For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అందమైన చర్మం కోసం సులభమైన DIY మనుకా హనీ ఫేస్ ఫ్యాక్స్

మీ చర్మానికి చక్కటి నిగారింపుని తీసుకురావాలంటే మీరు ఖచ్చితంగా మనుకా తేనెను మీ బ్యూటీ రొటీన్ లో భాగం చేసుకోవాలి. ఈ పదార్ధం మీ చర్మానికి అదనపు అందాన్ని అందిస్తుంది.మనుకా తేనెను మీరు నేరుగా చర్మానికి అప్

|

ప్రపంచవ్యాప్తంగా మనుకా హనీలో లభించే చర్మ సంరక్షణ గుణాలు ప్రాచుర్యం పొందాయి. మనుకా చెట్లు సమృద్ధిగా ఉండే ఆస్ట్రేలియా మరియు న్యూజీలాండ్ దేశాలలో మనుకా హనీ ఉత్పత్తి అవుతుంది.

ఈ ప్రత్యేకరకమైన తేనెలో యాంటీబాక్ట్రయల్ అలాగే యాంటీఇన్ఫలమేటరీ ప్రాపర్టీలు సమృద్ధిగా ఉంటాయి. ఈ లక్షణాలు చర్మ సంబంధిన సమస్యలైన యాక్నే, ఎక్జిమా, ఏజింగ్ లక్షణాలతో పాటు మరిన్ని చర్మ సమస్యలను నయం చేయడానికి ఉపయోగపడతాయి.

ఇందులో లభించే అద్భుతమైన చర్మసంరక్షణ పోషక విలువల వల్ల, మహిళలు మనుకా తేనెను తమ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. మానుకా హనీని చర్మ సంరక్షణ కొరకు వాడడం వలన అనేక చర్మ సమస్యలను అధిగమించవచ్చు అలాగే చర్మానికి కొత్త కాంతిని సంతరించుకోవచ్చు.

manuka honey face packs | honey face packs for gorgeous skin

సంక్షిప్తంగా చెప్పాలంటే, మీ చర్మానికి చక్కటి నిగారింపుని తీసుకురావాలంటే మీరు ఖచ్చితంగా మనుకా తేనెను మీ బ్యూటీ రొటీన్ లో భాగం చేసుకోవాలి. ఈ పదార్ధం మీ చర్మానికి అదనపు అందాన్ని అందిస్తుంది.

మనుకా తేనెను మీరు నేరుగా చర్మానికి అప్లై చేయవచ్చు లేదా గ్రీన్ టీ, అలో వెరా వంటి చర్మానికి అత్యంత ప్రయోజనకరమైన పదార్థాలతో కలిపి కూడా వాడవచ్చు.

ఇక్కడ, మనుకా హనీ ఫేస్ ప్యాక్స్ ని సులభ పద్దతులలో ఏ విధంగా తయారు చేసుకోవాలో విపులంగా వివరించాము. ఈ ఫేస్ ప్యాక్స్ ని వాడడం ద్వారా వివిధ రకాలైన చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

చర్మానికి నిగారింపుని కలిగించే వివిధ రకాల మనుకా ఫేస్ ప్యాక్స్ ని ఇక్కడ వివరించాము. ఇవి పాటించి మీ చర్మంలోని ఆశాజనకమైన మార్పును గమనించండి.

గమనిక: ఏదైనా ఫేస్ ప్యాక్ ని ముఖానికి అప్లై చేయడానికి ముందు స్కిన్ ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం తప్పనిసరి.

1. మనుకా హనీతో గ్రీన్ టీ పౌడర్:

1. మనుకా హనీతో గ్రీన్ టీ పౌడర్:

రెండు టీస్పూన్ల మనుకా హనీతో అర టీస్పూన్ గ్రీన్ టీ పౌడర్ ని కలిపి మిశ్రమాన్నితయారుచేసుకోండి. ఈ ప్యాక్ ని మీ చర్మంపై అప్లై చేసి అయిదు నుండి పది నిమిషాల వరకు ఉంచండి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ఈ ప్యాక్ ని తొలగించండి. ఈ ప్యాక్ ని రెండువారాలకు ఒకసారి ప్రయత్నించి ఆశించిన ఫలితాన్ని పొందండి.

2. మనుకా హనీతో వెనిల్లా ఎక్స్ట్రాక్ట్:

2. మనుకా హనీతో వెనిల్లా ఎక్స్ట్రాక్ట్:

ఒక టేబుల్ స్పూన్ మనుకా హనీతో అరా టీస్పూన్ వెనిల్లా ఎక్స్ట్రాక్ట్ ని కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై జాగ్రత్తగా అప్లై చేసి దాదాపు పదిహేను నిమిషాల వరకు అలాగే ఉంచండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో మీ ముఖాన్ని శుభ్రపరుచుకోండి. ఈ ప్యాక్ ని ప్రయత్నించి చక్కటి నిగారింపుని సొంతం చేసుకోండి.

