ఎండ వల్ల డ్యామేజై నల్లగా మారిన చర్మం తిరిగి పూర్వస్థితి తీసుకొచ్చే రెమెడీస్

Posted By:
Subscribe to Boldsky

వేసవి కాలం ఎండలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఎండకు తోడు, వాతావరణంలో కాలుష్యం, దుమ్ము, ధూళి మరియు ఇతర కొన్ని ప్రదేశాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. ఈ హాట్ సమ్మర్ లో ఎండ వేడికి చర్మం మరియు జుట్టు ఎక్కువగా ప్రభావితం అవుతుంది. సన్ డ్యామేజ్ కాకుండా కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.

ఎండ వల్ల సూర్యకిరణాల నుండి వెలువడే యూవీ కిరణాలు చర్మంను ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. అంతే కాదు చర్మం నల్లగా మారుతుంది. సూర్య కిరణాల నుండి వెలువడే యూవి రేస్ చర్మంలోని నేచురల్ ఆయిల్స్ ను తగ్గించేస్తుంది. అంటే ఇది చర్మంను పూర్తిగా డ్రైగా మార్చేస్తుంది. దాంతో చర్మం ట్యాన్ గా మారి డీహైడ్రేషన్ కు గురి అవుతుంది.

ముఖ్యంగా ఆల్ట్రావయోలెట్ కిరణాలు స్కిన్ బర్న్ చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్కిన్ క్యాన్సర్ కూడా దారితీస్తుంది. కాబట్టి, ఇప్పటికీ మీరు సన్ టాన్ మరియు సన్ డ్యామేజ్ స్కిన్ తో బాధపడుతుంటే కనుక మీకోసం ఇక్కడ కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. ఇవి చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతాయి.అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

1. అలోవెర జెల్ :

1. అలోవెర జెల్ :

అలోవెర జెల్ ఎండ వేడి నుండి చర్మాన్ని రక్షిస్తుంది. గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది. అలోవెర జెల్లో ఉండే నీరు ఇన్ స్టాంట్ రిలీఫ్ ఇస్తుంది. అలోవెర జెల్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ స్కిన్ డ్యామేజ్ ను నివారిస్తాయి. ఎండ వల్ల చర్మం డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. అలోవెర జెల్ ను కొద్దిగా తీసుకుని, అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

2. పాలు :

2. పాలు :

ఎండ నుండి చర్మాన్ని రక్షించడంలో మరో రెమెడీ పాలు. ఇది సన్ బర్న్ స్కిన్ కు చికిత్సను అందిస్తుంది. పాలలో ఉండే ప్రోటీన్స్, ఫ్యాట్స్ మరియు విటమిన్స్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని స్మూత్ గా మార్చుతుంది. కొద్దిగా చల్లటి పాలను తీసుకుని, దానికి కొద్దిగా ఐస్ క్యూబ్స్ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం చల్లగా సన్ బర్న్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

3. ఆపిల్ సైడర్ వెనిగర్ :

3. ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ సూర్యుని నిండి చర్మం డ్యామేజ్ కాకుండా చేస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను చర్మానికి అప్లై చేసినప్పుడు ఇది చర్మంలో యాస్ట్రిజెంట్ గా పనిచేసి, చర్మ రంద్రాలను ష్రింక్ చేస్తుంది. సన్ బర్న్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అరకప్పు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుని, అరకప్పు వాటర్ తో మిక్స్ చేయాలి. ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి, చర్మానికి అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

4. బేకింగ్ సోడ :

4. బేకింగ్ సోడ :

బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల, సన్ బర్న్ నుంది త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. సన్ డ్యామేజ్డ్ స్కిన్ కు ట్రీట్ చేస్తుంది. అరటీస్పూన్ బేకింగ్ సోడా తీసుకుని, చల్లటి నీటితో మిక్స్ చేయాలి. తర్వాత దీన్ని ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ రెమెడీని వారంలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

5. గ్రీన్ టీ :

5. గ్రీన్ టీ :

గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సన్ బర్న్ ను సులభంగా నివారిస్తుంది. కొద్దిగా గ్రీన్ టీ తీసుకుని అవసరమైనప్పుడు తాగాల్సి ఉంటుంది. అలాగే కొద్దిగా గ్రీన్ టీని ఒక బౌల్లో తీసుకుని, చల్లారిన తర్వాత , ఈ గ్రీన్ టీని సన్ బర్న్ స్కిన్ కు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

6. కీరదోసకాయ :

6. కీరదోసకాయ :

కీరదోసకాయలో యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి చర్మంను స్మూత్ గా మార్చుతుంది. సన్ బర్న్ నుండి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. కీరదోసకాయను ముక్కలుగా కట్ చేసి, చర్మానికి సున్నితంగా మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం పొందుతారు.

7. కొబ్బరి నూనె :

7. కొబ్బరి నూనె :

సన్ డ్యామేజ్ నుండి స్కిన్ రక్షించడానికి కొబ్బరి నూనె ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.కొబ్బరి నూనెలో ల్యూరిక్ యాసిడ్స్ అధికంగా ఉండుట వల్ల ఇది డ్యామేజ్ అయిన చర్మానికి తిరిగి కోలుకునేలా చేస్తుంది. అందుకోసం కొద్దిగా కొబ్బరి నూనెను తీసుకుని, చర్మానికి అప్లై చేయాలి. కొబ్బరి నూనె సన్ డ్యామేజ్ స్కిన్ నివారించడం మాత్రమే కాదు, ఇది వాపు , రెడ్ నెస్ ను తగ్గిస్తుంది.

8. ఓట్ మీల్ :

8. ఓట్ మీల్ :

ఓట్ మీల్ స్కిన్ ఎక్స్ ఫ్లోయేటర్ గా పనిచేస్తుంది. అలాగే ఎండ వల్ల డ్యామేజ్ అయిన చర్మంను నివారిస్తుంది. ఇందులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ కాంపౌండ్స్ సన్ డ్యామేజ్ స్కిన్ ను నివారిస్తుంది. కొద్దిగా ఓట్స్ తీసుకుని, అందులో పెరుగు చేర్చి ముఖానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

English summary

Home Remedies To Treat Sun Damaged Skin

Throughout the year, our skin tends to suffer due to dirt, dust, pollution and other such environmental factors. However, during the hot summer days, your skin and hair tend to suffer the most. We'd always suggest home remedies to treat sun damaged skin.
Story first published: Wednesday, March 22, 2017, 16:16 [IST]