7 రోజుల్లో అద్భుతమైన చర్మ సౌందర్యాన్ని పొందడానికి కోకనట్ ఆయిల్ ఫేస్ మాస్క్ ...!!

By Lekhaka
Subscribe to Boldsky

అద్దం ముందు నిలబడి, తమ అందాన్ని చూసుకుని మురిసిపోవడంలో అమ్మాయిలకు అందవేసిన చెయ్యి. అయితే సెడన్ గా అందమైన ముఖంలో చిన్న బ్లాక్ స్పాట్ కనబడితే ఇక ఏమౌతుంది. వారి ఆందోళన అంతా ఇంతా కాదు. మొటిమల కారణంగా ముఖం డల్ గా నిర్జీవంగా కనబడుతుంది. అలాంటి చర్మం అసలు వయస్సుకన్నా రెండింతలు ఎక్కువ చూపుతుంది. అలా జరగకూడదంటే మా వద్ద ఒక మంచి పరిష్కార మార్గం ఉంది. అదేంటంటే కొబ్బరి నూనెతో ఫేస్ మాస్క్ .

కొబ్బరి నూనె జుట్టుకు అందించే ప్రయోజనాలకంటే చర్మ సంరక్షణకు అందించే ప్రయోజనాలే ఎక్కువ. చర్మంలోకి చాలా తేలికగా చొచ్చుకుపోవడంలో కొబ్బరి నూనె గొప్పది.

 2 Fabulous Coconut Oil Face Masks For Gorgeous Skin In 7 Days!

ఎందుకంటే కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది చర్మంలోనికి చాలా తేలికగా చొచ్చుకుపోయి, చర్మంలోని మలినాలను తొలగిస్తుంది. స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. చర్మంను స్మూత్ గా మార్చుతుంది.

అంతే కాదు, కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి కావల్సిన తేమను అందిస్తుంది. కొల్లాజెన్ లెవల్స్ ను పెంచుతుంది. స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది. కొబ్బరి నూనెతో చర్మ సౌందర్యానికి ఉపయోగించే ఇతర థెరఫిటిక్ పదార్థాలను జోడించడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా చర్మంలోకి చొచ్చుకుని పోతుంది. ఈ కొబ్బరి నూనె ఫేస్ మాస్క్ లను ప్రయత్నించడానికి ముందు ప్రస్తుతం మీ స్కిన్ కండీషన్ గుర్తుంచుకోవాలి. తర్వాత మార్పును ఖచ్చితంగా నోటిఫై చేయాలి.

ఈ పురాతన పద్దతితో పాటు, చర్మానికి అంతర్గతంగానే కాదు, బహిర్గతంగా కూడా మంచి ఆహారాలను అందివ్వాలి. అప్పుడే చర్మం లోపల, బయట కూడా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. 7 రోజుల్లో అద్భుతమై చర్మం పొందడానికి 12 ఫ్యాబులస్ కోకనట్ ఆయిల్ ఫేస్ మాస్క్ లు ..

కొబ్బరి నూనె, తేనె:

కొబ్బరి నూనె, తేనె:

ఈ మాస్క్ స్కిన్ ను హైడ్రేషన్ గా మార్చుతుంది. చర్మంలోపలి వరకూ చొచ్చుకునిపోయి, ముడుతలను మాయం చేస్తుంది. ఒక టేబుల్ స్పూనె తేనెలో 10 చుక్కల కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. రెండూ బాగా కలిసే వరకూ మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి. 15 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

గుడ్డు, నిమ్మరసం, కొబ్బరి నూనె

గుడ్డు, నిమ్మరసం, కొబ్బరి నూనె

హై ప్రోటీన్, పొటాషియం మాస్క్ చర్మంలో టాక్సిన్స్ ను తొలగిస్తుంది. స్కిన్ టిష్యులను రిపేర్ చేస్తుంది. కొత్త చర్మ కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఒక బౌల్ తీసుకుని అందులో ఎగ్ వైట్ , ఒక టీస్పూన్ నిమ్మరసం, 5 చుక్కల కొబ్బరి నూనె వేసి బాగా మూడు కలిసే వరకూ బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పూర్తిగా అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనె , నట్ మగ్ :