 3. మనుకా హనీతో ఆలివ్ ఆయిల్:

3. మనుకా హనీతో ఆలివ్ ఆయిల్:

ఒక టేబుల్ స్పూన్ మనుకా హనీతో ఒక టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ని కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేసి పది నిమిషాల తరువాత శుభ్రమైన నీటితో కలపండి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ ని వాడడం ద్వారా చర్మానికి అవసరమైన పోషణని అందించవచ్చు.

4. మనుకా హనీతో పెరుగు:

4. మనుకా హనీతో పెరుగు:

ఈ ప్యాక్ ను తయారుచేయడం చాలా సులభం. రెండు టీస్పూన్ల మనుకా హనీని ఒక టేబుల్ స్పూన్ తాజా పెరుగుతో కలపాలి. ఈ మిశ్రమాన్ని పేషియల్ స్కిన్ పై సున్నితంగా అప్లై చేయాలి. దాదాపు పది నిమిషాల తరువాత క్లీన్సర్ తో శుభ్రం చేసుకోవాలి. మచ్చలు కలిగిన చర్మానికి ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. వారానికి ఒకసారి ఈ ప్యాక్ ను వాడితే మంచి ఫలితం పొందవచ్చు.

5. మనుకా హనీతో పాల పొడి:

5. మనుకా హనీతో పాల పొడి:

ఒక టేబుల్ స్పూన్ మనుకా హనీతో ఒక టీస్పూన్ పాలపొడిని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి. పది నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడగాలి. నెలలో రెండు సార్లు ఈ ప్యాక్ ను అప్లై చేసినట్లయితే అందమైన చర్మం మీ సొంతమవుతుంది.

6. మనుకా హనీతో నిమ్మరసం:

6. మనుకా హనీతో నిమ్మరసం:

ఒక కప్పులో ఒక టేబుల్ స్పూన్ మనుకా హనీని అలాగే రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక సన్నటి పొరలాగా చర్మంపై అప్లై చేయాలి. అయిదు నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడగాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

7. మనుకా హనీతో ఎగ్ వైట్:

7. మనుకా హనీతో ఎగ్ వైట్:

ఒక కప్పులో ఎగ్ వైట్ ని తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ మనుకా హనీని కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అప్లై చేసుకొని పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. పోర్ సైజ్ ని తగ్గించుకోవడం కోసం ఈ ప్యాక్ సహాయపడుతుంది.అలాగే చర్మంలోని ఎలాస్టిన్ ఉత్పత్తిని కూడా ఈ ప్యాక్ పెంపొందిస్తుంది.

8. మనుకా హనీతో అలో వెరా జెల్:

8. మనుకా హనీతో అలో వెరా జెల్:

ఒక టేబుల్ స్పూన్ మనుకా హనీని అలాగే ఒక టేబుల్ స్పూన్ అలో వెరా జెల్ ని కలిపి పేస్ ప్యాక్ ని తయారుచేసుకోవాలి. ఈ ప్యాక్ ని మీ ముఖంపై అలాగే మెడపై చక్కగా అప్లై చేయాలి. పది నిమిషాల తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ తో మీ చర్మాన్ని గారాబం చేస్తే యాక్నే వంటి చర్మ సంబంధిత సమస్యలను సులభంగా అధిగమించవచ్చు.

9. మనుకా హనీతో బాదం పొడి:

9. మనుకా హనీతో బాదం పొడి:

గుప్పెడు బాదం పప్పులను తీసుకుని బ్లెండర్ లో వేసి మెత్తని పొడిని తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఒక టీస్పూన్ బాదాం పొడిలో రెండు టీస్పూన్ల మనుకా హనీని కలపాలి. ఈ ఫేస్ ప్యాక్ ను మీ ముఖంపై అప్లై చేసుకొని పది నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడగాలి. ఈ బ్యూటీ ప్యాక్ ని వారానికి ఒకసారి అప్లై చేసుకున్నట్లయితే చర్మంలో చక్కటి నిగారింపుని గమనించవచ్చు.

English summary

manuka honey face packs | honey face packs for gorgeous skin

Here, we've compiled a list of easy-to-make Manuka honey face packs that can beautify your skin whilst treating various unsightly skin conditions. Try the following packs to get the kind of skin you've always yearned for:
Desktop Bottom Promotion