Latest Updates
-
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.! -
తెలంగాణలో వైభవోపేతంగా ఆషాఢ బోనాలు.. రంగంలో భవిష్యవాణి చెప్పిన సంగతులివే.! -
హస్తసాముద్రికం: మీ చేతిలో ఈ రేఖ ఉంటే కోటీశ్వరులు అవ్వడం పక్కా! -
రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ మసాలా దోశ ఇంట్లోనే.. ఈ రెండు సీక్రెట్స్ తెలిస్తే చాలు! -
కొందరు అందంగా లేకపోయినా ఎందుకు అందరినీ ఆకర్షిస్తారో తెలుసా.? -
మందు తాగేటప్పుడు స్టఫ్ గా ఏది తినడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా? -
చపాతీ, నాన్, జీరా రైస్ లోకి అమృతంలాంటి నవరతన్ కుర్మా.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
శృంగార సమస్యల సంజీవని.. ఈ హల్వాను కప్పు తిన్నారంటే వీర్య పుష్టి మీ సొంతం.!
ఆరెంజ్ పీల్ ఫేస్ మాస్క్ తో అమేజింగ్ స్కిన్ బ్యూటీ బెనిఫిట్స్
. ఆరెంజ్ తొక్క ముఖం మరియు చర్మఛాయను పెంచడంలో కొన్ని అద్భుతాలను సృష్టిస్తుంది. ఆయిల్ చర్మాన్ని, చర్మంలో మూసుకుపోయిన రంధ్రాలను, ఇన్ఫ్లమేషన్ ను తొలగిస్తుంది, మొటిమలను నివారిస్తుంది, blemishesను తొలగిస్తు
సౌందర్యానికి పండ్లు కూడా అద్భుతంగా ఉపయోగపడుతాయన్న సంగతి మనకు తెలిసిందే. పండ్లలో ముఖ్యంగా ఆరోగ్యానికి మరియు అందానికి బాగా ఉపయోగపడేది ఆరెంజ్. ఆరెంజ్ తొక్క ముఖం మరియు చర్మఛాయను పెంచడంలో కొన్ని అద్భుతాలను సృష్టిస్తుంది. ఆయిల్ చర్మాన్ని, చర్మంలో మూసుకుపోయిన రంధ్రాలను, ఇన్ఫ్లమేషన్ ను తొలగిస్తుంది, మొటిమలను నివారిస్తుంది, blemishesను తొలగిస్తుంది. ఇంకా స్కిన్ టోన్ కూడా మీ ముఖం మెరిసేలా చేస్తుంది. ఆరెంజ్ తొక్కను నిల్వ చేయడంతో పాటు ఉపయోగించడం కూడా చాలా సులభం.


మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది
యుక్తవయస్సులో ఆడపిల్లల ముఖంపై ఏర్పడే మొటిమలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేయడంలో కమలా రసం బాగా ఉపయోగకారి.

ముఖ కాంతి పెరగడమే కాదు. గోల్డెన్ ఫేషియల్ చేసిన గ్లో వస్తుంది.
ఆరెంజ్ గుజ్జుని తేనెలో కలిపి ఫేషియల్ చేసుకోవచ్చు. ఆరెంజ్ గుజ్జుకి శాండిల్ ఉడ్ పౌడర్, ముల్తానీ మట్టిసమపాళ్లలో కలిపి ఫేస్ కి ప్యాక్ చెయ్యాలి. ముఖ కాంతి పెరగడమే కాదు. గోల్డెన్ ఫేషియల్ చేసిన గ్లో వస్తుంది.

ఇది బ్లీచ్ లా పనిచేస్తుంది.
ఆరెంజ్ తొక్క ఎండ బెట్టి పౌడర్ చేసి కొద్దిగా పాలను కలపి పేస్ట్ లా తయారు చేసి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలు ఉంచి గోరు వెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. ఇది బ్లీచ్ లా పనిచేస్తుంది.

ముఖం గ్లో పెరగడానికి ఉపయోగపడుతుంది
. బియ్యం, పెసరపప్పు, శనగపప్పు, సమబాగంలో తీసుకొని మరువం, తులసి ఆకులు, వేపాకులకు ఆరెంజ్ తొక్క పౌడర్ కలిపి సున్నిపిండిగా తయారు చేసుకోవచ్చు. ఇది చర్మం సున్నితత్వానికి ముఖం గ్లో పెరగడానికి ఉపయోగపడుతుంది

మంచి క్లెన్సింగ్ గా కూడా ఉపయోగపడుతుంది.
ప్రయాణంలో అలసిన ముఖం మీద అప్పుడే ఒలిచిన ఆరెంజ్ తొక్కలతో స్ప్రే చేస్తే, నిముషాల్లో వడలిపోయినట్లుగా ఉన్నముఖం ప్రెష్ గా కనిపిస్తుంది. ఇది మంచి క్లెన్సింగ్ గా కూడా ఉపయోగపడుతుంది.

ముఖం కొత్త అందంతో మెరిసిపోతుంది.
ఆరెంజ్ పండ్లు తినగా మిగిలిన తొక్కను పడవేయకుండా, వాటిని అలాగే నీడపట్టున ఉంచి ఆరబెట్టాలి. ఇవి మరీ ఒరుగుల్లాగా ఎండిపోతే పొడి చేసుకునేందుకు వీలుకాదు. కాబట్టి.. ఓ మోస్తరుగా మిక్సీలో పొడి చేసుకునేందుకు వీలుగా, పెళుసుగా ఉండేలా ఎండితే సరిపోతుంది.
ఇలా ఎండబెట్టిన నారింజ తొక్కలను పొడిచేసుకుని పొడిగా ఉండే బాటిల్‌లో భద్రపరచుకోవాలి. వీలు దొరికినప్పుడల్లా ఒక టీస్పూన్ నారింజపొడిని తీసుకుని, దానికి తగినన్ని పాలు కలిపి, మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లాగా వేసుకుని, అరగంట తరువాత తీసివేస్తే సరిపోతుంది. ఇది చాలా సహజమైన బ్లీచింగ్‌లాగా పనిచేస్తుంది కాబట్టి, ముఖం కొత్త అందంతో మెరిసిపోతుంది.

చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి.
నారింజ తొక్కను పడేయకుండా... ఎండబెట్టి, పొడి చేసి, సున్నిపిండిలో కలుపుకుంటే మంచిది. ఈ పిండిని స్నానానికి ముందు ఒంటికి రాసుకుని రబ్ చేస్తే... చర్మంపై ఉండే మృతకణాలన్నీ సులభంగా తొలగిపోతాయి. చర్మం మృదువుగా అవటమే కాకుండా, కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

విటమిన్ సి
విటమిన్ సి శాతం ఎక్కువగా ఉన్న నారింజను రోజుకు ఒకటి తీసుకున్నట్లయితే.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది.

మంచి శరీర ఛాయతో ఉంటారు.
ప్రతిరోజు కమలా పండ్ల రసం తాగితే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఉత్సాహంగా, ఆరోగ్యంగా, పుష్టిగా, మంచి శరీర ఛాయతో ఉంటారు.

చుండ్రు సమస్యే ఉండదు.
సాధరణంగా చుండ్రు సమస్య ఉన్నవారు ఆరెంజ్ పౌడర్ ను నీళ్లతో పేస్ట్లా కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. వారానికి సారి ఇలా చేస్తే క్రమంగా చుండ్రు సమస్యే ఉండదు.



Click it and Unblock the Notifications