For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేషియల్ స్కిన్ సాప్ట్ గా..బ్రైట్ గా మార్చే గ్రీన్ టీ ఫేషియల్ మిస్ట్ ..!!

సీజన్ వింటర్ అయినా..సమ్మర్ అయినా..ఇండియాలో హుముడిటీ నుండి తప్పించుకోలేరు. !అందుకే సీజన్ తో సంబంధ లేకుండా శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. అందుకు గ్రీన్ టీ ఫేస్ మిస్ట్ 24x7 చర్మంను కాపాడుతుంది.

|

సీజన్ వింటర్ అయినా..సమ్మర్ అయినా..ఇండియాలో హుముడిటీ నుండి తప్పించుకోలేరు. !అందుకే సీజన్ తో సంబంధ లేకుండా శరీరంను హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. అందుకు గ్రీన్ టీ ఫేస్ మిస్ట్ 24x7 చర్మంను కాపాడుతుంది. వాతావరణంలో హ్యుమిడిటీ వల్ల చర్మం త్వరగా డల్ గా మారుతుంది. నిరంతరం చర్మంను రిఫ్రెష్ చేసుకోవడం చాలా అవసరం.

రిఫ్రెషింగ్ కోసం గ్రీన్ టీనే ఎందుకు? గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్స్, అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి గ్రేట్ గా సహాయపడుతాయి. చర్మంలో కోల్పోయిన తేమను తిరిగి రీస్టోర్ అవ్వడానికి సహాయపడుతుంది.

Green Tea Facial Mist Recipe To Brighten & Refresh Your Skin!

అంతే కాదు, గ్రీన్ టీ లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చర్మంలో ఇరిటేషన్ తగ్గిస్తుంది. ఎక్సెస్ ఆయిల్ ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేస్తుంది. డ్యామేజ్ అయిన స్కిన్ సెల్స్ ను రిపేర్ చేస్తుంది.

ఈ హెర్బల్ రెమెడీకి మరో అమేజింగ్ బ్యూటి ప్రొడక్ట్ మిక్స్ చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఆ బ్యూటీ ప్రొడక్ట్ ఏంటంటే ఒకటి రోజ్ వాటర్, రోజ్ హిప్ ఆయిల్, ఈ కాంబినేషన్ మిశ్రమంలో ఓమేగా 6 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉంటుంది. ఇది స్కిన్ మాయిశ్చరైజర్ కోల్పోకుండా చేస్తుంది .

రోజ్ వాటర్ స్కిన్ టోనర్ గా పనిచేస్తుంది, నిమ్మతొక్క స్కిన్ సెల్స్ ను ఉత్తేజపరుస్తుంది. చర్మంను కాంతివంతంగా మార్చుతుంది. నిమ్మతొక్కలో ఉండే సిట్రిక్ యాసిడ్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది, ఫలితంగా చర్మం స్మూత్ గా మారుతుంది, క్లియర్ స్కిన్ కంప్లెక్షన్ పొందుతారు .

ఈ పదార్థాలన్నింటికి కలిపి అమేజింగ్ ఫేషియల్ మిస్ట్ ను ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఈ ఫేషియల్ రెమెడీ ఆయిల్ స్కిన్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. డల్ స్కిన్ ను నేచురల్ గా మార్చడానికి ఇదిఏవిధంగా ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

స్టెప్ 1 :

స్టెప్ 1 :

రెండు కప్పుల డిస్టిల్డ్ వాటర్ వేడి చేసి, అందులో రెండు గ్రీన్ టీ బ్యాగ్ లను డిప్ చేసి వేడి చేయాలి. 10 నిముషాల తర్వాత హీట్ నుండి క్రిందికి దింపుకోవాలి.

స్టెప్ 2 :

స్టెప్ 2 :

స్టౌ ఆఫ్ చేసిన తర్వాత గ్రీన్ టీని చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తాగాలి. స్ట్రాంగ్ గా లేదంటో మరో టీబ్యాగ్ ను డిప్ చేసుకోవచ్చు.

