్కిన్ మెరిపించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. యూవీరేస్, పొల్యూషన్ మురికి వల్ల పాడైన చర్మాన్ని శుభ్రం చేసి నేచురల్ గ్లో పెంచుతుంది.

ఎలా తయారుచేయాలి:

మరో పద్దతిలో మెత్తగా ఉడికించిన ఓట్ మీల్ తీసుకుని అందులో టమోటో జ్యూస్, పెరుగు మిక్స్ చేసి ముఖం మెడకు అప్లై చేసి 15 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

12. బంగాళదుంప & నిమ్మరసం ఫేస్ మాస్క్

12. బంగాళదుంప & నిమ్మరసం ఫేస్ మాస్క్

బంగాళదుంపలో విటమిన్ సి మరియు పొటాసియం అధికంగా ఉన్నాయి, ఈ రెండు పదార్థాలు చర్మంలో నేచురల్ గ్లో పెంచడానికి సహాయపడుతాయి. వీటిని మిక్స్ చేసినప్పుడు స్కిన్ బ్రైట్ నెస్ పెరుగుతుంది.

ఎలా తయారుచేయాలి:

బంగాలదుంపలను ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి, అందులో రెండు స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసి ముఖం మెడకు అప్లై చేసి 15నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    12 Indian DIY Face Masks For Glowing Skin

    India is one country that is popular worldwide for its traditional beauty secrets. Women of this country have a glowing skin that looks incredible and flawless even without a stitch of makeup.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more