కాకరకాయ చేదైనా...సౌందర్యాన్ని పెంచడంలో మాత్రం తీపే..!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

భారతదేశంలో కారేలా అని పిలిచే కాకరకాయను చాలా తక్కువగా ఉపయోగిస్తారు. పేరులో చెప్పినట్టే కొంచెం చేదు రుచి కలిగి ఉండటం వలన ఆహారంలో తినటానికి ఎక్కువగా ఇష్టపడరు.

కాకరకాయ రుచిని పక్కన పెడితే, కాకరకాయలో ప్రోటీన్లు మరియు విటమిన్స్ సమృద్ధిగా ఉన్నాయి. అవి ఆరోగ్యానికి అనేక రకాలుగా సహాయపడతాయి. అంతేకాక సమయోచితంగా ముఖానికి రాస్తే చర్మ ఆరోగ్యానికి కూడా ప్రసిద్ధి చెందింది. కాకరకాయలో అనేక సౌందర్య లాభాలు ఉన్నాయి.

 Beauty Benefits Of Bitter Gourd,కాకర కాయలో ఉన్న బ్యూటీ ప్రయోజనాలు

కాకరకాయ రసం త్రాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చర్మం మరియు జుట్టు సంరక్షణలో కూడా చాల బాగా సహాయపడుతుంది. కాకరకాయ రసంలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి మరియు డైటరీ ఫైబర్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మం మరియు జుట్టు సంరక్షణలో సహాయపడుతుంది.

కాకరకాయ రసంలో పాలకూర కంటే రెండు రేట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. బ్యూటీ ప్రయోజనాల కోసం కాకరకాయను ఎలా ఉపయోగించాలో ఈ వ్యాసంలో తెలుసుకుందాం.

మెరిసే చర్మం కోసం

మెరిసే చర్మం కోసం

కాకరకాయ ముఖం నుండి దుమ్ము మరియు ధూళిని బయటకు ఫ్లష్ చేయటానికి సహాయపడుతుంది. అందువలన ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మంగా మారి ముఖం మెరుస్తుంది. కాకరకాయలో ఉండే విటమిన్లు మరియు ప్రోటీన్ల కారణంగా ముఖంపై అవాంఛిత ధూళిని చాలా సులభంగా బయటకు పంపటానికి సహాయపడుతుంది.

కాకరకాయ రసాన్ని ముఖానికి రాసి 5 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ప్రకాశవంతమైన చర్మం పొందటానికి ఈ విధంగా రోజుకి ఒకసారి చేయాలి.

 చర్మ దురదలకు చికిత్స

చర్మ దురదలకు చికిత్స

మీరు తరచుగా చర్మ దురద మరియు వాపులతో బాధ పడుతూ ఉంటే కనుక కాకరకాయ రసాన్ని ఒక క్రమ పద్దతిలో ఉపయోగించాలి. కాకరకాయ ముక్కలను తీసుకోని మిక్సీ చేసి పేస్ట్ తయారుచేయాలి. ఈ పేస్ట్ లో చిటికెడు పసుపు,ఒక స్పూన్ అలోవెరా జ్యుస్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి.

మొటిమలకు చికిత్స

మొటిమలకు చికిత్స

కాకరకాయలో యాంటిబాక్టీరియల్ మరియు యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన అవాంఛిత మోటిమలు, మొటిమల మచ్చల చికిత్సలో సహాయపడుతుంది. కాకరకాయలో సగం ముక్కను తీసుకోని మెత్తని [పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ కి ఒక స్పూన్ జాజికాయ పొడి, ఒక స్పూన్ పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10 నిమిషాల తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

వేడి దద్దుర్లకు చికిత్స

వేడి దద్దుర్లకు చికిత్స

కాకరకాయలో ఫైబర్ మరియు ప్రొటీన్లు సమృద్ధిగా ఉండుట వలన వేడి దద్దుర్ల చికిత్సలో సహాయపడుతుంది. కాకరకాయ ముక్కలను నీటిలో వేసి మరిగించాలి. నీరు లేత ఆకుపచ్చని రంగులోకి వచ్చేదాకా మరిగించాలి. ఆ నీటిలో కాటన్ బాల్ ని ముంచి దద్దుర్లు ఉన్న ప్రదేశంలో రాసి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. వేసవి రోజులలో మీ చర్మాన్ని రక్షించడానికి ఈ పరిష్కారం బాగా ఉపయోగపడుతుంది.

చికాకు కలిగించే చర్మం

చికాకు కలిగించే చర్మం

చర్మం పొడిగా మరియు దురదగా ఉంటే కాకరకాయ ప్యాక్ బాగా పనిచేస్తుంది. కాకరకాయను మెత్తని పేస్ట్ గా చేయాలి. కరివేపాకును ఎండలో పెట్టి పొడిగా చేయాలి. కాకరకాయ పేస్ట్ లో రెండు స్పూన్ల కరివేపాకు పొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10 నిమిషాల తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే దురద తగ్గిపోతుంది.

English summary

Beauty Benefits Of Bitter Gourd

Beauty Benefits Of Bitter Gourd,Bitter gourd, better known as Karela in India, is one among the least consumed vegetables. Like the name says, bitter gourd is bitter in taste and hence most of them don't prefer including this veggie in their diet.
Subscribe Newsletter