కొబ్బరి నూనె , నట్ మగ్ :

ఈ హోం మేడ్ ఫేస్ మాస్క్ లో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది కేవలం పస్ సెల్స్ ను డ్రైగా మార్చడం మాత్రమే కాదు, స్కిన్ లో మార్క్స్ ను లైట్ గా మార్చుతుంది. ఒక టీస్పూన్ నట్ మగ్ లో ఒక టీస్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. దీన్ని ముఖంలో ప్రభావితం ప్రాంతంలో అప్లై చేయాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

బేకింగ్ సోడా, కొబ్బరి నూనె :

బేకింగ్ సోడా, కొబ్బరి నూనె :

ఈ రెండింటి కాంబినేషన్ మాస్క్ చర్మంలోకి డీప్ గా చొచ్చుకుని పోయి, చర్మంను శుభ్రం చేస్తుంది. చర్మంలో లోపలి పొరల వరకూ శుభ్రం చేస్తుంది. ఒక టీస్పూన్ బేకింగ్ సోడాలో అరటేబుల్ స్పూన్ కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. రెండూ బాగా మిక్స్ చేసిన తర్వాత ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాలు డ్రైగా మారిన తర్వాత స్ర్కబ్ చేసి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కొబ్బరి నూనెతో మసాజ్

కొబ్బరి నూనెతో మసాజ్

అలసిన, డల్ స్కిన్ ను నివారించడానికి , సింపుల్ గా కొన్ని చుక్కల కొబ్బరి నూనెను చేతిలోకి తీసుకుని, మసాజ్ చేయాలి. చర్మానికి అప్లై చేసి పైకి క్రిందకు మర్ధన చేస్తూ మసాజ్ చేయాలి. 10 నుండి 15 నిముషాలు అలా మర్ధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ చిట్కాను రాత్రుల్లో అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే చల్లటి నీటితో శుభ్ర చేసుకుంటే అందంగా తేమగా రేడియంట్ గా మెరుస్తుంటుంది.

అలోవెర, కొబ్బరి నూనె

అలోవెర, కొబ్బరి నూనె

ఆయుర్వేదిక్ కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఈ నూనె ఫ్రీరాడికల్స్ బారీ నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. ట్యాన్ నివారిస్తుంది. చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది. ఒక టేబుల్ స్పూన్ అలోవెర జెల్ తీసుకుని అందులో 10 చుక్కల కొబ్బరి నూనె వేసి మసాజ్ చేయాలి. రాత్రుల్లో చేసుకుంటే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఉదయం లేవగానే చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

అవొకాడో, తేనె, కొబ్బరి నూనె

అవొకాడో, తేనె, కొబ్బరి నూనె

ఈ కోకనట్ ఆయిల్ ఫేస్ మాస్క్ లో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఇ మరియు విటమిన్ కెలు అధికంగా ఉంటాయి. ఇది చర్మంను డిటాక్సిఫై చేస్తుంది. స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. స్కిన్ కంప్లెక్స్ ను బ్రైట్ గా మార్చుతుంది . ఒక టేబుల్ స్పూన్ అవొకాడో గుజ్జులో , ఒక టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాలి.అందులోనే కొబ్బరి నూనె కూడా మిక్స్ చేయాలి. మూడింటిని స్మూత్ గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి, చేతి వేళ్ళతో మసాజ్ చేయాలి. అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఆరెంజ్ జ్యూస్, పెరుగు, కొబ్బరి నూనె :

ఆరెంజ్ జ్యూస్, పెరుగు, కొబ్బరి నూనె :

ఈ కోకనట్ ఆయిల్ ఫేస్ మాస్క్ లో విటమిన్ సి, లెక్టిన్ మరియు అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్ లెవల్స్ ను పెంచుతాయి. స్కిన్ ఎలాసిటిని పెంచుతాయి. చర్మంలో స్కార్స్ తొలగించి చర్మంను బ్రైట్ గా మార్చుతాయి .

