అడల్ట్స్ లో మొటిమలను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ,

Posted By:
Subscribe to Boldsky

ముఖం చూడగానే మెరుస్తూ, కాంతివంతంగా కనబడిందింటే అందుకు కారణం వారు తీసుకుని రెగ్యులర్ స్కిన్ కేర్ వల్లే..అలాగే చర్మం సంరక్షణ కోసం వారు తీసుకునే ప్రత్యేకమైన డైట్ వల్లే . అయితే కొంత మంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మద్యవయస్కుల్లో కూడా మొటిమలు బాధిస్తుంటాయి. అంతే కాదు ఆ వయస్సులో మొటిమలతో నలుగురిలోకి వెళ్ళాలంటే అసౌకర్యంగా ఫీలవుతుంటారు. పెద్దవాళ్ళలో వచ్చే మొటిమలు, కాస్త మొండిగా చర్మంలో తిష్ట వేస్తాయి. ఇవి అంత త్వరగా పోవు.

సహాజంగా అడల్ట్ లో మొటిమలు ముఖం, ఛాతీ మరియు మెడబాగంలో బాధిస్తుంటాయి. చాలా మంది మహిళల్లో హార్మోనుల అసమతుల్యత కారణంగా మొటిమలు బాధిస్తుంటాయి. అలాగే మోనోపాజ్ స్టేజ్ లో ఉన్న మహిళలల్లో కూడా ఈ మొటిమల సమస్య ఉంటుంది. ఇంకా మహిళల్లో పీరియడ్స్ సమయంలో కూడా మొటిమలను బాధిస్తాయి. స్ట్రెస్ మరియు పోషకాహార లోపం కూడా హార్మోనుల అసమతుల్యతకు దారితీస్తుంది. మొటిమలకు కారణమవుతుంది.

అడల్ట్ ఏజ్ లో మొటిమలు బాధిస్తుంటే..ఇక్కడ కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా మొటిమలను తొలగిస్తాయి. వీటివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ మొటిమల నివారించడంలో పవర్ హౌస్ వంటిది. యాపిల్ సైడర్ వెనిగర్ బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. స్కిన్ పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. మూడు బాగాలు నీళ్లు, ఒక బాగం యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

దాల్చిన చెక్క తేనె మాస్క్ :

దాల్చిన చెక్క తేనె మాస్క్ :

రెండు చెంచాల తేనెలో ఒక చెంచా దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేసి, ఈ పేస్ట్ ను మొటిమల మీద అప్లై చేసి అ5 నిముషాల తర్వాత గోరువెచ్చరని నీటితో ముఖం శుభ్రం చేుకోవాలి. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొటికలకు సంబంధించిన బ్యాక్టీరియాను చర్మం నుండి తొలగిస్తుంది. తేనె యాంటీబయోటిక్ గా పనిచేసి, మొటిమలను డ్రైగా మార్చుతుంది. మొటిమలను నివారిస్తుంది.

బొప్పాయి :

బొప్పాయి :

హార్మోనుల అసమతుల్యతల కారణంగా వచ్చే మొటిమలను నివారించడంలో బొప్పాయి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను నివారిస్తుంది. ఎక్సెస్ ఆయిల్ ను చర్మం నుండి తొలగిస్తుంది. బొప్పాయిని కొద్దిగా తీసుకుని మొత్తగా పేస్ట్ చేయాలి. దీన్ని చర్మానికి అప్లై చేసి 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుబ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ తో హార్మోనల్ సమస్యతో వచ్చిన మొటిమలను తొలగిస్తుంది.

టూత్ పేస్ట్ :

టూత్ పేస్ట్ :

అడల్ట్ పింపుల్ ను తొలగించడంలో టూత్ పేస్ట్ గొప్పగా సహాయపడుతుంది. ఇది మొటిమల సైజ్ ను తగ్గిస్తుంది. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుందిజ కొద్దిగా టూత్ పేస్ట్ తీసుకుని, మొటిమల మీద అప్లై చేయాలి. కాటన్ తో మొటిమల మీద మాత్రమే అప్లై చేయాలి. రాత్రి నిద్రించే ముందు అప్లై చేసి ఉదయం చల్లటి నీళ్లతో శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

 టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్ :

చర్మం రంద్రాలు మూసుకుపోయినప్పుడు ఎక్కువగా మొటిమల సమస్య ఉంటుంది. ఈ సమస్యను నివారించుకోవడానికి టీట్రీ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మంలోని ఎక్స్ ట్రా సెబమ్ ను తొలగిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. చర్మం రంద్రాలను తెరచుకునేలా చేసి చర్మంను శుభ్రం చేస్తుంది. టీట్రీ ాయిల్లో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయపడుతుంది. చర్మానికి కావల్సిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.

అరటి తొక్క:

అరటి తొక్క:

అరటి తొక్కలో లూటిన్ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది. హై యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఇది. ఇది ఇన్ఫ్లమేషన్ మరియు ముఖంలో వాపు తగ్గిస్తుంది. అరటి తొక్కను ఉపయోగించడం వల్ల చర్మంలో హెల్తీ సెల్ గ్రోత్ ఉంటుంది. అరటి తొక్కను తీసుకుని, చర్మానికి అప్లై చేసి, సర్క్యులర్ మోషన్ లో మర్ధన చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. అరటి తొక్కను ఉపయోగించడం వల్ల అడల్ట్ ఏన్స్ తొలగిపోతాయి.

అలోవెర జెల్ :

అలోవెర జెల్ :

మొటిమలతో పోరాడే గుణాలు అలోవెర జెల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇందులో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షనాలు అధికంగా ఉన్నాయి. ఇది చర్మంలో మొటిమలను మరియు రెడ్ నెస్ ను తగ్గిస్తుంది. అలోవెర జెల్ తీసుకుని, ముఖానికి అప్లై చేయాలి.కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా అలోవెర జెల్ అప్లై చేయడం వల్ల మొటిమలను సులభంగా తొలగిపోతాయి.

నిమ్మరసం :

నిమ్మరసం :

నిమ్మరసంలో విటమిన్ సి మరియు ఎసిటిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ముఖంలో మొటిమలను ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. నిమ్మరసం ముఖంలో మొటిమలను బ్రేక్ అవుట్ చేస్తాయి. ఇది చర్మంలో ఒక ఆస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. నిమ్మరంసను ముఖానికి నేరుగా అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. మొటిమలను నివారించడంలో ఇది ఒక బెస్ట్ పదార్థం . వెల్లుల్లిని మెత్తగా చేసి మొటిమల మీద నేరుగా అప్లై చేయాలి. కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

English summary

Home Remedies To Treat Adult Acne

Glowing and radiant skin reflects a proper skin care routine and a healthy diet. However, suffering from adult acne can be really very embarrassing, as it is stubborn and due to its big size it cannot be gotten rid of easily.
Story first published: Thursday, March 2, 2017, 16:33 [IST]
Subscribe Newsletter