సర్ ప్రైజ్: గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ తో క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీసొంతం...

Posted By:
Subscribe to Boldsky

ఈ మద్య కాలంలో గ్రీన్ టీ బాగా ఫేమస్ అయ్యింది. గ్రీన్ టీని ఆరోగ్యానికి ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకున్నారు. వాడుతున్నారు కూడా, మరి గ్రీన్ టీలో ఉండే బ్యూటి బెనిఫిట్స్ ఎంత మందికి తెలుసు..? గ్రీన్ టీని తాగినప్పుడు శరీరాన్ని ఏవిధంగా డిటాక్సిఫై చేస్తుందో, అదే విధంగా గ్రీన్ టీ బ్యూటి కోసం ఉపయోగించినప్పుడు అదే విధంగా డిటాక్స్ చేస్తుంది.

ఎందుకంటే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇవి హెల్తీ అండ్ రేడియంట్ స్కిన్ ను అందిస్తుంది. గ్రీన్ టీ ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది. గ్రీన్ టిని ఫేస్ ప్యాక్స్ లో ఉపయోగించినప్పుడు ముఖంలో ఫైన్ లైన్స్ మరియు ముడుతలను నివారిస్తుంది.

Green Tea Face Masks To Try At Home For Fair Skin

మరి అటువంటి క్లియర్ అండ్ క్లీన్ గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే , ఈ రోజు నుండి కొన్ని రకాల గ్రీన్ టీ ఫేస్ మాస్క్ లను ప్రయత్నించండి...

 గ్రీన్ టీ మరియు బియ్యం పిండితో ఫేస్ మాస్క్

గ్రీన్ టీ మరియు బియ్యం పిండితో ఫేస్ మాస్క్

గ్రీన్ టీ మరియు బియ్యం పిండి ఫేస్ మాస్క్ ఆయిల్ స్కిన్ ను నివారిస్తుంది. అరకప్పు గ్రీన్ టీ వాటర్ లో రెండు స్పూన్ల బియ్యం పిండి మిక్స్ చేయాలి. అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఈ మాస్క్ ను అప్లై చేసిన అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. బియ్యం పిండి డార్క్ స్పాట్స్ , స్కిన్ పిగ్మెంటేషన్ నివారిస్తుంది. దాంతో చర్మంలోని ఎక్సెస్ ఆయిల్ ను గ్రహిస్తుంది. చర్మం తేమగా ఉంచుతుంది.

 గ్రీన్ టీ మరియు క్రీమ్ ఫేస్ మాస్క్

గ్రీన్ టీ మరియు క్రీమ్ ఫేస్ మాస్క్

అరకప్పు క్రీమ్ మరియు కొద్దిగా గ్రీన్ టీ వాటర్ తీసుకోవాలి, అందులో పందార మిక్స్ చేయాలి. అలాగే కొద్దిగా బ్రౌన్ షుగర్ ను మిక్స్ చేయాలి. ఈ పదార్థాలన్ని కూడా బాగా మిక్స్ చేసి, మొత్తం కరిగే వరకూ స్పూన్ తో మిక్స్ చేయాలి. ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి 20 నిముసాల తర్వాత సర్క్యులర్ మోషన్ లో మర్ధన చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

గ్రీన్ టీ మరియు నిమ్మరసం:

గ్రీన్ టీ మరియు నిమ్మరసం:

కొద్దిగా గ్రీన్ టీ వాటర్ తీసుకుని, అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. తర్వాత అందులో ఆలివ్ ఆయిల్, ఆముదం కూడా మిక్స్ చేసి అన్నింటిని కలిసే విధంగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పూర్తిగా డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి ముఖంలో డార్క్ స్పాట్స్, మచ్చలను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఏజింగ్ లక్షణాలను నివారిస్తుంది.

