For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందం పెంచుకోవడానికి బాదం -ఆలివ్ ఆయిల్ ఈ రెండింటిలో ఏది బెటర్ ..!

బాదం ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ ఈ రెండింటిలో ఏది మంచిది ? అంటే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని చెబుతారు. అది వారి అనుభవాన్ని బట్టి చెప్పొచ్చు. పురాతన కాలం నుండి వివిధ రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్

|

బాదం ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ ఈ రెండింటిలో ఏది మంచిది ? అంటే ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని చెబుతారు. అది వారి అనుభవాన్ని బట్టి చెప్పొచ్చు. పురాతన కాలం నుండి వివిధ రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ , విత్తనాల నుండి నూనెలను తయారుచేస్తున్నారు.

అదే విధంగా ఆలివ్స్ నుండి ఆలివ్ ఆయిల్, బాదం గింజల నుండి బాదం ఆయిల్ ను తయారుచేయడం జరగుతుంది. అయితే ఈ రెండింటి ఏది బెటర్ అని చాలా మందికి సందేహం.

ఈ రెండు నూనెల్లోని బెనిఫిట్స్ అందరికీ తెలసినదే. అయితే కొంత మందేమో బాదం ఆయిల్లో ఎక్కు వప్రయోజనాలుంటే, మరికొందరు ఆలివ్ ఆయిల్ బెటర్ అని అంటారు
అయితే ఈ రెండు నూనెలను విత్తనాలు, ప్రయోజనాలను అందించే వాటితోనే తయారుచేస్తారు. అయితే బాదం మరియు ఆలివ్ ఆయిల్ ఉపయోగించే విధానం మరియు చర్మ తత్వం మీద ఆధారపడి ఉంటుంది.

బాదం ఆయిల్, ఆలివ్ ఆయిల్ కేవలం స్కిన్ టైప్ ను బట్టే కాదు, ఇతర కారణాల వల్ల కూడా వీటిని ఇష్టపడుతారని తెలుసుకోవాలంటే..జవాబు క్రిందనే ఉంది..

బాదం ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

బాదం ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

ముందుగా వివరించినట్లు, బెస్ట్ రిజల్ట్ హెయిర్ టైప్ ను బట్టి తెలుస్తుంది. అయితే బాదం నూనె జుట్టును సాప్ట్ గా ఉంచడంలో అన్ని రకాల జుట్టు తత్వాలకు సూట్ అవుతుంది. అలాగే ఆలివ్ ఆయిల్లో ఉండే ఓమేగా 3 ఫ్యాట్ యాసిడ్స్, హెయిర్ మాయిశ్చరైజర్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. పొడి వాతావరణంలో కూడా ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

స్కిన్ డ్రైనెస్ కు బాదం లేదా ఆలివ్ ఆయిల్ :

స్కిన్ డ్రైనెస్ కు బాదం లేదా ఆలివ్ ఆయిల్ :

బాదం లేదా ఆలివ్ ఆయిల్ బ్యూటీ విషయంలో రెండూ ఉత్తమమైనవే. వీటిలో ఉండే అద్భుతమైన వాసన, బాదం ఆయిల్లో ఉండే విటమిన్ మరియు విటమిన్ ఇలు మరింత పాపులర్ అవుతుంది. అదే విధంగా ఆలివ్ ఆయిల్ గ్రేట్ మాయిశ్చరైజరన్ గా పనిచేస్తుంది. ముఖ చర్మంను సాప్ట్ గా మార్చడంలో గొప్ప గా సహాయపడుతుంది.

డార్క్ సర్కిల్స్ ను నివారించే బాదం, ఆలివ్ ఆయిల్ :

డార్క్ సర్కిల్స్ ను నివారించే బాదం, ఆలివ్ ఆయిల్ :

కళ్ళ క్రింద నల్లటి వలయాలతో చాలా మంది బాధపడుతుంటారు. నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి ఎఫెక్టివ్ మార్గం కొబ్బరి నూనె, బాదం నూనె. అంతే కాదు, ఈ నూనెలకు ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ఉపయోగిస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బాదం ఆయిల్ చాలా తేలికగా ఉంటుంది కాబట్టి దీన్ని రాత్రుల్లో కళ్ల క్రింద అప్లై చేయాలి.

ఫెయిర్ స్కిన్ పొందడానికి బాదం ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ :

ఫెయిర్ స్కిన్ పొందడానికి బాదం ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ :

ఫెయిర్ గా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి? బాదం, ఆలివ్ ఆయిల్ తో ఫెయిర్ స్కిన్ సొంతం అవుతుంది. బాదం ఆయిల్లో ఉండే విటమిన్ ఎ, ఇలు స్కిన్ హైడ్రేషన్ పెంచుతుంది. ఆలివ్ ఆయిల్ నేచురల్ వైట్ నర్ గా పనిచేస్తుంది. దాంతో స్కిన్ ఫెయిర్ గా మారుతుంది.

 బాడీ మసాజ్ కోసం ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ :

బాడీ మసాజ్ కోసం ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ :

బాదం ఆయిల్ బాడీ మసాజ్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో ఉండే అనేక పదార్థాలు జుట్టును సాప్ట్ గా..సపెల్ గా మార్చుతుంది. ఆలివ్ ఆయిల్ చాలా మంది ఉపయోగిస్తారు. ఈ రెండు నూనెలు కూడా మిక్స్ చేసి బాడీ మసాజ్ కు ఉపయోగిస్తారు. కాబట్టి, డెషిసెన్ మీదు. ప్రయోజనాలు మీవి..

English summary

Almond Oil Or Olive Oil, Which Is Better?

If you are confused about which oil is better in terms of beauty purposes between almond and olive oil, we'll help you clear out your confusion.
Desktop Bottom Promotion