ఒక టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్ లో అరటేబుల్ స్పూన్ పెరుగు మూడు చుక్కల కొబ్బరి నూనె మిక్స్ చేయాలి. ఈ మూడు బాగా మిక్స్ చేసి, ముఖం, మెడకు అప్లై చేసి, అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. చివరగా చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ను తొలగిస్తుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ లెవల్స్ పెంచుతుంది .

పెరుగు, స్ట్రాబెర్రీ, బాదం ఆయిల్, కొబ్బరి నూనె

పెరుగు, స్ట్రాబెర్రీ, బాదం ఆయిల్, కొబ్బరి నూనె

ఈ కాంబినేషన్ ఫేస్ ప్యాక్ లో ఉండే ల్యాక్టిక్ యాసిడ్, విటమిన్ బి 5 మరియు యాంటీఆక్సిడెంట్స్ చర్మంలో స్కార్స్ ను మాయం చేస్తుంది. డల్ గా ఉన్న చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. చర్మంను సపెల్ గా క్లియర్ గా మార్చుతుంది. అందుకు చేయాల్సిందల్లా. ఒక టేబుల్ స్పూన్ స్ట్రాబెర్రీ గుజ్జు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు , 5 చుక్కల బాదం ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్నింటిని బాగా మిక్స్ చేసి ముఖం, మెడకు అప్లై చేయాలి.

ఆలివ్ ఆయిల్ , కొబ్బరి నూనెతో మేకప్ తొలగించడం

ఆలివ్ ఆయిల్ , కొబ్బరి నూనెతో మేకప్ తొలగించడం

ఈ కాంబినేషన్ ఫేస్ ప్యాక్ లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది క్లెన్సర్ గా పనిచేస్తుంది. చర్మంలో పేరుకుపోయిన మేకప్ ను తొలగిస్తుంది. చర్మంద్రాల్లో సహా శుభ్రం చేస్తుంది. ఒక కాటన్ బాల్ తీసుకుని ఈ మిశ్రమంలో డిప్ చేయాలి. తర్వాత కాటన్ తో ముఖం మీద అప్లై చేస్తూ మర్ధన చేయాలి. డ్రైగా మారిన తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఐలాష్ కండీషనర్ గా కొబ్బరి నూనె

ఐలాష్ కండీషనర్ గా కొబ్బరి నూనె

కొబ్బరి నూనెలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది కను రెప్పలను పొడవుగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. కాటన్ బాల్ తీసుకుని కొబ్బరి నూనెలో డిప్ చేసి కను రెప్పలకు, ఐబ్రోస్ కు అప్లై చేయాలి. రాత్రుల్లో ఈ చిట్కా అనుసరిస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

కొబ్బరి నూనె, ల్యావెండర్ ఆయిల్ :

కొబ్బరి నూనె, ల్యావెండర్ ఆయిల్ :

కొబ్బరి నూనె, ల్యావెండర్ ఆయిల్ కాంబినేషన్ డ్రై స్కిన్ నివారిస్తుంది,. ఈ ఫేస్ మాస్క్ కోసం 1 టీస్పూన్ కొబ్బరి నూనెలో 5 చుక్కల ల్యావెండర్ ఆయిల్ మిక్స్ చేసి రెండూ బాగా కలిసిన తర్వాత ముఖానికి అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు ప్రతి రోజూ రాత్రి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందిజ

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    2 Fabulous Coconut Oil Face Masks For Gorgeous Skin In 7 Days!

    Go to the mirror, take a good close look at your skin. What do you see? Is your skin riddled with black spots? Perhaps an angry zit slowly tearing your skin tissues to pop out, or dullness, making you look twice your age. Whatever the case may be. We have a solution and that is coconut oil face mask.
    Story first published: Monday, January 16, 2017, 19:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more