స్టెప్ 3:

స్టెప్ 3:

తర్వాత ఈ గ్రీన్ టీని వడగట్టుకోవాలి. గ్రీన్ టీలో రోజ్ హిప్ ఆయిల్ మూడు నాలుగు చుక్కలు వేయాలి. ఇది చర్మం డ్రైగా మారకుండా నివారిస్తుంది. అలాగే చర్మానికి రేడియంట్ లుక్ ను అందిస్తుంది.

స్టెప్ 4 :

స్టెప్ 4 :

తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. రోజ్ వాటర్ గ్రేట్ క్లెన్సర్ గా పనిచేస్తుంది. ఇది చర్మంలో మలినాలను తొలగిస్తుంది. చర్మంలో ఎక్సెస్ ఆయిల్ ఉత్పత్తి కాకుండా నివారిస్తుంది.

స్టెప్ 5:

స్టెప్ 5:

కొద్దిగా నిమ్మతొక్కను తీసుకుని తురుముకోవాలి. దీన్ని నుండి రసాన్ని తీసి, గ్రీన్ టీ మిశ్రమంలో కలపాలి.

స్టెప్ 6:

స్టెప్ 6:

ఈ మొత్తం మిశ్రమం బాగా మిక్స్ చేసి స్ప్రే బాటిల్లో నింపుకోవాలి. దీన్ని రిఫ్రిజరేటర్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా ఫ్రిజ్ లో పెట్టిన ద్రవాన్ని వాడటం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. చర్మంను కాంతివంతంగా మార్చుతుంది.

స్టెప్ 7 :

స్టెప్ 7 :

చర్మం డల్ గా అనిపించినప్పుడు , ఈ స్ప్రే బాటిల్ బయటకు తీసుకుని, కళ్ళు రెండూ మూసుకుని, ముఖం , మెడ మొత్తం స్ప్రే చేసుకోవాలి. నేచురల్ గా ముఖం మొత్తం తడివనివ్వాలి. ఎక్కువ పడితే కనుక టిష్యు పేపర్ తో ప్రెస్ చేయాలి. ఇలా చేయడం వల్ల డల్ స్కిన్ ను నేచురల్ గా తగ్గించుకోవచ్చు,.

సూచనలు:

సూచనలు:

గ్రీన్ టీ ఫేస్ మిస్ట్ పొరపాటున కళ్ళలోకి పడితే, నార్మల్ వాటర్ తో ముఖం లేదా కళ్లు మాత్రమే కడిగేసుకోవచ్చు.

మీ చర్మం మరీ డ్రైగా అనిపిస్తే , ఈ ద్రవాన్ని ముఖానికి చిలకరించుకోవడానికి ముందు ముఖంను నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. మురికి ఉన్నట్లైతే చర్మం రంద్రాలు మూసుకుపోతాయి. అలా జరగకూడదనుకుంటే ముందు ముఖం శుభ్రం చేసుకోవాలి.

ఈ ఫేష్ మిస్ట్ చర్మంను కాంతివంతంగా మార్చుతుంది, ఈ వాటర్ లో విటమిన్ ఇ క్యాప్స్యుల్ జెల్ ను కూడా మిక్స్ చేసుకోవచ్చు. అయితే పరిమితంగా మాత్రమే జోడించాలి.

ముగింపు:

ముగింపు:

ఈ హెర్బల్ మిస్ట్ ఉపయోగించే ప్రతి సారి , మీ చర్మం సాప్ట్ గా, స్మూత్ గా , సపెల్ గా కనుబడటాన్ని మీరు గమనిస్తారు.

English summary

Green Tea Facial Mist Recipe To Brighten & Refresh Your Skin!

Repair, revive and rejuvenate your dull skin with this green tea face mist!
Desktop Bottom Promotion