మిమ్మల్ని అందంగా మార్చే డిఫరెంట్ టమోటో ఫేస్ మాస్క్ చిట్కాలు

Posted By:
Subscribe to Boldsky

టమోటోలు ప్రతి ఇండియన్ ఇంట్లో తప్పనిసరిగా ఉండే టేస్టీ అండ్ జ్యూసీ వెజిటేబుల్. కొంత మంది దీన్ని ఫ్రూట్ అని కూడా పిల్చుకుంటారు. ఇది చర్మం మరియు ఆరోగ్యానికి గొప్పగా సహాయపడుతుంది. ఇందులో ఉండే న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ అందుకు గొప్పగా సహాపడుతాయి. టమోటోలను ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. హోం మేడ్ ఫేస్ ప్యాక్ రిసిపిలను తయారుచేసుకోవచ్చు.

Different Tomato Face Mask Recipes You Should Try At Home

టమోటోల్లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్ సి మరియు స్కిన్ కు ఉపయోగపడే ఇతర ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. టమోటోలలో ఉండే లైకోపిన్ కంటెంట్ చర్మంను లైట్ గా మార్చుతుంది. సన్ డ్యామేజ్ ను నివారిస్తుంది.

ప్రతి ఒక్కరికీ సహాయపడే టమోటో హెల్త్ బెనిఫిట్స్

టమోటోలో యాంటీ యాక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది ఫ్రీరాడికల్స్ ను నాశనం చేస్తుంది. దాంతో ఏజింగ్ లక్షణాలను దూరం చేసుకోవాలి. టమోటోలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. కాబట్టి, టమోటోలను ఉపయోగించి వివిధ రకాల ఫేస్ ప్యాక్ లను తయారుచేసుకుని, సాధ్యమైనన్ని బ్యూటి బెనిఫిట్స్ ఎలా పొందాలో తెలుసుకుందాం...

టమోటో మరియు తేనెతో ఫేస్ మాస్క్

టమోటో మరియు తేనెతో ఫేస్ మాస్క్

టమోటో ను మెత్తగా గుజ్జులా చేసి, అందులో ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. అలాగే నిమ్మరం కూడా మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 10 నిముషాల తర్వాత చల్లటి వాటర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి. టమోటో, హనీ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల డ్రై స్కిన్ నివారించబడుతుంది. స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది.

 టమోటో -అవొకాడో ఫేస్ మాస్క్ :

టమోటో -అవొకాడో ఫేస్ మాస్క్ :

డ్రై స్కిన్ నివారించడంలో టమోటో మరియు అవొకాడో బెస్ట్ కాంబినేషన్. టమోటోను మెత్తగా గుజ్జులా చేసి, అందులో అవొకాడో పేస్ట్ మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ తేమగ, మాయిశ్చరైజ్డ్ గా మారుతుంది.

టమోటో ఆలివ్ ఫేస్ ప్యాక్ :

టమోటో ఆలివ్ ఫేస్ ప్యాక్ :

టమోటో, ఆలివ్ ఫేస్ మాస్క్ యాక్నే, స్కిన్ ప్రోన్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఒక టమోటో తీసుకుని, పేస్ట్ చేసి, అందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా కొబ్బరి నూనె కూడా మిక్స్ చేసి సాప్ట్ పేస్ట్ గా తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖం, మెడకు అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు యాక్నే సమస్యను నివారిస్తుంది.

టమోటో ఓట్స్ ఫేస్ మాస్క్ :

టమోటో ఓట్స్ ఫేస్ మాస్క్ :

టమోటో మరియు ఓట్స్ ఫేస్ మాస్క్ యాక్నే మరియు స్కిన్ బ్రేక్ అవుట్స్ ను నివారిస్తుంది. అంతే కాదు బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ నివారించడంలో కూడా ఇది గ్రేట్ రెమెడీ. ఒక టమోటో తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి అందులో ఓట్స్ పౌడర్, తేనె,నిమ్మరసం మిక్స్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకుని, అరగంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

టమోటో -పెరుగు ఫేస్ మాస్క్ :

టమోటో -పెరుగు ఫేస్ మాస్క్ :

టమోటోలో పెరుగు ఫేస్ మాస్క్ స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది. ఒక టమోటో తీసుకుని, అందులో పెరుగు, తేనె మరియు కొద్దిగా పసుపు చేర్చి, పేస్ట్ లా చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా వేసుకుంటుంటే నేచురల్ స్కిన్ టోన్ పొందుతారు.

టమోటో -కివి ఫేస్ మాస్క్ :

టమోటో -కివి ఫేస్ మాస్క్ :

టమోటో, కివి ఫేస్ మాస్క్ డ్రై అండ్ డల్ స్కిన్ నివారిస్తుంది. ఒక టమోటో తీసుకుని, మెత్తగా పేస్ట్ చేసి, అందులో కివి ఫ్రూట్ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేసుకుని, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 టమోటో మరియు అలోవెర ఫేస్ మాస్క్ :

టమోటో మరియు అలోవెర ఫేస్ మాస్క్ :

టమోటో మరియు అలోవెర ఫేస్ మాస్క్ డార్క్ సర్కిల్స్ ను , డార్క్ స్పాట్స్ ను నివారిస్తుంది. టమోటో పేస్ట్ తీసుకుని,అందులో కొద్దిగా అలోవెర జెల్ మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ వల్ల చర్మంలో చీకాకు, మంటను, దురదను తొలగిస్తుంది.

English summary

Different Tomato Face Mask Recipes You Should Try At Home

Tomato is one among the staple fruits we can find in every Indian kitchen. This fruit is excellent for our skin and health due to a lot of nutrients and vitamins in it. You could prepare some of the best homemade tomato face pack recipes.
Story first published: Wednesday, April 12, 2017, 18:30 [IST]
Subscribe Newsletter