 గ్రీన్ టీ మరియు హనీ ఫేస్ మాస్క్ :

గ్రీన్ టీ మరియు హనీ ఫేస్ మాస్క్ :

గ్రీన్ టీ వాటర్ మరియు కొద్దిగా తేనె తీసుకుని అందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మూడు బాగా మిక్స్ అయ్యే వరకూ ఉండనిచ్చి తర్వాత ఈ మాస్క్ ను ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. తేనె ఫేస్ మాస్క్ డ్రైస్కిన్ కు ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఇది చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఇది చర్మానికి డీప్ గా పోషణను అందిస్తుంది. ఈ ప్రొసెస్ ను రిపీట్ చేయడం వల్ల చర్మంలో డ్రై నెస్ తొలగిపోతుంది. చర్మంలో దురద తగ్గుతుంది.

 గ్రీన్ టీ మరియు అలోవెర ఫేస్ మాస్క్ :

గ్రీన్ టీ మరియు అలోవెర ఫేస్ మాస్క్ :

గ్రీన్ టీ తీసుకుని, అందులో కొద్దిగా అలోవెర జెల్ మిక్స్ చేసి, రెండూ బాగా మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. ఈ ప్యాక్ ను ముఖానికి వేసుకుని, మసాజ్ చేయాలి. 10 నిముషాలు మసాజ్ చేసిన తర్వాత 15 నిముషాల తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ మాస్క్ ను ఉపయోగించుకోవడం వల్ల చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ఈ ప్యాక్ ను రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పెరుగుతుంది. చర్మంలో దురద , రెడ్ నెస్, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది.

 గ్రీన్ టీ మరియు ఓట్స్ ఫేస్ మాస్క్

గ్రీన్ టీ మరియు ఓట్స్ ఫేస్ మాస్క్

కొద్దిగా గ్రీన్ టీ వాటర్ ను తీసుకుని, అందులో అరకప్పు ఓట్స్ పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి, మీకు రెగ్యులర్ గా ఉపయోగించే నూనెను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. కొద్దిసేపు వెయిట్ చేసి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. గ్రీన్ టీ మరియు ఓట్స్ ఫేస్ మాస్క్ చర్మంను డీప్ గా ఎక్స్ ఫ్లోయేట్ చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.

గ్రీన్ టీ మరియు ఎగ్ వైట్ ఫేస్ మాస్క్ :

గ్రీన్ టీ మరియు ఎగ్ వైట్ ఫేస్ మాస్క్ :

మొటిమలతో బాధపడుతున్నట్లై దీనికి గ్రీన్ టీ మరియు ఎగ్ వైట్ ఫేస్ మాస్క్ ను అప్లై చేస్తే ఈ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. కొద్దిగా గ్రీన్ టీ వాటర్ తీసుకుని అందులో ఎగ్ వైట్ మిక్స్ చేయాలి. కొద్దిగా నిమ్మరసం, శెనగపిండిని వేసి బాగా స్పూన్ తో మిక్స్ చేయాలి. ఈ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి 20 నిముషాలు మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత ముఖం చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి.

 గ్రీన్ టీ మరియు షుగర్ ఫేస్ మాస్క్ :

గ్రీన్ టీ మరియు షుగర్ ఫేస్ మాస్క్ :

ఒక కప్పు గ్రీన్ టీ మరియు ఒక స్పూన్ బ్రౌన్ షుగర్ ను మిక్స్ చేయాలి. అలాగే ఇందులో ఎప్సమ్ సాల్ట్ , తేనె మిక్స్ చేసి ఈ మాస్క్ ను ముఖానికి అప్లై చేసి, సర్కులర్ మోషన్ లో మసాజ్ చేయాలి. 10 నిముషాలు తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. గ్రీన్ టీ ఫేస్ మాస్క్ చర్మంను హెల్తీగా ఉంచుతుంది, కాంతివంతంగా మార్చుతుంది.

English summary

Green Tea Face Masks To Try At Home For Fair Skin

Green tea is one among the best ingredients that a can help to detox your face and also help to promote healthy and glowing skin. Green is packed with a high amount of antioxidants and proteins which help to promote healthy and radiant skin
Story first published: Thursday, April 6, 2017, 11:57 [IST]
Please Wait while comments are loading...
Subscribe Newsletter