For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీరియడ్స్ లో చర్మం డల్ గా కనబడకుండా..అందంగా..క్లియర్ గా కనబడాలంటే.?

హార్మోనుల ప్రభావం వల్ల కొన్ని సందర్భాలలో అనగా కొన్ని శుభకార్యాలలో, ఫంక్షన్లలో, పండగ సమయంలో మీరు రుతుక్రమంలో ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. ముఖం నిర్జీవంగా కనబడుతుంది. ముఖ చర్మంలో చాలా మర్పులు వస్తాయి.

|

12-50 సంవస్సరాల వయస్సు కలిగిన ప్రతీఒక్క మహిళకు రుతుక్రమం(పీరియడ్స్) వస్తుంది. ఈ బౌతిక పరిస్థితి ప్రతీ ఒక్క స్త్రీలో స్త్రీ తత్వాన్ని బయటకు తెస్తుంది. కాని రుతుక్రమ సమయంలో ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క విధంగా భాదను అనుభవిస్తుంది. నొప్పులు మరియు ఇతర భాదల వలన స్త్రీ రుతుక్రమ భాదను అనుభవిస్తుంది. కొన్ని మతపరమైన సమస్యల వలన మీరు రుతుక్రమ సమయంలో ఎక్కడకు వెళ్ళలేక పోతుంటారు? ఏపనిచేయాలన్నా మూడ్ ఉండదు. మ‌హిళ‌లు పీరియ‌డ్స్ స‌మ‌యంలో చాలా బాధ‌లు ఎదుర్కొంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ స‌మ‌యంలో వారి స‌మ‌స్య‌లు వ‌ర్ణ‌ణాతీతం అని చెప్పాలి. ఒంటి నొప్పులతో, మంటతో, మూడ్ స్వింగ్, తలనొప్పితో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వీట‌న్నిటికి కార‌ణం పీరియడ్స్ సమయంలో శరీరంలో జరిగే మార్పుల వల్లే ఇన్ని ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి.

ఈ హార్మోనుల ప్రభావం వల్ల కొన్ని సందర్భాలలో అనగా కొన్ని శుభకార్యాలలో, ఫంక్షన్లలో, పండగ సమయంలో మీరు రుతుక్రమంలో ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. ముఖం నిర్జీవంగా కనబడుతుంది. ముఖ చర్మంలో చాలా మర్పులు వస్తాయి. చర్మం డల్ గా కనబడుతుంది. ఇటువంటి పరిస్థితిలో చర్మం అందంగా కనబడుటకు స్పెషల్ కేర్ తీసుకోవడం చాలా అవసరం. అంతే కాదు ఈ సమయంలో చర్మంలో ఎలాంటి ఎక్సపరిమెంట్స్ అవసరం చేయనవసరం లేదు. పీరియడ్స్ తర్వాత చర్మం మాత్రమే కాదు ఓవరాల్ బాడీ హెల్త్ ఆరోగ్యంగా మారిపోతుంది.

పీరియడ్స్ లో హార్మోనుల ప్రభావం వల్ల శరీరంలో జరిగే మార్పులు బ్లీడింగ్ వల్ల చర్మంలో ఒత్తడి వల్ల చర్మం డల్ గా కనబడుతుంది. మొటిమలు కూడా సహజం. ఈ మార్పులన్నీ కూడా హార్మోనుల్లో మార్పుల కారణంగానే వస్తాయి. ఈ సమస్యలన్నింటిన ఎదుర్కొని, చర్మం క్లియర్ గా అందంగా కనబడాలంటే కొన్ని చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే..

స్టీమింగ్ :

స్టీమింగ్ :

చర్మంకు ఆవిరి పట్టడం వల్ల, ఇది చర్మానికి విశ్రాంతి కలిగించడం మాత్రమే కాదు, చర్మంను తేమగా, చర్మంలోని నాడులను ప్రశాంతంగా మార్చుతుంది. చర్మ రంధ్రాలు తెరచుకునేలా చేసి, అందులో నుండి మలినాలను తొలగించి చర్మంను క్లియర్ గా మార్చతుంది. మెటిమలు , మచ్చలు లేకుండా చేస్తుంది.

వార్మ్ టవల్ :

వార్మ్ టవల్ :

ఒక శుభ్రమైన టవల్ తీసుకుని, గోరువెచ్చని నీటిలో డిప్ చేసి, టవల్ ను చర్మం మీద అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి స్టీమ్ చేసినట్లే అవుతుంది.అయితే ఇలా చేయడం చాలా సులభం. వార్మ్ టవల్ తో చర్మం మీద మర్ధన చేయడం వల్ల చర్మంలో డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

ఎక్స్ ఫ్లోయేట్ :

ఎక్స్ ఫ్లోయేట్ :

స్క్రబ్బింగ్ లేదా ఎక్స్ ఫ్లోయేట్ చేయడం ఇది చర్మంలో మార్పులను తీసుకొస్తుంది. ఇలా చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. చర్మానికి స్ర్కబ్ చేయడం వల్ల చర్మ డ్రైగా మారకుండా ఉంటుంది

ఎక్స్ పెరిమెంట్స్ చేయకూడదు :

ఎక్స్ పెరిమెంట్స్ చేయకూడదు :

పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఎక్సపరిమెంట్స్ చేయకపోవడమే మంచిది. ఈ సమయంలో చర్మం చాలా సెస్సిటివ్ గా ఉంటుంది. కొత్తగా ఏవైనా ప్రయత్నాలు చేసి, ఫలితం ఉండదు. కాబట్టి, చర్మంలో ఎవైనా ఎక్సపెరిమెంట్స్ చేయాలని కోరుకున్నప్పుడు, పీరియడ్స్ తర్వాత చేయడం మంచిది.

రొటీన్ గా చేసేవి:

రొటీన్ గా చేసేవి:

చర్మానికి క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ వంటివి రొటీన్ గా చేస్తుంటారు కాబట్టి?వీటిని రెగ్యులర్ గా రొటీన్ గా ఫాలో అవ్వడం మంచిది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో కూడా అలాగే ఫాలో అవ్వడం వల్ల చర్మంలో పాడవకుండా, డల్ గా కనబడకుండా క్లియర్ స్కిన్ తో కనబడుతారు.

ఎక్కువ మేకప్ ను నివారించాలి:

ఎక్కువ మేకప్ ను నివారించాలి:

పీరియడ్స్ సమయంలో మేకప్ వేసుకోవడం వల్ల చర్మం మరింత డల్ గా మరియు వరెస్ట్ గా కనబడుతుంది. మీరు ఇది వరకే డల్ స్కిన్ తో కనబడుతున్నట్లైతే చర్మానికి ఎలాంటి ఫౌండేషన్ లేదా కన్సీలర్ ను ఉపయోగించుకోకపోవడమే మంచిది. ఇది అన్ని రకాల చర్మ తత్వాలకు ఉపయోగపడుతుంది. ఇది చర్మానికి తగినంత మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి. పెదాలకు నేచురల్ హోం మేడ్ మాయశ్చరైజింగ్ క్రీమ్స్ ను అప్లై చేయాలి. మేకప్ ను నివారించాలి.

English summary

How To Get Rid Of Dullness Of Skin During Periods

How To Get Rid Of Dullness Of Skin During Periods,Periods can be really difficult for all of us, what with the cramps and bleeding. But our skin starts acting up as well. Here are some skincare tips to follow during periods.
Story first published: Monday, January 23, 2017, 12:11 [IST]
Desktop Bottom Promotion